For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

February Horoscope 2022: ఫిబ్రవరి నెలలో ఈ రాశుల వారికి శుభ ఫలితాలు.. మీ రాశి కూడా ఉందేమో చూడండి...

2022 ఫిబ్రవరి నెలలో రాశి ఫలాలను చూడటం ద్వారా మీ భవిష్యత్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి..!

|

2022 సంవత్సరంలో అప్పుడే తొలి మాసం ముగిసిపోయింది. అదే సమయంలో మనం రెండో నెలలోకి అడుగుపెట్టేశాం. ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికను బట్టి, రాశిచక్రాల ఆధారంగా 2022లో రెండో నెల అయిన ఫిబ్రవరి మాసంలో మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకోవచ్చు.

February 2022 Monthly Horoscope in Telugu

ఈ నెలలో కొన్ని రాశుల వారు అత్యంత చిత్తశుద్ధితో కష్టపడి పని చేయడానికి ప్రేరణ పొందుతారు. మరికొన్ని రాశుల ఉద్యోగులకు ఈ నెలలో శ్రమకు తగిన ఫలితాలు దక్కుతాయి. ఇలా మీ జీవితానికి సంబంధించి ఉద్యోగం, వ్యాపారం, సంపద, విద్య మరియు ఆరోగ్యం వంటి వివిధ అంశాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా ఫిబ్రవరి మాసంలో ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో.. ఎవరికి ప్రతికూలంగా ఉంటుందో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Planet Transit in February 2022:ఫిబ్రవరిలో మూడు గ్రహాల రవాణా.. ఎప్పుడెప్పుడంటే...Planet Transit in February 2022:ఫిబ్రవరిలో మూడు గ్రహాల రవాణా.. ఎప్పుడెప్పుడంటే...

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

ఈ రాశి వారు ఈ నెలలో అత్యంత చిత్తశుద్ధితో కష్టపడి పని చేయడానికి ప్రేరణ పొందుతారు. ఉద్యోగులకు ఈ నెలలో శ్రమకు తగిన ఫలితాలు దక్కుతాయి. మీరు క్రమశిక్షణ మరియు అంకితభావంతో, మీరు సీనియర్ల నమ్మకాన్ని పొందగలుగుతారు. మీ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు పెట్టుబడి పెట్టేందుకు ఇది మంచి సమయం. మీ ఖర్చులు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఈ నెలలో కాస్త ఉపశమనం లభిస్తుంది. అవివామితులకు ఈ నెలలో మంచి పెళ్లి సంబంధం వచ్చే అవకాశం ఉంది.

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈ నెలలో కెరీర్ పరంగా కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ ప్రణాళికలను అమలు చేసేందుకు ఇది మంచి సమయం. ఈ నెలలో మీరు కొత్త వెంచర్ ను ప్రారంభించకపోవడమే మంచిది. మీరు సరైన అవకాశం కోసం వేచి ఉండండి. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండేందుకు క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ ను అలవర్చుకోండి. మీ వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు ఈ కాలంలో ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈ నెలలో కోరుకున్న బదిలీ రావొచ్చు. అయితే ఉద్యోగంలో మీరు సరిగ్గా వ్యవహరించకపోతే సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారంలో ఉండే వారికి కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఏ రకమైన ఊహాజనిత మార్గాల్లో పెట్టుబడులు పెట్టొద్దు. లేకపోతే మీరు నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ రొమాంటిక్ జీవితంలో మంచిగా ఉంటుంది.

Love Horoscope:ఫిబ్రవరిలో ఈ రాశుల వారికి ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుదట...!Love Horoscope:ఫిబ్రవరిలో ఈ రాశుల వారికి ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుదట...!

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈ నెలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే మీరు సొంతంగా ఏదైనా పనిని ప్రారంభించేందుకు ఇది మంచి సమయం. మీలో కొందరు కొత్త ఆదాయ వనరులు పొందొచ్చు. అయితే మీరు అనవసరమైన ఖర్చులను అరికట్టాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా కడుపు మరియు గొంతు సంబంధిత వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈ నెలలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు అదనపు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మీరు ధైర్యంగా ముందడుగు వేయండి. మీ నిర్ణయాలను విశ్వసించండి. వ్యాపారులు ఈ కాలంలో ఏదైనా అప్పుల నుండి బయటపడొచ్చు. గతంలో రావాల్సిన బకాయిలను పొందొచ్చు. మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబం నుండి ఆర్థిక సహాయం పొందుతారు. మీ వ్యక్తిగత జీవితంలో కొంత గందరగోళాన్ని ఎదుర్కొంటారు.

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. మీరు గుడ్డిగా ఎవ్వరినీ నమ్మొద్దు. వాటిని అమలు చేయడానికి ముందు మీ నిర్ణయాలను సమీక్షించండి. మీ జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు రావొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో గొడవలు రావడంతో మీ కుటుంబ వాతావరణం అస్థిరంగా మారిపోతుంది.

ఫిబ్రవరిలో శని గ్రహం అస్తమయం.. ఈ రాశులకు తీవ్ర కష్టాలు ఎదురవుతాయట.. తస్మాత్ జాగ్రత్త...!ఫిబ్రవరిలో శని గ్రహం అస్తమయం.. ఈ రాశులకు తీవ్ర కష్టాలు ఎదురవుతాయట.. తస్మాత్ జాగ్రత్త...!

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈ నెలలో కెరీర్ పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయంలో పెరుగుదల ఉండొచ్చు. ఉద్యోగస్తుల జీవితంలో పురోగతి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టుల నుండి లాభాలు రావొచ్చు. చర్మం మరియు కళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అవివాహితులకు వివాహ ప్రతిపాదన రావొచ్చు.

వృశ్చికం: అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చికం: అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈ నెలలో బాధ్యత పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. మీ కొత్త ప్రణాళికల వల్ల ఆశించిన విజయం లభిస్తుంది. అనవసరమైన ఖర్చుల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. జలుబు మరియు దగ్గు వంటి సీజనల్ వ్యాధుల వల్ల కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో కొందరు వ్యాపారులు ఈ నెలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. అనవసర ఖర్చుల వల్ల మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పొచ్చు. ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు.

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

ఈ రాశి వారు ఫిబ్రవరి నెలలో పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వైపు నుండి ఏవైనా లోపాలు ఉంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉండొచ్చు. మీరు ఈ కాలంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మీ సహోద్యోగులతో మర్యాదగా వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా ఈ నెలలో కడుపు సంబంధిత సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. మీ జీవిత భాగస్వామిని నమ్మండి. మీ ముఖ్యమైన నిర్ణయం ఏదైనా తీసుకునేటప్పుడు, అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకోవాలి.

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈ నెలలో కెరీర్ కు సంబంధించిన కొన్ని తెలివైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు పని పెరగడం వల్ల కొంత ఒత్తిడి ఎదురవుతుంది. మీరు ఈ కాలంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. ఇతరుల సంక్షేమం కోసం వెచ్చించే డబ్బు ఫలవంతంగా ఉంటుంది. మీకు అధిక ఆదాయం పెరగొచ్చు. మీ ప్రేమ జీవితంలో కొన్ని విభేదాలు ఉండొచ్చు.

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈ నెలలో అదనపు పని ఒత్తిడి ఉండొచ్చు. ఉద్యోగులు అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. వ్యాపారంలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించొచ్చు. మీరు పొదుపుపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీ కొత్త దీర్ఘకాలిక మార్గాలలో పెట్టుబడి పెట్టండి. కీళ్లు మరియు భుజాలలో నొప్పి కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఉండేలా చూసుకోండి.

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

February 2022 Monthly Horoscope in Telugu

For some zodiac signs, the month of February will be auspicious and for others it will be inauspicious. However, there is only one way to find out what the stars have in store for you, that is by reading your monthly horoscope.
Story first published:Monday, January 31, 2022, 13:53 [IST]
Desktop Bottom Promotion