For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ganesh Chaturthi Wishes in Telugu : వినాయక చవితి పండుగ విషెస్, మెసెజెస్ మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి...

|

విఘ్నాలు తొలగించే వినాయకుడికి గడ్డి పరక సమర్పించినా కూడా ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు. ఉండ్రాళ్లకు ఉబ్బితబ్బిబ్బయ్యే బొజ్జగణపతి తనను భక్తి, శ్రద్ధలతో కొలిచే వారిని సకల విఘ్నాల నుండి కాపాడతాడు.

హిందూ పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటాం. ఈ పండును ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఘనంగా జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అయితే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మరియు దేవాలయాల్లో వినాయకుడి విగ్రహాలు పెట్టుకుని పండుగను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

భారతీయ సమాజంలో ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ పండుగను పిల్లల నుండి పండు ముసలి వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. గణపతి నవరాత్రులు అందంగా అలంకరించిన మండపాలు, ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మనం ఏ పని ప్రారంభించినా.. ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటాం. అలాంటిది ఏడాదిలో మనం చేయబోయే పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతం కావాలని ఆ లంబోదరుడిని కోరుకుంటాం. విజయానికి.. తెలివితేటలకు ప్రతీకగా.. తొలిపూజలందుకునే వినాయకుడు ఎవ్వరూ ఏ కోరిక కోరుకున్న కచ్చితంగా తీరుస్తాడు. అంతేకాదండోయ్.. మన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు కూడా తాము చేపట్టిన పనుల్లో విజయం సాధించాలని ఓ మంచి మనసుతో వేడుకుంటాం. ఈ సందర్భంగా మీ ఆత్మీయుల మనసును హత్తుకునే మెసెజులను కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం. కరోనా వంటి మహమ్మారి సమయంలో మీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహతులకు ఎలాంటి సందేశాలు పంపించాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసం కొన్ని సందేశాలు, సూక్తులను తీసుకొచ్చాం... వీటిలో మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోండి... మీ ఆత్మీయులతో షేర్ చేసుకోండి...

గణేష్ చతుర్థి 2021 : వినాయక చవితి విశిష్టత గురించి తెలుసుకుందామా?

లంబోదరుడు కరోనా వంటి కష్టాల నుండి గట్టెక్కించాలని, మీ జీవితాన్ని ఆనందంతో నింపాలని కోరుకుంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు.

ఆ బొజ్జ గణపతి మీ ప్రార్థనలన్నింటినీ విని మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ...
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

లంబోదరుడు మీ కన్నీళ్లను నవ్వులుగా, మీ కష్టాలను సంతోషంగా, కారుమబ్బులను హరివిల్లులగా మార్చాలని కోరుకుంటూ..
హ్యాపీ వినాయక చవితి.

గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డూ ఎంత తియ్యగా ఉంటుందో, అంతే తియ్యగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు.

బొజ్జ గణపయ్య మీ ఇంటికి వచ్చి మీరు పెట్టిన లడ్డూలు, కుడుములతో పాటు మీకున్న ఇబ్బందులను కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

మీ జీవితంలో ఆనందం గణపతి బొజ్జంత.. ఆయుష్షు ఆయన తొండమంత.. సమస్యలు ఆయన ఎలుకంత ఉండాలని కోరుకుంటూ
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

గణేష్ చతుర్థికి నైవేద్యంగా పెట్టగల ఆరోగ్యకరమైన ఆహారాలు...

మీ జీవితంలోని విఘ్నాలన్నింటినీ తొలగించి మిమ్మల్ని ఎల్లవేళలా ఆనందంగా ఉండేలా చూడాలని కోరుకుంటూ...
వినాయక చవితి శుభాకాంక్షలు..

విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను తొలగించి, మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ..
హ్యాపీ వినాయక చవితి..

విఘ్నాధిపతి మీకు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు అందించాలని, సుఖసంతోషాలు మీ ఇంట్లో కొలువుండేలా చూడాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

మీరు ఏ పని మొదలుపెట్టినా.. ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలని.. ఆ లంబోదరుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ..
వినాయక చవితి శుభాకాంక్షలు..

2021లో వినాయక చవితి ఎప్పుడొచ్చింది?

ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, 2021 సంవత్సరంలో సెప్టెంబర్ పదో తేదీన అంటే శుక్రవారం నాడు గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో గణేష్ చతుర్థిని పండుగను జరుపుకుంటారు.

English summary

Happy Ganesh Chaturthi 2021: Wishes, quotes, images, whatsapp, facebook status messages in telugu

Here we talking about Ganesh Chaturthi 2020 : wishes, quotes, images, whatsapp, facebook status messages in Telugu. Read on.