For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Atla Tadde 2023: మీ సన్నిహితులకు అట్ల తద్ది విషెస్ చెప్పండిలా...

|

హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్వీయుజ మాసంలో బహుళ తదియ రోజున అట్ల తద్ది పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన మంగళవారం రోజున ఈ పండుగ వచ్చింది.

Happy Atla Tadde 2021

ఈ పవిత్రమైన రోజున ఆడపడచులందరూ చెట్లకు ఊయల కట్టి ఊయాలాట ఆడుతారు. ఇదే రోజున అమ్మవారిని పూజిస్తారు. ఈరోజున చంద్రోదయం వరకు ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, ముత్తయిదువులకు వాయినం సమర్పిస్తే..పెళ్లికాని అమ్మాయిలకు గుణవంతుడు, సౌమ్యుడైన భర్త లభిస్తాడని.. అదేవిధంగా పెళ్లైన మహిళల భర్తలు ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతుందని నమ్ముతారు.

Happy Atla Tadde 2021

ఈ అట్లతద్ది రోజున చాలా మంది మహిళలు అట్లతద్ది నోములు చేస్తారు. విజయదశమి తర్వాత వచ్చే తదియనాడే ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను ఐదేళ్లు పూర్తయిన బాలికల నుండి ముత్తయిదవుల వరకు ఎంతో సందడిగా జరుపుకుంటారు.

Happy Atla Tadde 2021

పురాణాల ప్రకారం త్రిలోక సంచారి అయిన నారుదుని ప్రోద్బలంతో పరమేశ్వరుడిని తన పతిగా పొందడానికి పార్వతీదేవి తొలిసారి చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. అప్పటినుండి నేటి వరకు స్త్రీలందరూ తమ సౌభాగ్యం కోసం అట్లతద్ది వ్రతం చేస్తున్నారు. ఈ సందర్భంగా అట్లతద్దికి సంబంధించిన ఆసక్తికరమైన సందేశాలను, కథలను మీ సన్నిహితులు, శ్రేయోభిలాషులతో షేర్ చేసుకోండి.

ఉల్లాసంగా ఉత్సాహంగా..

ఉల్లాసంగా ఉత్సాహంగా..

ఈ చంద్రుని కాంతి మీ జీవితాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా మార్చేయాలని.. మీ దాంపత్య జీవితం సాఫీగా సాగాలని.. మీ భర్తతో పాటు మీరూ వందేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని..

అట్ల తద్ది శుభాకాంక్షలు..

సంతోషకరమైన జీవితం..

సంతోషకరమైన జీవితం..

అట్ల తద్ది సందర్భంగా మీకు మరియు మీ భర్తకు సుదీర్ఘమైన మరియు సంతోకరమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటూ..

అట్ల తద్ది శుభాకాంక్షలు..

బలమైన బంధం..

బలమైన బంధం..

ఈ అట్ల తద్ది సందర్భంగా భార్యభర్తల మధ్య బంధం మరింత బలపడాలని.. మీరిద్దరూ మరింత దగ్గరగా.. సన్నిహితంగా గడపాలని కోరుకుంటూ..

అట్ల తద్ది శుభాకాంక్షలు..

ఆరోగ్యకరంగా..

ఆరోగ్యకరంగా..

మీకు మరియు మీ భర్త మంచి ఆరోగ్యం, సంపద, సుఖమైన జీవితం ఉండాలని కోరుకుంటూ..

అట్ల తద్ది శుభాకాంక్షలు..

ప్రేమ బంధం..

ప్రేమ బంధం..

ఈ అట్ల తద్ది సందర్భంగా మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం మరింతగా బలపడుతుందని ఆశిస్తున్నాను. సర్వశక్తిమంతుడు మీ సంతోషకరమైన మరియు సుదీర్ఘమైన వైవాహిక జీవితాన్ని అనుగ్రహిస్తాడని ఆశిస్తూ..

అట్ల తద్ది శుభాకాంక్షలు..

చంద్రుని ఆశీస్సులు..

చంద్రుని ఆశీస్సులు..

చంద్రుని దర్శనంతో మీ మనసు సంతోషంతో నిండిపోవాలని.. మీకు మరియు మీ భర్తకు చందమామ ఆశీస్సులు తప్పక లభిస్తాయని ఆశిస్తూ..

హ్యాపీ అట్ల తద్ది..

గోరింటాకు..

గోరింటాకు..

మీ అరచేతులు ఎల్లప్పుడూ గోరింటాకుతో అలంకరించబడతాయి. దీంతో మీరు చంద్రుని యొక్క ఉత్తమమైన దీవెనలతో మునిగిపోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు మరియు మీ భర్తకు మంచి ఆరోగ్యం మరియు సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటున్నాం.

అట్ల తద్ది శుభాంక్షలు.

FAQ's
  • అట్ల తద్ది పండుగను ఎప్పుడు జరుపుకుంటారు?

    హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్వీయుజ మాసంలో బహుళ తదియ రోజున అట్ల తద్ది పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీన శనివారం రోజున ఈ పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున ఆడపడచులందరూ చెట్లకు ఊయల కట్టి ఊయాలాట ఆడుతారు.

English summary

Happy Atla Tadde 2023: Wishes, Messages, Quotes, Images, Facebook & Whatsapp status in Telugu

Here are the Happy atla tadde 2023:wishes, messages, quotes, images, facebook & whatsapp status in Telugu. Have a look
Desktop Bottom Promotion