Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
Four Planets Transit in August 2021: 4 గ్రహాల రవాణాతో ఈ రాశులకు ప్రత్యేక లాభాలు...!
నాలుగు గ్రహాల కలయిక వల్ల ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆగస్టు నెలలో నాలుగు గ్రహాలు తమ స్థానం నుండి మరో స్థానంలోకి మారనున్నాయి. జులై మాసంలో కూడా ఇలాగే కొన్ని గ్రహాలు రవాణా చేశాయి.

ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై కొంత ప్రభావం పడింది. అదే విధంగా ఆగస్టు మాసంలోనూ గ్రహాల ప్రయాణం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు.. మరికొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. అయితే ఆగస్టులో 4 గ్రహాల రవాణా వల్ల నాలుగు రాశుల వారికి కోరికలు వెంటనే తీరిపోతాయట.. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి మరి...

ఆగస్టు 9న..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఆగస్టు తొమ్మిదో తేదీన తొలి గ్రహం తన స్థానాన్ని మారనుంది. అంటే శ్రావణ మాసం ప్రారంభం రోజున బుధుడు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆగస్టు 9వ తేదీ మధ్యాహ్నం 1:23 గంటలకు కర్కాటక రాశి నుండి నిష్క్రమించే బుధుడు. ఆగస్టు 20వ తేదీ ఉదయం 11:08 గంటల వరకు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. అనంతరం కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఆగస్టు 11న..
ఇదే మాసంలో బుధుడు తన స్థానాన్ని మారిన రెండు రోజులకే మరో గ్రహం మార్పు జరగనుంది. ఆగస్టు 11వ తేదీ శుక్రుడు కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో సెప్టెంబర్ ఆరో తేదీ వరకు నివాసం ఉండున్నాడు. అదే రోజు మధ్యాహ్నం 12:39 గంటలకు కన్య రాశి నుండి నిష్క్రమించి తుల రాశిలోకి అడుగు పెట్టనున్నాడు.

ఆగస్టు 17న..
ఆగస్టు నెలలో శుక్రుడు మారిన దాదాపు వారం రోజులకు మరో గ్రహం మార్పు జరుగుతుంది. ఆగస్టు 17వ తేదీ సూర్యుడు కర్కాటకం నుండి నిష్క్రమించి తన సొంత రాశి అయిన సింహ రాశిలోకి చేరనున్నాడు. ఇదే రాశిలో సెప్టెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 1:02 గంటల వరకు ఉండనున్నాడు. అనంతరం కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ వెంటనే బుధుడు రెండు వారాల పాటు సింహరాశిలో సంచరించి.. అనంతరం కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ బుధుడి రవాణా సమయంలో చాలా మందికి సానుకూల ఫలితాలొస్తాయి.

మేష రాశి..
ఆగస్టు మాసంలో నాలుగు గ్రహాల రవాణా వల్ల మేష రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఈ కాలంలో మీరు చాలా బిజీగా ఉంటారు. సొంతంగా పని చేసుకునే వారికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు.

మిధున రాశి..
ఈ రాశి వారికి నాలుగు గ్రహాల సంచారం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంతేకాదు మీరు కోరుకున్న ప్రమోషన్లు, బదిలీల గురించి శుభవార్తలు వినొచ్చు. వ్యాపారులకు మంచి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ సమయంలో మీరు శత్రువులకు ఏ మాత్రం భయపడరు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వారే పూర్తిగా ఇబ్బందిపడతారు. సమాజంలో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. మీ కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. అయితే మీరు ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు.

సింహ రాశి..
ఈ రాశి వారికి నాలుగు గ్రహాల స్థానం మార్పు వల్ల ఆనందం, ఆదాయం పెరుగుతుంది. ఇది మీ శక్తి, విశ్వాసంలో పెరుగుదలను సూచిస్తుంది. మీరు ఈ సమయంలో సంతోషంగా ఉంటారు. అయితే మీరు ఆరోగ్యంపై కూడా పూర్తి ఫోకస్ పెట్టాలి. మరోవైపు ఈ కాలంలో మీరు కొన్ని రిస్కులు తీసుకుంటారు. వ్యాపారులకు ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు.

తుల రాశి..
నాలుగు గ్రహాల రవాణా వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు ఈ సమయంలో ఊహించిన విధంగా లాభాలొస్తాయి. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. కార్యాలయంలో పని చేసే ఉద్యోగులకు మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీ నైపుణ్యానికి సంబంధించిన ఆలోచనలు పెరుగుతాయి. మీరు మంచి ప్రదర్శన ఇవ్వగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉన్నతాధికారుల నుండి మంచి ప్రశంసలను పొందుతారు.



Click it and Unblock the Notifications