ఈ చెట్లను ఇంట్లో పెంచితే అదృష్టం వస్తుంది, వీటిని పెంచితే దురదృష్టం వెంటాడుతుంది

వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి మొక్కలను ఇంట్లో పెంచితే అదృష్టం వరిస్తుందో.. ఎలాంటి మొక్కలను పెంచితే దురదృష్టం వెంటాడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి నిర్మాణంలో వాస్తు పాటించడం చాలా ముఖ్యం. సరైన వాస్తులేని ఇళ్లల్లో ఉంటే ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే ఇంట్లో పెంచుకునే మొక్కల విషయంలోనే వాస్తు శాస్త్రంలో చాలా స్పష్టమైన సూచనలు ఉన్నాయి. వాటిని పాటిస్తూ చెట్లను ఏ దిక్కులో పెట్టాలో, ఎలాంటి మొక్కలను పెంచుకోవాలో తెలుసుకుని మసులుకోవాలి. కొన్ని మొక్కలను సరైన దిశలో పెట్టి పెంచితో అదృష్టం కలుగుతుంది. కొన్ని మొక్కలను ఇంట్లో అస్సలే పెంచవద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Growing these trees at home brings good luck, growing these brings bad luck

వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి మొక్కలను ఇంట్లో పెంచితే అదృష్టం వరిస్తుందో.. ఎలాంటి మొక్కలను పెంచితే దురదృష్టం వెంటాడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అరటి చెట్టు

1. అరటి చెట్టు

చాలా కొద్దిమంది ఇళ్లల్లో మాత్రమే అరటి చెట్లు ఉంటాయి. ఇంట్లో అరటి చెట్లను పెంచడం వల్ల చేసే పనులు కలిసివస్తాయి. అరటి చెట్లను కుండీల్లో కూడా పెంచవచ్చు. అరటి చెట్టును ఇంటికి తూర్పు దిక్కుల ఉంచాలి. అరటి చెట్టు తన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రపరుస్తుంది. మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్‌ను అందిస్తుంది. అలాగే అరటి చెట్టును పడమర దిక్కులో ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.

2. మనీ ప్లాంట్

2. మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ మొక్కను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చూస్తారు చాలా మంది. ఈ మొక్కను ఇంటి లోపల పెంచితే లక్ష్మీ కటాక్షం సిద్దిస్తుందని విశ్వాసం. కుటుంబంలో ఆర్థిక సమస్యలను దూరం చేస్తుందని నమ్ముతారు. గ్రీన్ బెల్ ప్లాంట్ ఇంటి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ మొక్కను ఇంటి ఆగ్నేయ మూలలో ఉంచాలి. మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచితే వాస్తు దోషాలు పోతాయని పండితులు చెబుతున్నారు.

3. తులసి

3. తులసి

హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి మొక్కను ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో బాల్కనీలో లేదా కిటికీలో ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. కుటుంబం ఆనందంగా ఉంటుంది. రోజూ తులసి మొక్క కింద దీపం వెలిగిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తులసి మొక్కను ఇంటి దక్షిణ దిశలో ఎట్టిపరిస్థితుల్లోనూ పెంచవద్దు.

వాస్తు ప్రకారం ఈ చెట్లను ఇంట్లో కానీ, ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ పెంచవద్దు. వీటి వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి.

గోరింటాకు

గోరింటాకు

గోరింటాకు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. ఇంటి లోపల మాత్రమే కాదు ఇంటి బయట కూడా గోరింటాకు పెంచువద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది. గోరింటాకు చెట్లను పెంచుకోవడం మంచిది కాదు. ఇంట్లో సమస్యలకు గోరింటాకు చెట్టు ఆజ్యం పోస్తుంది. కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది.

రేగు చెట్లు

రేగు చెట్లు

గోరింటాకు చెట్టుతో పాటు రేగు చెట్లను ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచవద్దు. రేగు చెట్లకు ముళ్లు ఎక్కువగా ఉంటాయి. ముళ్లు ఎక్కువగా ఉండే చెట్లను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో అనేక ఇబ్బందులు వస్తాయి. అయితే నిమ్మ చెట్లకు కూడా ముళ్లు ఉంటాయి. కానీ నిమ్మ చెట్లను ఇంట్లో నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు. నిమ్మకు ప్రతికూల శక్తులను దూరం చేసే లక్షణం ఉంటుంది. అయితే ఇంటి ముందు మాత్రం నిమ్మ చెట్టు ఉండకూడదు.

ఆ దిశలోనే పెంచాలి

ఆ దిశలోనే పెంచాలి

పెద్ద పెద్ద చెట్లను ఇంటి పరిసరాల్లో పెంచాలనుకుంటే అవి కచ్చితంగా నైరుతి వైపు మాత్రమే ఉండేలా చూసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. నైరుతి మూల ఎంత పెద్ద చెట్లనైనా పెంచుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి చెట్ల పెంపకం విషయంలో వాస్తు నియమాలను పాటించి, ప్రతికూల ఫలితాల నుండి బయటపడి సానుకూల దృక్పథంతో సంతోషంగా జీవించండి. రావి, చింత చెట్లను ఇంటి పరిసరాల్లో పెంచుకోవద్దని శాస్త్రం చెబుతోంది.

Desktop Bottom Promotion