Latest Updates
-
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా..
First Solar Eclipse of 2022:తొలి సూర్య గ్రహణం వేళ.. ఈ 5 రాశులకు ఇబ్బందులు... తస్మాత్ జాగ్రత్త...!
2022లో తొలి సూర్య గ్రహణం సమయంలో ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఆ రాశులేవో ఇప్పుడే చూసెయ్యండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏప్రిల్ నెలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో మొత్తం 9 గ్రహాలు తమ రాశిచక్రాలను మారనున్నాయి.

ఇందులో శని, గురు, రాహు, కేతు గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 30వ తేదీన శనివారం అర్థరాత్రి 12:15 గంటలకు(భారత సమయం ప్రకారం) తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది.

ఆ మరుసటి రోజు అంటే మే ఒకటో తేదీన ఉదయం 4:07 గంటల వరకు ఉంటుది. అంటే ఇది పాక్షిక గ్రహణంగా మేషరాశిలో ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా.. సూర్య గ్రహణాన్ని కొందరు అశుభకరంగా భావిస్తారు. అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.

దేవాలయాలు కూడా పూర్తిగా మూసివేస్తారు. ఎందుకంటే గ్రహణం సమయంలో సూర్యుడి ప్రభావంతో శక్తిని కోల్పోతారని చాలా మంది నమ్ముతారు. ఇదే సమయంలో ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయట. కాబట్టి ఈ రాశుల వ్యక్తులు సూర్య గ్రహణం వేళ చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఈ గ్రహణం ముగిసిన తర్వాత కూడా దాదాపు రెండు వారాల వరకు అప్రమత్తంగా ఉండాలి. ఇంతకీ ఆ రాశుల వ్యక్తులు ఎవరనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఇదే రాశిలో సూర్య గ్రహణం ఏర్పడే అవకాశం ఉన్నందున, మేష రాశి వారికి ఆకస్మికంగా ఆర్థిక పరమైన సమస్యలు పెరగొచ్చు. డబ్బు సమస్య పెరగడంతో మీ పనులన్నీ పెండింగులో పడొచ్చు. ఈ కాలంలో మీరు ముఖ్యమైన మరియు పెద్ద లావాదేవీలకు చాలా దూరంగా ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో మీ ప్రసంగాలను కూడా కంట్రోల్ లో ఉంచుకోవాలి.

కన్య రాశి..
ఈ రాశి వారికి కూడా సూర్య గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే అది ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఎంత కష్టపడినప్పటికీ ఫలితం ఆశించినంత మేరకు రాకపోవచ్చు. ఉద్యోగులు ఈ కాలంలో ఉద్యోగం మారేందుకు సమయం సరైనది కాదు. కాబట్టి ఈ కాలంలో ఓపిక పట్టండి.

తుల రాశి..
ఈ రాశి వారికి సూర్య గ్రహణం కారణంగా ఆరోగ్య పరంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. అలాగే వివాదాలు మరియు చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వీటన్నింటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో అశుభ ఫలితాలొస్తాయి. ముఖ్యంగా ఉద్యోగులకు కెరీర్ పరమైన విషయాల్లో ప్రతికూలగా ఉంటుంది. వ్యాపారులు కూడా ఈ కాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో చాలా ఓపికగా ఉండాలి.

కుంభ రాశి..
సూర్యగ్రహణం సమయంలో ఈ రాశి వారి వ్యాపారులు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ కాలంలో లావాదేవీలు చేయడం వాయిదా వేసుకోవాలి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. లేదంటే మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
గమనిక : ఈ సమాచారం ఆన్ లైనులో అందుబాటులో ఉన్న ఊహాలు, జ్యోతిష్యశాస్త్ర నిపుణులు తెలిపిన సమాచారంపై ఆధారపడి ఉంటుది. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునే ముందు దయచేసి మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణులను సంప్రదించగలరు. అప్పుడే తుది నిర్ణయం తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
