Latest Updates
-
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ -
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
Hanuman Jayanthi 2023 Wishes : మీ సన్నిహితులకు హనుమాన్ జయంతి విషెస్ చెప్పండిలా.!
Hanuman Jayanthi 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర మాసం అంటే తెలుగు వారికి నూతన సంవత్సర ప్రారంభ మాసం. ఈ మాసం చాలా ప్రత్యేకమైనది.
ఈ నెల ప్రారంభంలో దుర్గామాతను నవరాత్రుల్లో తొమ్మిది రూపాల్లో అలంకరించి పూజిస్తారు. ఇదే మాసంలో నవమి రోజున శ్రీరామ నవమి పండుగను కూడా జరుపుకుంటారు. ఇదే నెలలో వచ్చే పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి పండుగను కూడా జరుపుకుంటారు.

హనుమంతుడిని భజంరంగబళి, పవన పుత్ర, అంజని పుత్ర, ఆంజనేయుడు అని పిలుస్తారు. హనుమంతుని శివుని పదకొండో అవతారంగా కూడా చెబుతారు. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది ఉపవాస దీక్షను చేస్తారు.

ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా హనుమంతుని దేవాలయాలన్నీ ప్రత్యేకంగా అలంకరించి.. విశేష పూజలు చేస్తారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మీరు మీ కుటుంబసభ్యులకు, స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులందరికీ ఈ అందమైన సందేశాలను, శుభాకాంక్షలను తెలియజేయండి...


ఆంజనేయుని అనుగ్రహం..
శివుని అంశ, వాయు పుత్రుడు
అర్జునుడికి ప్రియ సఖుడు.. శ్రీరామదాసుడు..
ఎర్రని కన్నులుగలవాడు..
అమిత విక్రముడు.. సాగరాన్ని దాటినవాడు..
లంకలో సీతమ్మ శోకాన్ని హరించినవాడు..
సంజీవని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు..
ఇలా ఎన్నో శక్తులు హనుమంతుని అనుగ్రహం
మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

హనుమకు వందనం..
‘నా జీవితాంతం నేను హనుమకు వందనం చేస్తున్నాను..
ప్రతి ఒక్కరూ మీ లక్షణాలు కావాలని కోరుకుంటారు..
మీ ఆశీస్సులో అనునిత్యం అందరికి ఉండాలని కోరుతూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

శ్రీ సీతారాములు..
ఎక్కడ రాముడిని కీర్తిస్తారో..
అక్కడ హనుమ అనుగ్రహ ప్రదాత అయి ఉంటాడు..
హనుమ పేరును ఉచ్చరించిన చోట..
శ్రీసీతారాములు కొలువై ఉంటారు
మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ హనుమాన్ జయంతి.

హనుమత్ స్మరణాత్ భవేత్..
బుద్ధిర్భలం, యశోధైర్యం, నిర్భయత్వం..
అరోగతా అజాడ్యం, వాక్పటుత్వంచ
హనుమత్ స్మరణాత్ భవేత్!!
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

హనుమ బలం..
‘హనుమ బలం.. అసమానమైన భక్తి
నిస్వార్థ సేవకు ప్రతీక అయిన ఆంజనేయుడు
మీకు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

పవన పుత్రుడికి..
హనుమాన్ జయంతి సందర్భంగా..
పవన పుత్రుడిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిద్దాం..
మన జీవితంలోని ప్రతీ ప్రయత్నంలో విజయం సాధిద్ధాం..
ఆయన ఆశీర్వాదం దక్కాలని కోరుకుందాం..
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

సకల గుణ నిదానం..
అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం
దనుజవన క్రుశానుం జ్ణానినా మగ్రగణ్యమ్!
సకల గుణనిధానం వానరాణా మదీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

బల బుద్ధి..
శ్రీగురు చరణ సరోజరజనిజమన ముకుర సుధారీ
వరణౌ రఘువర విమలయశజోదాయక ఫలచారీ
బుద్ధిహీనతను జానీకై సుమిరౌ పవన కుమార్
బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్!!
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

బుద్ధిర్భలం..
గోప్పదీక్రుత వారాశిం మశకీక్రుత రాక్షసమ్
రామాయణ మహామాలా రత్నం వందేనీలాత్మజమ్
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్బయత్వ మరోగతా
అజాడ్యం వార్పటుత్వం చా హనుమత్ప రణాద్భవేత్
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

నమ్మిన వారి కోసం..
‘హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది
రామతత్వం..
కష్టంలో కలసి నడవాలన్నది
సీత తత్వం..
కుటుంబ బాధ్యత పంచుకోవాలనేది
లక్ష్మణతత్వం
నమ్మినవారి కోసం తెగించమంటుంది
ఆంజనేయ తత్వం..
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications
