Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
Father's Day 2022:ఫాదర్స్ డే ప్రత్యేకతలేంటో చూసెయ్యండి...
ఫాదర్స్ డే 2022 సందర్భంగా తండ్రుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
సాధారణంగా ఈ ప్రపంచంలో తల్లులందరికీ తొలి ప్రాధాన్యత దక్కుతుంది. తల్లి తర్వాతే ఎవరైనా అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తల్లి తర్వాతి స్థానం తండ్రిదే. అందుకే మదర్స్ డే లాగానే ఫాదర్స్ డే కూడా జరుపుకుంటారు.

అయితే కేవలం తండ్రిని స్మరించుకునేందుకు మాత్రమే ఈ ప్రత్యేకమైన రోజు కాదనే విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజూ తల్లిదండ్రులతో ప్రత్యేకమే. అయితే ఫాదర్స్ డే సందర్భంగా మనం కొన్ని పనులను కచ్చితంగా చేయాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో జూన్ 19వ తేదీన ఫాదర్స్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఫాదర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? ఎలా జరుపుకోవాలి, ఫాదర్స్ డే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తండ్రికీ సరైన ప్రాధాన్యత..
ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క తండ్రికీ తన పిల్లల పట్ల తల్లి కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. కానీ పిల్లలు మాత్రం తల్లికే తొలి ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఆడపిల్లలు మాత్రం తల్లి కంటే తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. తమ జీవితంలో తొలి హీరో తమ తండ్రే గర్వంగా చెబుతుంటారు.ఈ ప్రపంచంలోని ప్రతి ఆడిపిల్ల అనేక సందర్బాల్లో తమ తండ్రి యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చెబుతూ ఉంటారు. తండ్రిపై తమకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు.సాధారణంగా తండ్రులందరూ పిల్లల విషయంలో కొంత కఠినంగా ఉన్నా.. వారి క్షేమం కోసం వారికేం చేయాలో తండ్రికి బాగా తెలుసు. అందుకే పిల్లలు ఏవైతే కోరుకుంటారో.. అలాంటి వాటిలో ఉత్తమమైనవాటిని ఇవ్వడానికి తండ్రి ఎల్లప్పుడూ రెడీగా ఉంటాడు.
ఫాదర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు?
ఈ లోకంలో తల్లికి ఉన్నంత గుర్తింపు తండ్రికి లేదనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందుకే తల్లితో పాటు తండ్రికి కూడా కనీస గుర్తింపు రావాలనే ఉద్దేశ్యంతో.. వారి త్యాగాలను, కష్టాలను గుర్తించడానికి ఓ రోజు ఉండాలని నిర్ణయించారు. అదే ఫాదర్స్ డే. అలా ప్రతి ఏటా జూన్ మూడో ఆదివారం నాడు ఫాదర్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ ఆనవాయితీ మొట్టమొదటా అగ్రరాజ్యం అమెరికాలో ప్రారంభమైంది. అది కూడా 1910 సంవత్సరం నుంచే. అమెరికాలోని వాషింగ్టన్ వైఎంసీఏలోని స్పోకెన్ సోనోరా స్మార్ట్ డాడ్ ఫాదర్స్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు.
తండ్రికీ ఓ రోజు..
అయితే అప్పటికే మదర్స్ డే వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సోనోరా ప్రతి ఒక్క తండ్రికి కూడా ఒకరోజు అనేది ఉండాలని నిర్ణయించారు. సోనోరా తండ్రి పేరు విల్లియం జాక్సన్ స్మార్ట్. ఆయనకు ఆరుగురు పిల్లలు. ఈయన కష్టపడి ఆరుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. తన తండ్రి కష్టాలను, బాధ్యతల్ని, త్యాగాలను దగ్గర నుండి చూసిన సోనోరా ఫాదర్స్ కు కూడా ఓ రోజు ఉండాలని భావించారు. ఆ విషయాన్ని చర్చ్ పాస్టర్ తో చర్చించారు. తన తండ్రి పుట్టిన రోజుఅయిన జూన్ 5న ఫాదర్స్ డే వేడుకలను నిర్వహించుకున్నారు. అయితే అప్పుడు కాలం కలిసిరాక అది కాస్త జూన్ మూడో ఆదివారానికి వాయిదా పడింది. అలా ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం రోజున ఫాదర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ ఈ రోజున ఫాదర్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించారు. మన దేశంలో కూడా కొన్ని సంవత్సరాల నుండి ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. ఆ తర్వాత మన దేశంలో కూడా కొంతమంది ప్రముఖులు కూడా ఫాదర్స్ డేను సెలబ్రెట్ చేసుకోవడం ప్రారంభించారు.
తండ్రి గురించి ప్రముఖుల మాటలు..
ఇటీవలే కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందాన కూడా తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఫొటోలను, మెమోరీస్ ను షేర్ చేసుకుంది. ప్రపంచంలోని కుభేరులలో ఒకరైన ముఖేష్ అంబానీ కూడా ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి గురించి కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో రోల్ మోడల్, తన ఐకాన్ తన తండ్రి అని చెప్పుకున్నారు. ఇక గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ అయితే తన తండ్రి గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. తాను మొట్టమొదటిసారి అమెరికా వెళ్లేందుకు విమాన టికెట్ కొనేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో, తన తండ్రి తన జీతం డబ్బులు మొత్తాన్ని ఇచ్చేసినట్లు తెలిపారు.ఇలా చాలా మంది ప్రముఖులు తమ తండ్రులతో తమకు ఉన్న ప్రత్యేక బంధాలను గుర్తు చేసుకుంటూ ఫాదర్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించారు.



Click it and Unblock the Notifications











