For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Friendship Day 2021: స్నేహితుడికి సలాం చెప్పే టైమొచ్చింది...!

ఫ్రెండ్ షిప్ 2020 యొక్క చరిత్ర, ప్రాముఖ్యత మరియు వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

|

కాలం మనకు కలిసి రాకున్నా..
బాధలు మనల్ని భయపెట్టినా..
కష్టాలు మనల్ని కుంగదీసినా..
మనం ఎప్పుడైనా లోన్లీగా ఫీలైనా..
ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. మనతో ఎలాంటి సంబంధం లేకున్నా..
అనునిత్యం నేనున్నా.. నీకు నేనున్నా నేస్తం అంటూ ఎవరో ఒకరు మీ జీవితంలో ఉండే ఉంటారు. అలాంటి వారే నిజమైన స్నేహితుడు.
అలాంటి స్నేహితులందరికీ అడ్వాన్స్ గా 'హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే'...

Friendship Day 2020 history, significance and facts

ఆగస్టు నెల వచ్చిందంటే చాలు అనేక పండుగలు వస్తుంటాయి. ఈ నెలలో ఎన్నో వేడుకలతో అంతా సందడిగా ఉంటుంది. అయితే ఇవన్నీ స్నేహితుల దినోత్సవ సెలబ్రేషన్స్ తోనే స్టార్ట్ అవుతాయి.

Friendship Day 2020 history, significance and facts

ప్రతి ఏటా ఆగస్టు మొదటి ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవం జరుపుకుంటాం. ఆరోజున స్నేహితులంతా కలిసి ఎంతో సరదాగా గడుపుతారు.

Friendship Day 2020 history, significance and facts

తమ స్నేహానికి గుర్తుగా గ్రాండ్ గా పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు చాలా మంది స్నేహితులు బ్యాండ్స్ కట్టుకుంటారు. ఇలా స్నేహితుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా కన్నుల పండుగగా జరుపుకుంటారు.

Friendship Day 2020 history, significance and facts

అయితే ఆగస్టు మొదటి ఆదివారమే స్నేహితుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? అసలు ఆరోజే ఫ్రెండ్ షిప్ డే ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న రహస్యాలేంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం...

స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక..

స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక..

1935 సంవత్సరంలో అమెరికాలోని ప్రభుత్వం ఓ వ్యక్తిని చంపింది. అది ఆగస్టు మొదటి శనివారం. ఆ వ్యక్తి యొక్క మరణ వార్త విన్న అతని స్నేహితుడు ఆ మరణాన్ని తట్టుకోలేక ఆ మరుసటి రోజే అంటే ఆదివారం నాడు ఆత్మహత్యకు పాల్పడతాడు.

స్నేహానికి సలాం..

స్నేహానికి సలాం..

ఈ సంఘటనపై అప్పటి అమెరికా ప్రభుత్వం స్పందించింది. వారి స్నేహానికి సలాం చేస్తూ.. వారి స్నేహం కలకాలం అందరికీ గుర్తుండాలని.. వాళ్ల స్నేహానికి గుర్తుగా.. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్ షిప్ డేగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రజలందరూ తమ స్నేహితులపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి రంగు రంగుల పూలు, గ్రీటింగ్స్, మణికట్టు బ్యాండ్లు, గిఫ్టులు వంటివి ఇచ్చి పుచ్చుకుంటారు.

అన్ని దేశాలలో..

అన్ని దేశాలలో..

అప్పటి నుండి అన్ని దేశాలలో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. అంతేకాదు పురాణాలలో కూడా చాలా మంది స్నేహితులుగా ఉండేవారు. వాటిని ఒకసారి పరిశీలిస్తే..

ద్వాపర యుగంలో..

ద్వాపర యుగంలో..

ద్వాపర యుగంలో అత్యంత నిరుపేదల అయిన కుచేలుడు ఏకంగా శ్రీక్రిష్ణ భగవానుడితో స్నేహం కొనసాగిస్తాడు. కుచేలుడు ఓ రోజు ఇచ్చిన పిడికెడు అటుకులతో అతని స్నేహితుడైన క్రిష్ణుడు అతనికి బంగారు పట్టణాన్నే బహుకరించి స్నేహం విలువను ఈ లోకానికి తెలియజేస్తాడు.

మహాభారతంలో..

మహాభారతంలో..

మహాభారతంలో కూడా దుర్యోదనుడు మరియు కర్ణుడి మధ్య స్నేహం అసాంతం అద్వితీయంగా ఉంటుంది. స్నేహితుడి కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసి కర్ణుడు చరిత్రలో నిలిచిపోయాడు.

English summary

Friendship Day 2020 history, significance and facts

Here we talking about freindship day 2020 history, significance and facts. Read on
Desktop Bottom Promotion