For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gandhi Jayanti 2023 : మహ్మాత్ముని అద్భుతమైన సూక్తులను ఓ స్మరించుకుందాం...

|

గుజరాత్ రాష్ట్రంలో ఓ సామాన్య మానవునిగా పుట్టిన మహాత్మ గాంధీజీ తెల్లదొరలను శాంతి, అహింస అనే ఆయుధాలతో తరిమి కొట్టేందుకు ఎనో పోరాటాలు చేశారు. ఈ సమయంలో యావత్ భారతావని అంతా అతని శాంతియుత పోరాటానికి మద్దతు పలికింది. కోట్లాది మంది జనాలు ఆయన వెంట నడిచారు. ఈ సందర్భంలోనే ఆయన విశ్వం మొత్తానికి ఆదర్శంగా నిలిచారు.

Gandhi Jayanti 2020: Famous Mahatma Gandhi Quotes in Telugu

అలాంటి మహోన్నత వ్యక్తికి స్వాతంత్య్రం రాకముందు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినా వాటన్నింటనీ అధిగమించి మహాత్ముడు ఓ వ్యక్తి నుండి మహాశక్తిలా మారాడు. బ్రిటీష్ వారు మన దేశం నుండి వెళ్లిపోయేందుకు సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, స్వదేశీ వంటి ఉద్యమాలను ఎన్నో చేశారు.

Gandhi Jayanti 2020: Famous Mahatma Gandhi Quotes in Telugu

అలా ఆయన చేసిన పోరాటాలు.. వారి త్యాగ ఫలితాల వల్లే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆనాడు ఆ మహాత్ముడు చేసిన త్యాగం ఫలితంగా మనం నేడు స్వేచ్ఛగా మన హక్కులను పొందగలుగుతున్నాం. ఓ సామాన్యుడిగా ఉండి తను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన తీరు ఆమోఘం. ఇలా ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి మన జాతిపిత. బాపూజీ 151వ జయంతి సందర్భంగా ఆయన చెప్పిన సూక్తులలో ముఖ్యమైన వాటిని ఓ సారి స్మరించుకుందాం...

ఇతరులు చెప్పాలి..

ఇతరులు చెప్పాలి..

ఎంత గొప్పగా జీవించావో

నీ చేతలు చెప్పాలి..

ఎంత గొప్పగా మరణించావో..

ఇతరులు చెప్పాలి..

దాచుకోవడం కన్నా..

దాచుకోవడం కన్నా..

విద్య దాచుకోవడం కన్నా..

పది మందికి పంచితే మరింత పెరుగుతుంది..

మెదడులో కాదు..

మెదడులో కాదు..

మనిషి గొప్పదనం మెదడులో కాదు..

తన హృదయంలో ఉంటుంది..

ఎప్పటికీ క్షమించలేరు..

ఎప్పటికీ క్షమించలేరు..

బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు..

ఎందుకంటే క్షమించడానికి ఎంతో ధైర్యం కావాలి..

ఆ లోటు తీరినట్లే..

ఆ లోటు తీరినట్లే..

మంచి పుస్తకాలు మనతో ఉంటే..

మంచి నేస్తం లేని లోటు తీరినట్లే..

ఎన్నో రెట్లు ఉత్తమం..

ఎన్నో రెట్లు ఉత్తమం..

భయం వల్ల పొందే ఆధిపత్యం కంటే..

అభిమానంతో లభించే ఆధిపత్యం

ఎన్నో రెట్లు ఉత్తమమైనది..

ఉన్నది కాస్త..

ఉన్నది కాస్త..

లేని గొప్పదనం ఉందని చెబితే..

ఉన్న గొప్పదనం కాస్త ఊడిపోతుంది..

ఉదయాన్నే ప్రార్థన అంటే..

ఉదయాన్నే ప్రార్థన అంటే..

ప్రార్థన అంటే ఉదయం లేచినప్పుడు

లేచినప్పుడు తాళం చెవి లాంటిది..

చీకటి వేళ నిద్రించే ముందు

తలుపు గడియ వంటిది..

అదే ఆయుధం..

అదే ఆయుధం..

నా దగ్గర ప్రేమ తప్ప

మరొక ఆయుధం లేదు..

ప్రపంచంతో స్నేహం చేయడమే నా గమ్యం..

గెలుపు నీ బానిస..

గెలుపు నీ బానిస..

శ్రమ నీ ఆయుధం అయితే..

విజయం నీ బానిస అవుతుంది

ఓటమితో గుణపాఠాలు..

ఓటమితో గుణపాఠాలు..

మనం పొరపాట్ల ద్వారా..

ఓటమి ద్వారా.. పాఠాలు నేర్చుకుని..

లాభం పొందాల్సి ఉంటుంది..

కోరికల మీద..

కోరికల మీద..

నీతిగా జీవించడమంటే..

మనం మన మనసు మీద

కోరికల మీద అధికారం సంపాదించాలి..

మన నాశనం..

మన నాశనం..

మనకు జన్మనిచ్చిన భగవంతుని

చేతుల్లోనే మన నాశనం ఉంటుంది..

FAQ's
  • గాంధీ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని జరుపుకుంటారు. గుజరాత్ రాష్ట్రంలోని పోర్బంధర్ లో గాంధీజీ పుట్టారు.

English summary

Gandhi Jayanti 2023: Famous Mahatma Gandhi Quotes in Telugu

Here we talking about Gandhi Jayanti 2020 : Famous Mahatma Gandhi Quotes in Telugu. Take a look
Desktop Bottom Promotion