Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
Google Year in Search 2021: ఈ ఏడాది మనోళ్లు గూగుల్ లో ఎక్కువగా దేని కోసం వెతికారో తెలుసా...
2021లో భారతీయులు గూగుల్ లో ఎక్కువగా ఏమి వెతికారో తెలుసా...
ఈరోజుల్లో మనలో చాలా మంది ఇంటర్నెట్ కు బాగా అలవాటు పడ్డారు. మన ఇండియాలో ఇప్పుడు ఇంటర్నెట్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో అన్నంతగా పరిస్థితులు మారిపోయాయి. ఇక స్మార్ట్ ఫోన్ వచ్చాక.. టెక్నాలజీ పెరిగాక.. ప్రతిఒక్కరూ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా వెంటనే గూగుల్ లో వెతికేస్తున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే 2021 సంవత్సరంలో భారతీయులు గూగుల్(Google Trends 2021)లో ఎక్కువగా దేని కోసం వెతికారు.. అనే సమాచారాన్ని గూగుల్ ఇటీవలే రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా మన ఇండియన్ ఇంటర్నెట్ యూజర్లు ఎక్కువగా ఎలాంటి సమాచారం కోసం గూగుల్ లో వెతికారో చూసెద్దాం రండి...

ఫస్ట్ ప్లేసులో స్పోర్ట్స్..
2020 సంవత్సరంలో ప్రపంచాన్ని కరోనా వణికించింది. అందుకే 2021లో అందరూ కరోనా వ్యాక్సిన్ గురించి తెలుసుకునేందుకు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపించారు. అయితే మన దేశంలో మాత్రం క్రికెట్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే 2021లో మనోళ్లు ఎక్కువగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL), టి20 వరల్డ్ కప్ గురించి ఎక్కువగా వెతికారట. దీంతో గూగుల్ ట్రెండ్స్ టాప్-10లో స్పోర్ట్స్ ఫ్లస్ట్ ప్లేసులో నిలిచింది.

కరోనా గురించి..
ఇక 2021 సంవత్సరంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో.. చాలా మంది తమ దగ్గర్లోని కరోనా వ్యాక్సిన్ సెంటర్ల కోసం గూగుల్ లో ఎక్కువగా వెతికారట. వీటితో పాటు కోవిద్ టెస్టులు, ఫ్రీ ఫుడ్ సర్వీస్, ఆక్సీజన్ సిలిండర్లు, కరోనా హాస్పిటల్స్ వంటి సమాచారం కోసం వెతికారట. దీంతో కరోనా పోర్టల్ టాప్-2లో నిలిచింది.

సూర్య సినిమా కోసం..
మన దేశంలో స్పోర్ట్స్, హెల్త్ తర్వాత సినిమాలకు అత్యంత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ఓటీటీలో రిలీజైన సినిమాల కోసం ఎక్కువగా వెతికారట. అందులోనూ సూర్య నటించిన యదార్థ సంఘటన సినిమా ‘జై భీమ్' కోసం ఎక్కువగా అన్వేషించారట. ఓ పేద కుటుంబంపై పోలీసులు అన్యాయంగా పెట్టిన కేసు, దాడి గురించి అందరినీ ఆలోచింపజేసేలా ఉండటమే ఈ చిత్ర ప్రత్యేకత. దీని తర్వాత సిద్దార్థ మల్హోత్రా, కియారా అద్వానీ నటించిన షేర్షా సినిమా గురించి ఎక్కువగా వెతికారట. కార్గిల్ వార్ లో అసమాన పోరాటం చేసి అమరుడైన ఇండియన్ ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బాత్రా లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా రిలీజైంది.

గోల్డ్ విన్నర్ నీరజ్..
ఇక గూగుల్ టాప్ ట్రెండింగ్ పర్సన్లలో మాత్రం నీరజ్ చోప్రా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో భారతదేశానికి తొలి బంగారు పతకాన్ని అందించడంతో తన గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది గూగుల్ లో వెతికారట. ఆ తర్వాత షారుక్ ఖాన్ పుత్రుడు ఆర్యన్ ఖాన్ కోసం వెతికారట. ఆ తర్వాత రాజ్ కుంద్రా, ఎలాన్ మస్క్, షెహనాజ్ గిల్ వంటి ప్రముఖ వ్యక్తుల కోసం వెతికారట.

కరోనా వ్యాక్సిన్.
కరోనా వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్, ఆక్సీజన్ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి.. ఏమి చేయాలి... పాన్-ఆధార్ ఎలా లింక్ చేయాలి.. ఇంట్లోనే ఆక్సీజన్ ఎలా తయారు చేయాలనే విషయాల గురించి ఎక్కువగా వెతికినట్లు గూగుల్ వివరించింది.

టోక్యో ఒలింపిక్స్..
2021లో న్యూస్ కు సంబంధించిన విషయాల్లో టోక్యో ఒలింపిక్స్ టాప్ లో నిలిచినట్లు గూగుల్ వెల్లడించింది. వీటి తర్వాత బ్లాక్ ఫంగస్, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్, లాక్ డౌన్ వంటి వాటి గురించి ఎక్కువగా అన్వేషించారట.

బ్లాక్ ఫంగస్..
ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి? దాని లక్షణాలేంటి.. అది ఎలా సోకుతుంది.. అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే వివరాల కోసం గూగుల్ ఎక్కువగా వెతికారట.

ఆఫ్ఘానిస్థాన్ తాలిబన్ల గురించి..
ఆఫ్ఘానిస్థాన్ దేశాన్ని తాలిబన్లు తమ హస్తగతం చేసుకున్న తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఆ దేశంలో ఏం జరుగుతోందని తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపించారట. అసలు వారు ఎలా ప్రభుత్వాన్ని నడుపుతారు.. ఏ విధంగా పాలన చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారట.

రెమెడిసివర్..
కరోనా వ్యాక్సిన్ గురించి ఏ కొత్త సమాచారం వచ్చినా అందరూ తెలుసుకునేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపేవారట. ఈ నేపథ్యంలో రెమెడిసివర్ ఇంజెక్షన్ గురించి తెలుసుకునేందుకు గూగుల్ లో ఎక్కువగా వెతికారట. అది కరోనాకు వ్యతిరేకంగా ఎలా పని చేస్తుంది.. కరోనాపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనే వివరాల కోసం ఆసక్తిగా చూశారట.

ఒమిక్రాన్..
ఇటీవలే దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడంతో వీటి గురించి కూడా ఇంటర్నెట్ యూజర్లు గూగుల్ లో తెగ వెతికారట. ఇది డెల్టా కన్నా ప్రమాదకరమా? కాదా? ఈ మహమ్మారి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకునేందుకు గూగుల్ ఎక్కువగా వెతికారట.



Click it and Unblock the Notifications