Latest Updates
-
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్!
Guru Asta 2022:గురుడి అస్తమయం... ఈ 3 రాశులకు మెరుగైన ఆదాయం... మీ రాశి కూడా ఉందేమో చూడండి...
2022లో ఫిబ్రవరి 19వ తేదీన గురుడు అస్తమించనున్నాడు. ఈ సమయంలో 3 రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో గురుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహం అత్యంత శుభప్రదమైన గ్రహంగా పరిగణించబడుతుంది.

ఎవరి జాతకంలో అయితే గురు గ్రహం బలంగా ఉంటుందో వారి జీవితంలో అన్ని ఆనందాలు దక్కుతాయి. ఆదాయం, ఐశ్వర్యం, తెలివితేటల విషయంలో గురువు అనుగ్రహం చాలా అవసరం. ధనస్సు రాశి మరియు మీన రాశికి అధిపతిగా గురుడు ఉంటాడు.

ఎంతో విశిష్టత కలిగిన గురుడు ఫిబ్రవరి 19వ తేదీన అస్తమించబోతున్నాడు. సుమారు నెల రోజుల పాటు అంటే మార్చి 20వ తేదీ వరకు ఇదే స్థితిలోనే ఉంటాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి...

తుల రాశి..
ఈ రాశి వారికి గురుడి అస్తమయం కారణంగా శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి ఈ సమయంలో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. అయితే మీరు డబ్బును ఆదా చేయడంలో మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే కఠోరమైన శ్రమతో మీరు విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి గురుడి అస్తమయం సమయంలో అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ధనస్సు రాశి వారి పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభించగలరు. మీరు ఒకటి కంటే ఎక్కువ మాధ్యమాల ద్వారా డబ్బు పొందొచ్చు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో తమ ప్రతిభను కనబరిచేందుకు మంచి అవకాశాలు కనిపిస్తాయి.

మీన రాశి..
ఈ రాశి వారికి కూడా గురుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి గురుడి అస్తమయం కారణంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీన రాశి వారికి నిలిచిపోయిన పని పూర్తవుతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు స్నేహితుల సహాయంతో కొన్ని కొత్త పనులను ప్రారంభించేందుకు ప్లాన్ చేయొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు ఈ కాలంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఊహాలు మరియు అంచనాలపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఈ వివరాలన్నీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అందించినవి. వీటిని నమ్ముతారా లేదా నమ్మకపోవడం అనేది మీ ఇష్టం. ఈ సమాచారానికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోగలరు. మీకు మీ జాతకం గురించి పూర్తి వివరాలు కావాలంటే.. వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించగలరు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో గురుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహం అత్యంత శుభప్రదమైన గ్రహంగా పరిగణించబడుతుంది. ఎవరి జాతకంలో అయితే గురు గ్రహం బలంగా ఉంటుందో వారి జీవితంలో అన్ని ఆనందాలు దక్కుతాయి. ఆదాయం, ఐశ్వర్యం, తెలివితేటల విషయంలో గురువు అనుగ్రహం చాలా అవసరం. ధనస్సు రాశి మరియు మీన రాశికి అధిపతిగా గురుడు ఉంటాడు. ఎంతో విశిష్టత కలిగిన గురుడు ఫిబ్రవరి 19వ తేదీన అస్తమించబోతున్నాడు.



Click it and Unblock the Notifications