For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hanuman Jayanti 2022:శని దోషం తగ్గాలంటే..హనుమాన్ జయంతి రోజున ఇలా చేయండి...

హనుమాన్ జయంతి 2022 సందర్భంగా శని దోషం పోవడానికి పాటించాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. 2022లో ఏప్రిల్ 16వ తేదీన అంటే శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది.

Hanuman Jayanti:Remedies To Get Rid of Shani Dosha on Hanuman Jayanti in Telugu

ఈ పవిత్రమైన రోజున అర్ధరాత్రి 2:25 గంటలకు శుభ ముహుర్తం ప్రారంభమవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12:24 గంటలకు పూర్ణిమ తిథి ముగస్తుంది. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా ఆంజనేయుని దేవాలయాల్లో ఘనంగా పూజలు జరుగుతాయి.

Hanuman Jayanti:Remedies To Get Rid of Shani Dosha on Hanuman Jayanti in Telugu

మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి నాడు జరుపుకుంటారు. కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి ముగిసిన వారం రోజుల తర్వాత హనుమాన్ జయంతి వస్తుంది.

Hanuman Jayanti:Remedies To Get Rid of Shani Dosha on Hanuman Jayanti in Telugu

ఈ ఏడాది హనుమాన్ జయంతికి ఓ ప్రత్యేకత ఉంది. శనివారం ఆంజనేయుడికి ఇష్టమైన రోజు. ఈ సంవత్సరం ఇదే రోజున హనుమాన్ జయంతి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులు చేస్తే శని దోషం నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి రోజున శని దోషాన్ని పోగొట్టుకోవడానికి ఏయే పనులు చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Hanuman Jayanti 2022:హనుమాన్ జయంతి పూజా విధానం.. శుభ ముహుర్తాలివే...Hanuman Jayanti 2022:హనుమాన్ జయంతి పూజా విధానం.. శుభ ముహుర్తాలివే...

దీపారాధన చేయండి..

దీపారాధన చేయండి..

హనుమాన్ జయంతి రోజున అంటే శనివారం సాయంత్రం ఆంజనేయునికి ఆలయానికి వెళ్లి దీపారాధన చేయండి. మీరు వెలిగించే దీపానికి ఆవ నూనెను మాత్రమే వాడాలి. దీపం వెలిగించిన తర్వాత 11సార్లు హనుమాన్ చాలీసాను పఠించాలి. అలాగే గులాబీ పువ్వులతో కూడిన పూలమాలను దేవునికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల శని గ్రహ ప్రభావం నుండి బయటపడొచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే హనుమంతుని అనుగ్రహం కచ్చితంగా లభిస్తుంది.

రామ రక్షా స్తోత్రం..

రామ రక్షా స్తోత్రం..

హనుమాన్ జయంతి రోజున పవన పుత్రుని ఆలయంలో శ్రీరామ, సీతాదేవి, ఆంజనేయుడిని పూజించాలి. అనంతరం రామ రక్షా స్తోత్రం పఠిస్తే హనుమంతుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే శని భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇప్పటివరకు మీకు శని దోషం వల్ల కలిగిన ఆటంకాలన్నింటినీ అధిగమిస్తారు. మీ పనులన్నీ పూర్తిగా విజయవంతమవుతాయి.

Hanuman Jayanthi 2022 Wishes : మీ సన్నిహితులకు హనుమాన్ జయంతి విషెస్ చెప్పండిలా...!Hanuman Jayanthi 2022 Wishes : మీ సన్నిహితులకు హనుమాన్ జయంతి విషెస్ చెప్పండిలా...!

శని కోపం తగ్గేందుకు..

శని కోపం తగ్గేందుకు..

రామాయణం ప్రకారం, హనుమంతుడు రాముడిని ఎంతలా ఆరాధిస్తారో మనలో చాలా మందికి తెలిసిందే. హనుమంతుడికి శ్రీరామచంద్రుడు అమితమైన భక్తి అని చాలా మంది నమ్ముతారు. అందుకే హనుమాన్ జయంతి రోజున గర్భగుడిని ఏర్పాటు చేసి పూజలు చేయండి. ఇలా చేయడం వల్ల ఆంజనేయుడు ఆయురారోగ్యాలతో పాటు సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదిస్తాడు. అంతేకాదు శని భగవానుడి కోపాన్ని కూడా తగ్గిస్తుంది.

అడ్డంలకులు తొలగిపోవాలంటే..

అడ్డంలకులు తొలగిపోవాలంటే..

ఎవరి జాతకంలో అయినా శని దోషం ఉంటే, వారు హనుమాన్ జయంతి రోజున అంటే శనివారం నాడు ఆంజనేయుని ఆలయానికి వెళ్లి, కొబ్బరికాయను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

హనుమంతుని అనుగ్రహం..

హనుమంతుని అనుగ్రహం..

హనుమాన్ జయంతి రోజున శని దోషం తగ్గేందుకు ఆంజనేయుడికి గులాబీ పువ్వుల మాలను ధరించాలి. అలాగే 11 తమలాపాకులపై రామ నామాన్ని రాసి హనుమంతునికి పువ్వుల మాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. అలాగే శనీశ్వరుడి ఇబ్బంది కూడా ఉండదు.

FAQ's
  • హనుమాన్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు?

    హిందూ పంచాంగం ప్రకారం, 2022లో ఏప్రిల్ 16వ తేదీన అంటే శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున అర్ధరాత్రి 2:25 గంటలకు శుభ ముహుర్తం ప్రారంభమవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12:24 గంటలకు పూర్ణిమ తిథి ముగస్తుంది. కాబట్టి సూర్యోదయం సమయంలో ఆంజనేయుడిని ఆరాధించాలి. ఈరోజు హనుమాన్ భక్తులందరూ ప్రత్యేక ఉపవాసం పాటించాలి.

  • హనుమాన్ జయంతిని పాటించాల్సిన నియమాలేంటి?

    హనుమాన్ జయంతి రోజున భక్తులందరూ కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఈ పవిత్రమైన రోజున నేలపైనే నిద్రించాలి. బ్రహ్మచార్యాన్ని కూడా అనుసరించాలి. శ్రీరాముడు, సీతాదేవి మరియు హనుమంతులను గుర్తు చేసుకోవడానికి మీరు బ్రహ్మ ముహుర్తాలలో మేల్కొంటారు. తెల్లవారుజామునే నిద్ర లేచి, స్నానం చేయాలి. అనంతరం పూజా మందిరంలో లేదా దేవాలయంలో హనుమంతుడికి పూజ చేయాలి. హనుమాన్ చాలీసాతో పాటు భజరంగీ మంత్రాలను పఠించాలి. ఆంజనేయుని ఆశీర్వాదం పొందడానికి, హనుమాన్ జయంతి రోజున ఆ దేవునికి సువాసన గల నూనె, మరియు సింధూరాన్ని అర్పించాలి. ఈరోజున సుందరకాండ పారాయణం, రామలక్ష్మణ చరితం, భజరంగబళి పఠనం చేయాలి.

  • హనుమాన్ జయంతి రోజున శని కోపం తగ్గేందుకు ఏమి చేయాలి?

    రామాయణం ప్రకారం, హనుమంతుడు రాముడిని ఎంతలా ఆరాధిస్తారో మనలో చాలా మందికి తెలిసిందే. హనుమంతుడికి శ్రీరామచంద్రుడు అమితమైన భక్తి అని చాలా మంది నమ్ముతారు. అందుకే హనుమాన్ జయంతి రోజున గర్భగుడిని ఏర్పాటు చేసి పూజలు చేయండి. ఇలా చేయడం వల్ల ఆంజనేయుడు ఆయురారోగ్యాలతో పాటు సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదిస్తాడు. అంతేకాదు శని భగవానుడి కోపాన్ని కూడా తగ్గిస్తుంది.

English summary

Hanuman Jayanti:Remedies To Get Rid of Shani Dosha on Hanuman Jayanti in Telugu

Here we are talking about the Hanuman jayanti 2022:Remedies to get rid of shani dosha on Hanuman Jayanti in Telugu. Read on
Story first published:Thursday, April 14, 2022, 16:39 [IST]
Desktop Bottom Promotion