For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gandhi Jayanti 2023: గాంధీజీకి ‘మహాత్మ’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా...

|

Gandhi Jayanti 2023: గాంధీజీ అహింసకు మారుపేరు. 'ఒక చెంప మీద కొడితే.. మరో చెంప చూపమని' చెప్పిన గొప్ప మేధావి. గుజరాత్ రాష్ట్రంలో ఓ సామాన్య మానవునిగా పుట్టిన మహాత్మ గాంధీజీ తెల్లదొరలను శాంతి, అహింస అనే ఆయుధాలతో తరిమి కొట్టేందుకు ఎనో పోరాటాలు చేశారు. ఈ సమయంలో యావత్ భారతావని అంతా అతని శాంతియుత పోరాటానికి మద్దతు పలికింది.

Gandhi Jayanti 2021: Interesting facts about the father of the nation in Telugu

కోట్లాది మంది జనాలు ఆయన వెంట నడిచారు. ఈ సందర్భంలోనే ఆయన విశ్వం మొత్తానికి ఆదర్శంగా నిలిచారు.అలా ఆయన చేసిన పోరాటాలు.. వారి త్యాగ ఫలితాల వల్లే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.

Gandhi Jayanti 2021: Interesting facts about the father of the nation in Telugu

ఆనాడు ఆ మహాత్ముడు చేసిన త్యాగం ఫలితంగా మనం నేడు స్వేచ్ఛగా మన హక్కులను పొందగలుగుతున్నాం. బాపూజీ 154వ జయంతి సందర్భంగా మహాత్మునికి ఆ పేరు ఎలా వచ్చింది.. ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Gandhi Jayanti 2021 :మహ్మాత్ముని అద్భుతమైన సూక్తులను ఓ స్మరించుకుందాం...Gandhi Jayanti 2021 :మహ్మాత్ముని అద్భుతమైన సూక్తులను ఓ స్మరించుకుందాం...

గాంధీజీ జననం..

గాంధీజీ జననం..

భారత జాతిపితగా పిలుచుకునే మహాత్మగాంధీ 1869 సంవత్సరం అక్టోబర్ రెండో తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ లో జన్మించారు. ఈయన చిన్నతనంలో కేవలం పండ్లు, గింజలు, మాత్రమే తీసుకున్నారట. తనకు ఉన్న అనారోగ్య సమస్యల వల్ల పాలను అస్సలు తీసుకోలేదట. ఈ నేపథ్యంలోనే మాంసాహారానికి కూడా దూరమయ్యారట. కేవలం శాకాహారం తీసుకునేవారట.

వెజిటేరియనిజం పుస్తకం..

వెజిటేరియనిజం పుస్తకం..

మహాత్మ గాంధీజీ కొన్ని దశాబ్దాల పాటు ఆహారం గురించి అనేక ప్రయోగాలు చేశారట. తన వ్యక్తిగత జీవితంలో పాల ఉత్పత్తులను తీసుకోవడం మానేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తన ఆరోగ్యం దెబ్బతినడంతో తన డెసిషన్ ను మార్చుకున్నారు. అనంతరం మేక పాలు ప్రారంభించారు. కొన్ని సందర్భాల్లో తాజా మేక పాల కోసం ప్రయాణాల్లోనూ ఆయన వెంట మేకను తీసుకెళ్లేవారట. ఈ నేపథ్యంలో ‘ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియనిజం' పేరిట ఆయన ఓ పుస్తకాన్ని రాశారు.

చంపారన్ సత్యాగ్రహం..

చంపారన్ సత్యాగ్రహం..

గాంధీజీ విదేశాల్లో న్యాయ విద్యను చదువుకుని భారతదేశానికి తిరిగొచ్చాక తొలిసారిగా చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. నీలి మందు ఉద్యమంలో రైతుల తరపున ఆయన పోరాటంలో పాల్గొని కీలకపాత్ర పోషించారు. అదే సమయంలో ఆయన్ను రైతులు మహాత్మా అని సంబోధించారు. అలాగే స్వాతంత్య్ర పోరాటానికి ముందే మహిళలకు సమాన హక్కుల కోసం గాంధీజీ పోరాడారు.

సమానత్వం కోసం..

సమానత్వం కోసం..

మన దేశంలో ఉండే అంటరానితనం, నిర్మూలన కోసం.. కులాలు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని సమానంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం అహింస అనే ఆయుధంతోనే రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న ఆంగ్లేయులను అనేక ముప్పుతిప్పలు పెట్టిన మహా మేధావి గాంధీజీ. అయితే తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున పోరాడేందుకు ఒప్పుకున్నారు. కానీ రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ పాల్గొనేందుకు ఆయన నిరాకరించారు.

చిన్న వయసులోనే పెళ్లి..

చిన్న వయసులోనే పెళ్లి..

గాంధీజీ 13వ సంవత్సరంలోనే కస్తూరిబా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమె తన కంటే ఏడాది పెద్దవారు. వీరి దాంపత్య జీవితం సుమారు 62 సంవత్సరాల పాటు కొనసాగింది. 1944 సంవత్సరంలో ఆగా ఖాన్ ప్యాలెస్ లో నిర్బంధంలోనే ఉండగానే ఆమె మరణించారు. తను మరణించిన ఫిబ్రవరి 22వ తేదీన మదర్స్ డే జరుపుకుంటారు. తను మరణించిన సమయంలో గాంధీజీ జైల్లోనే ఉన్నారు. ఆయన కూడా చనిపోతారనే భయంతో ఆంగ్లేయులు గాంధీజీని విడుదల చేశారు.

కడసారి వీడ్కోలు..

కడసారి వీడ్కోలు..

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదిలోపే 1948 సంవత్సరంలో జనవరి 30వ తేదీన గాంధీజీ హత్యకు గురయ్యారు. గాడ్సే ఆయనపై కాల్పులు జరిపారు. మహాత్మ గాంధీజీకి వీడ్కోలు పలికేందుకు సుమారు 20 లక్షల మందికి పైగా వచ్చారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన వారు సుమారు 10 కిలోమీటర్ల మేర బారులు తీరారు. గాంధీజీ పేరును నోబెల్ శాంతి పురస్కారం కోసం ఐదుసార్లు నామినేట్ చేయగా.. ఒక్కసారి కూడా ఆయనకు అవార్డు రాలేదు. ఈ నేపథ్యంలోనే మన దేశంలో గాంధీ శాంతి బహుమతి పేరిట అవార్డులు ఇవ్వడం ప్రారంభించింది.

FAQ's
  • మహాత్మ గాంధీజీ ఎక్కడ, ఎప్పుడు జన్మించారు?

    భారత జాతిపితగా పిలుచుకునే మహాత్మగాంధీ 1869 సంవత్సరం అక్టోబర్ రెండో తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ లో జన్మించారు.

English summary

Gandhi Jayanti 2023: Interesting facts about the father of the nation in Telugu

Here we are talking about the gandhi jayanti 2021: Interesting facts about the father of the nation in Telugu. Have a look
Desktop Bottom Promotion