Latest Updates
-
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.!
విజయదశమి పండుగ విషెస్ మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండిలా...
దసరా పండుగ శుభాకాంక్షలను మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి.
దుర్గా మాత తొమ్మిది మంది రాక్షసులను నవరాత్రుల్లో వెంటాడి, వేటాడి సంహరించింది. పదో రోజు మొత్తం రాక్షసులపై విజయం సాధించినందుకు ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటున్నాం.


పురాణాల ప్రకారం, విజయాలకు కారకులైన దశమి విజయదశమి. అర్జనుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను ఓడించి అజ్ణాతవాసాన్ని పూర్తి చేసిన రోజు. మరోవైపు రాముడు రావణాసురుడిని అంతమొందించిన శుభ దినం కాబట్టే విజయదశమి అయ్యింది. ఇలా మొత్తానికి చెడుపై మంచి సాధించిన విజయం కాబట్టి.. ఈ ప్రత్యేకమైన రోజున మీ బంధుమిత్రులతో, కుటుంబసభ్యులతో విజయదశమి(దసరా) విషెస్ ను షేర్ చేసుకోండి...

చెడుపై విజయం..
చెడుపై మంచి విజయం సాధించిన రోజు...
దుర్గామత రాక్షుసుడిని మట్టుబెట్టిన రోజు
రావణుడిని రాముడు సంహరించిన రోజు...
అందుకే దసరా అంటే మనకు ప్రత్యేకమైన రోజు..
ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...

మన కోరికలన్నీ..
కరోనా వంటి కాలంలో మన కోరికలన్నీ తీర్చి..
మనకు రక్షణగా ఉండే రోజే దసరా..
మీకు మీ కుటుంబసభ్యులకు, స్నేహితులకు దసరా శుభాకాంక్షలు...

క్షేమంగా ఉండాలని..
విజయదశమి సమయంలో మీ కుటుంబానికి క్షేమం
కలగాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు...

నిత్యం ఆశీర్వాదం..
అమ్మలగన్న అమ్మ మనల్ని తన కడుపులో
పెట్టుకుని.. చల్లగా చూడాలని..
మనందరికీ తన ఆశీర్వాదం నిత్యం అందించాలని..
మీకు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు హ్యాపీ దసరా...

విజయానికి ప్రతీకగా..
విజయదశమి నాడు ఏ పని చేసినా..
విజయం దక్కుతుందని.. అందుకే ఈరోజును
విజయానికి ప్రతీకగా భావిస్తుంటారు..
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...

లోకాన్ని ఏలే శక్తిస్వరూపిణి..
ఈ లోకాన్ని ఏలే శక్తి స్వరూపిణి..
ఆ జగన్మాత ఆశీస్సులు మీకు ఎల్లవేళలా
అందాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...

లోకాన్ని నడిపించే..
సమస్త జీవకోటి రాశులలో బుద్ధి, ప్రేమ,
శాంతి, క్షమ, శక్తి మొదలగు రూపాలలో
అవతరించి లోకాన్ని నడిపిస్తున్న ఆ దేవీ
ఆశీర్వాదం మనకు ఎల్లప్పుడూ లభించాలని కోరుతూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు...

భక్తి శ్రద్ధలతో..
ప్రాంతాలు వేరైనా.. భారతీయులంతా..
భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ దసరా..
ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ కావాలని కోరుతూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...

అమ్మవారి అనుగ్రహం..
నవరాత్రులను ఎంతో ఘనంగా జరుపుకుని..
విజయదశమి వేడుకలను కూడా ఘనంగా జరుపుకోవాలని,
అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...

దసరా వేళలో..
దసరా వేషాలతో..
జమ్మి చెట్టు ఆకులతో...
ఆయుధ పూజలతో..
దేవతల విజయగాధలతో..
బొమ్మల కొలువును తీసుకొచ్చేదే విజయదశమి..
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...



Click it and Unblock the Notifications