For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ganesh Chaturthi 2021:మీ రాశిని బట్టి వినాయకుని ఇలా పూజిస్తే.. ఆటంకాలన్నీ తొలగిపోతాయట...!

మీ రాశిని బట్టి గణేష్ చతుర్థి రోజున వినాయకుడిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

విఘ్నాలు తొలగించే వినాయకుడిని పూజిస్తే.. మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్మకం. వినాయకుని అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన సమయం గణేష్ చతుర్థి అని పండితులు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలో ప్రత్యేక పూజలు చేస్తారు.

Ganesh Chaturthi Puja as per Zodiac Signs

ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్తరం ప్రకారం, మీ రాశి చక్రం ప్రకారం వినాయకుడికి కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో పూజించాలి. అలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి.. మీరు ఆనందంగా జీవిస్తారట. ఈ సందర్భంగా వినాయక చవితి రోజున వినాయకుడిని ఏ రాశి వారు ఎలా పూజించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Ganesh Chaturthi 2021:వినాయక చవితి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదంటే...Ganesh Chaturthi 2021:వినాయక చవితి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదంటే...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి మేష రాశి వారు వినాయక చవితి రోజున ఎర్రని రంగులో ఉండే దుస్తులను ధరించి పూజ చేయాలి. అలాగే వినాయక విగ్రహం ఎంపిక చేసుకునేటప్పుడు వక్రతుండ విగ్రహాన్ని తీసుకోవాలి. ఇలా వినాయకుడిని ఆరాధించడం వల్ల మీకు అన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఈ పండుగ సమయంలో లంబోదరుడికి మోతీచూర్ లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారు తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించి వినాయకుడిని పూజించాలి. దీంతో పాటు, కొబ్బరితో చేసిన మిఠాయిలను ఆ విఘ్నేశ్వరునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇది కాకుండా మీరు నెయ్యి మరియు చక్కెరతో తయారు చేసిన మిఠాయిలను కూడా అందించొచ్చు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ రాశి వినాయక చవితి రోజున గ్రీన్ కలర్ డ్రస్ వేసుకుని వినాయకుడిని పూజించాలి. అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన సమయంలో కచ్చితంగా ఉపవాసం ఉండాలి. దీని వల్ల మీకు జ్ణానం పెరుగుతుంది.

Ganesh Chaturthi 2021:ఇంట్లో గణేష్ పూజ సమయంలో చేయాల్సిన, చేయకూడని పనులివే...!Ganesh Chaturthi 2021:ఇంట్లో గణేష్ పూజ సమయంలో చేయాల్సిన, చేయకూడని పనులివే...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. వినాయక పూజ సమయంలో మీరు తెల్లని రంగు దుస్తులను ధరించాలి. వినాయకునికి పాలు మరియు మఖానాతో చేసిన వస్తువులను సమర్పించాలి. తెల్లని వెన్న, పాలు మరియు బియ్యపు పదార్థాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితం సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటారు. వినాయక పూజ సమయంలో ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. వినాయకుడికి మోతీచూర్ లడ్డూలను సమర్పించాలి. వినాయకుడితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించొచ్చు. ఇలా చేయడం వల్ల మీ పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. మీ ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటారు. ఈరోజున మీరు ఆకుపచ్చ రంగులో బట్టలను ధరించాలి. మీరు ఖీర్ మరియు పండ్లను అదే సమయంలో వినాయకుని ఆరాధన సమయంలో ‘ఓం గణపతాయై నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

Ganapathi Homam at Home:ఇంట్లోనే గణపతి హోమం నిర్వహించొచ్చా?Ganapathi Homam at Home:ఇంట్లోనే గణపతి హోమం నిర్వహించొచ్చా?

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుని అనుగ్రహం ఉంటే వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుందని నమ్ముతారు. వినాయక చవితి రోజున మీరు ఆరెంజ్ కలర్ డ్రస్ ధరించి పూజలు చేయాలి. గణేశునికి కొబ్బరితో తయారు చేసిన లడ్డూలను సమర్పించాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈరోజున మీరు ఎరుపు రంగు దుస్తులను ధరించి పూజించాలి. పూజ సమయంలో ఎర్రని రంగులో ఉండే పువ్వులను సమర్పించాలి. ఇలా ఆరాధించడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ‘ఓం నమో భగవతే గజాననాయ' అనే మంత్రాన్ని జపించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ధనస్సు రాశి వారు గణపతి పూజలో పసుపు బట్టలు ధరించాలి. మీరు వినాయకుడికి పిండి వంటలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ కుటుం జీవితంలో ఆనందం ఉంటుంది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి శని అధిపతిగా ఉంటాడు. శని దేవునికి నల్లని రంగు అంటే ఇష్టమైనప్పటికీ.. హిందూ విశ్వాసాల ప్రకారం, ఎలాంటి శుభ కార్యంలోనైనా నల్లని వస్త్రాలను ధరించరు. కాబట్టి వినాయక చవితి రోజున మీరు పసుపు రంగు దుస్తులను ధరించి పూజ చేయాలి. మోదకాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి కూడా శని దేవుడే అధిపతిగా ఉంటాడు. వినాయక పూజ సమయంలో ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. ఈ సమయంలో డ్రై ఫ్రూట్స్ అందించాలి. ఇలా చేయడం వల్ల మీరు చేసే పని రంగంలో పురోగతి సాధించొచ్చు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. గణపతి పూజ సమయంలో ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించాలి. ఇలా పూజ చేయడం వల్ల మీరు మీ పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తారు. మీకు శుభ ఫలితాలొస్తాయి. ఈ పవిత్రమైన రోజున గణపతికి మోతీచూర్ లడ్డూను సమర్పించాలి.

FAQ's
  • వినాయక చవితి శుభ ముహుర్త సమయం?

    2021 సంవత్సరంలో సెప్టెంబర్ 10వ తేదీన శుక్రవారం ఉదయం 5 గంటల నుండి 8.15 గంటల వరకు మరియు 9.10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వినాయక పూజను చేసుకుంటే సర్వత్రా శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

English summary

Ganesh Chaturthi Puja as per Zodiac Signs

Here we are talking about the Ganesh Chaturthi puja as per zodiac signs. Have a look
Story first published:Thursday, September 9, 2021, 11:28 [IST]
Desktop Bottom Promotion