For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ganesh Chaturthi Special: డార్క్ చాక్లెట్ వినాయకుడి గురించి ఈ విశేషాలు తెలుసా...

గణేష్ చతుర్థి సందర్భంగా డార్క్ చాక్లెట్ తయారు చేసిన గణపతి వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.

|

దేశ వ్యాప్తంగా వినాయక చవితి పండుగ ఘనంగా ప్రారంభమైంది. గణేష్ చతుర్థిని పురస్కరించుకుని అన్ని రాష్ట్రాల్లో చాలా మంది ప్రజలు విభిన్న రకాలైన వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు.

Ganesh chaturthi special: Ganesh idol made of dark chocolates

మన తెలుగు రాష్ట్రాల్లోనే ప్రతి ఏటా ప్రత్యేకంగా నిలిచే ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి కూడా అందరి కంటే ఎత్తులో నిలిచాడు.

ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతిని 40 అడుగుల ఎత్తులో ప్రతిష్టించారు. ఈ ఏటా పంచముఖ గణపతిని 150 మంది కళాకారులు సుమారు వంద రోజుల పాటు కష్టపడి తయారు చేశారు.

Ganesh chaturthi special: Ganesh idol made of dark chocolates

ఇదిలా ఉండగా.. పంజాబ్ రాష్ట్రంలో డార్క్ చాక్లెట్ తో గణపతిని తయారు చేశారు. లుథియానాలో ఓ బేకరీ వారు ఎకో ఫ్రెండ్లీ గణేష్ పండుగను ప్రోత్సహించడానికి వినాయక విగ్రహం తయారీలో భాగంగా చాక్లెట్ ను ఉపయోగించారు. ఈ విగ్రహా తయారీకి పది మంది చెఫ్ లు కలిసి.. పది రోజుల పాటు ఎంతో శ్రమ పడి చూడముచ్చటైన లంబోదరుని విగ్రహాన్ని ప్రతిష్టించడంలో విజయం సాధించారు.

Ganesh chaturthi special: Ganesh idol made of dark chocolates

ఈ విగ్రహం తయారీలో 200 కేజీల బెల్జియన్ డార్క్ చాక్లెట్ ను వాడారట. ఈ విగ్రహం తయారీకి సుమారు నెల, నెలన్నర నుండే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట. ఇంతకు ముందు 120 కేజీలతో 2019లో పెద్ద వినాయకుడిని తయారు చేశారట. అయితే ఈ ఏడాది దాన్ని మరింతగా పెంచి 200 కేజీలతో తయారు చేసినట్లు బేకరీ యజమాన్యం నిర్వాహకులు తెలిపారు.

Ganesh chaturthi special: Ganesh idol made of dark chocolates

ఈ సందర్భంగా బెల్ ఫ్రాన్స్ బేకరీ యజమాని హర్జిందర్ సింగ్ మాట్లాడుతూ.. గణేష్ చతుర్థి పండుగను గత ఆరు సంవత్సరాలుగా ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుంటున్నామని చెప్పారు. పండుగలంటే సంతోషకరమైన వాతావరణం. ప్రతి ఒక్కరూ పండుగ సమయంలో పిండివంటలు, మిఠాయిలను తయారు చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి గణపతులను స్నేహితులకు, బంధువులకు కూడా బహుమతులుగా ఇచ్చి పుచ్చుకోవచ్చని చెప్పారు. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదని.. పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆరు సంవత్సరాల నుండి మాకు ఏమనిపిస్తోందంటే.. వినాయక విగ్రహం తయారు చేయడానికి మేము ముందుకు రావడం కాదు.. వినాయకుడే మాతో ఈ పని చేయిస్తున్నాడని అనిపిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా విగ్రహాలకు నీళ్లలో నిమజ్జనం చేస్తారు. కానీ ఈ చాక్లెట్ వినాయకుని విగ్రహాన్ని పాలలో నిమజ్జనం చేస్తామని.. అది వెంటనే కేక్ గా మారిపోతుందని బేకరీ నిర్వాహకులు తెలిపారు. ఆ కేకు పదార్థాన్నంతా ఎవరైతే నిరుపేదలు ఉంటారో.. వారికి ప్రసాదంగా పంపిణీ చేస్తామని చెప్పారు.

ఈ విగ్రహాన్ని చూసిన కస్టమర్లు చాలా కొత్తగా ఉందని.. ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఫెస్టివల్ ఇలానే ఉండాలని.. ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ చాక్లెట్ ను ఇష్టపడతారని.. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాక్లెట్ ను ఎంతో ఇష్టంగా తింటారని.. ఇలాంటి కొత్త విగ్రహాలను చూసినప్పుడు.. భగవంతుడే నిజంగా వచ్చాడేమో అనిపిస్తుందని కొత్త విషయాలను తెలుసుకున్నప్పుడు చాలా సంతోషం కలుగుతుందని ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

All Images Credited To Twitter

English summary

Ganesh chaturthi special: Ganesh idol made of dark chocolates

Here we are talking Ganesh Chaturthi:Ganesh idol made of dark chocolates Have a look
Story first published:Saturday, September 11, 2021, 15:58 [IST]
Desktop Bottom Promotion