Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
Planets Tranist in December 2021:నాలుగు గ్రహాల రవాణాతో ఈ 5 రాశులకు శుభ ఫలితాలు...!
డిసెంబర్ నెలలో నాలుగు గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకోనున్నాయి. ఈ సందర్భంగా ఈ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులేవో చూడండి.
Planets Tranist in December 2021: మరికొద్ది రోజుల్లో 2021 సంవత్సరానికి మనం గుడ్ బై చెప్పబోతున్నాం. ఆ వెంటనే 2022 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.

ఈ నేపథ్యంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, డిసెంబర్ మాసంలో నాలుగు పెద్ద గ్రహాలు తమ స్థానాలను మార్చుకోనున్నాయి. గ్రహాలు ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుండి మరొక రాశికి మారనున్నాయి. ఈ గ్రహాల సంచారం చాలా ముఖ్యమైన సంఘటనగా పరిగణించబడుతుంది.

డిసెంబర్ నెలలో నాలుగు గ్రహాలు తమ స్థానాలను మార్చుకోవడం వల్ల రాశిచక్రాలపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. అయితే ఈ నాలుగు గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశుల వారికి శుభ ప్రదమైన ఫలితాలు రానున్నాయట.

ఈ సందర్భంగా ఏయే గ్రహాలు తమ స్థానాలను మార్చుకోనున్నాయి. ఏ రాశుల వారికి శుభ ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏయే గ్రహాలంటే..
డిసెంబర్ మాసంలో మొత్తం నాలుగు గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. అందులో ప్రధానమైన గ్రహాలు అంగారకుడు, శుక్రుడు, బుధుడు మరియు సూర్యుడు ఉన్నాయి.

ఎప్పుడు మారనున్నాయంటే..
డిసెంబర్ నెలలో నాలుగో తేదీన అంటే శనివారం నాడు చివరి సూర్య గ్రహణం ఏర్పడనుంది. డిసెంబర్ 5న కుజుడు వృశ్చికరాశిలోకి సంచరించనున్నాడు. డిసెంబర్ 8న అంగారకుడు మకరంలోకి ప్రవేశించగా.. డిసెంబర్ 19న సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని, శోభను శుక్రుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. డిసెంబర్ 29న బుధుడు మకరంలోకి సంచరించనున్నాడు. డిసెంబర్ 30న శుక్రుడు ధనస్సులో తిరోగమనం చెందనున్నాడు. ఇలా నాలుగు పెద్ద గ్రహాలు డిసెంబరు మాసంలో తమ స్థానం నుండి మరో స్థానంలోకి మార్పు చెందడం వల్ల ద్వాదశ రాశుల వారిపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.

మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. డిసెంబర్ నెలలో గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వారికి విశేష ఫలితాలు రానున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది.

మిధున రాశి..
ఈ రాశి వారికి డిసెంబరులో నాలుగు గ్రహాల సంచారం వల్ల శుభ ఫలితాలు రావొచ్చు. మీరు కోరుకున్న ఫలితాలన్నీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులను చేయొద్దు. ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి.

సింహ రాశి..
డిసెంబర్ నెలలో నాలుగు గ్రహాల రవాణా వల్ల ఈ రాశి వారికి ప్రత్యేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ రంగంలో చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో మంచిగా ఉంటుంది. మీరు చాలా బాధ్యతతో వ్యవహరిస్తారు.

ధనస్సు రాశి..
డిసెంబర్ నెలలో నాలుగు గ్రహాల సంచారంతో ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు రావొచ్చు. ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి..
డిసెంబర్ నెలలో నాలుగు గ్రహాల రవాణా వల్ల కుంభ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ కచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, డిసెంబర్ 5న కుజుడు వృశ్చికరాశిలోకి సంచరించనున్నాడు. డిసెంబర్ 8న అంగారకుడు మకరంలోకి ప్రవేశించగా.. డిసెంబర్ 19న సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని, శోభను శుక్రుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. డిసెంబర్ 29న బుధుడు మకరంలోకి సంచరించనున్నాడు. డిసెంబర్ 30న శుక్రుడు ధనస్సులో తిరోగమనం చెందనున్నాడు. ఇలా నాలుగు పెద్ద గ్రహాలు డిసెంబరు మాసంలో తమ స్థానం నుండి మరో స్థానంలోకి మార్పు చెందడం వల్ల ద్వాదశ రాశుల వారిపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, డిసెంబర్ నెలలో నాలుగు పెద్ద గ్రహాల మార్పుతో ఐదు రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశుల ఏవంటే మేష రాశి, మిధునం, సింహ రాశి, ధనస్సు, కుంభ రాశి.



Click it and Unblock the Notifications
