For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Fathers Day:ప్రతి కూతురు నాన్న గురించి చెప్పే భావోద్వేగ మాటలివే...!

|

మన సమాజంలో తల్లితో సమానంగా తండ్రి కూడా సమానమైన ప్రేమను అందిస్తానడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ 'తనలో ఉన్న భావోద్వేగాలను బయట పెట్టుకోలేక బయటకు చాలా గంభీరంగా కనిపిస్తూ.. ఆ ఫీలింగ్ తన ఫేసులో కనబడకుండా జాగ్రత్త పడే వ్యక్తే నాన్న' అనే నానుడి మన సమాజంలో ఎప్పటి నుండో బాగా నాటుకుపోయింది.

అందుకే ఈ ప్రపంచంలో మదర్స్ డే జరుపుకున్నంత ఘనంగా ఫాదర్స్ డే జరుపుకోరు. అందుకే తల్లిని ఆధారంగా చేసుకునే చిత్రాలు ఎక్కువగా వస్తుంటాయి. తండ్రి సెంటిమెంట్ తో చాలా తక్కువ సినిమాలు వస్తుంటాయి. ఎందుకంటే మనందరం తల్లి చాటు బిడ్డలని చాలా మంది ఫీలింగ్. ఏదేమైనా మన జీవితాల్లో ఓ ప్రత్యేకమైన పాత్రను పోషించే గొప్ప వ్యక్తి తండ్రి.

ఈ క్రమంలో ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి కూతురు తన తండ్రి గురించి ఎమోషనల్ కొటేషన్స్ చూడండి.. మీరు కూడా మీ నాన్నకు ప్రత్యేకమైన విషెస్ చెప్పండి.. మీ నాన్నను సర్ ప్రైజ్ చేయండి.. అందుకే మీకోసం కొన్ని మెసెజ్ లు, కోట్స్, విషెస్ జాబితాను తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని మీ ప్రియమైన తండ్రికి షేర్ చేయండి...

Fathers' Day 2021 : ఫాదర్స్ డే విషెస్, కోట్స్, మెసెజ్ లను షేర్ చేసుకోండి...

ఎన్నటికీ మరువను..

ఎన్నటికీ మరువను..

‘నేను ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన రోజు పర్వాలేదు లేమ్మా.. ఒకసారి పరీక్షలో తప్పినంత మాత్రాన మనకు పరీక్షలంటే ఉన్న భయం పోదు అని నన్ను ఓదార్చిన రోజును నేను ఎప్పటికీ మరువను'

హ్యాపీ ఫాదర్స్ డే.

నాకు జాబ్ వచ్చినప్పుడు..

నాకు జాబ్ వచ్చినప్పుడు..

‘నాకు మంచి కంపెనీలో జాబ్ వచ్చినప్పుడు.. నీ కళ్లలో వెయ్యి కాంతుల వెలుగును, నీ ఆనందాన్ని అంతకుముందు ఎప్పుడూ చూడలేదు నాన్న'

ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

ధైర్యాన్ని పెంచుతూ..

ధైర్యాన్ని పెంచుతూ..

‘నాన్న.. నా జీవితంలో ఎంతో ముఖ్యం. ఎందుకంటే జీవితంలో జయం ఎంత ముఖ్యమో అపజయం కూడా అంతే ముఖ్యం అని చెప్పి నాలో వాస్తవ జీవితం గురించి ధైర్యాన్ని నింపావు'

ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

Father's Day gifts 2021: నాన్నకు ప్రేమతో.. అదిరిపోయే కానుకలిచ్చేయండి...

అప్పగింతలప్పుడు..

అప్పగింతలప్పుడు..

‘నన్ను అత్తారింటికి పంపే సమయంలో.. అప్పగింతలప్పుడు నువ్వు కార్చిన కన్నీటిని నేను ఎప్పటికీ మరచిపోలేను నాన్న'.

హ్యాపీ ఫాదర్స్ డే.

నేను యువరాణినే..

నేను యువరాణినే..

ప్రతి అమ్మాయి తన భర్తకు రాణి అవుతుందో లేదో తెలియదు కానీ.. తండ్రికి మాత్రం ఎప్పటికీ యువరాణిగానే ఉంటుంది.

ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

నాన్న దండనలో..

నాన్న దండనలో..

ప్రతి ఒక్క తండ్రి దండనలో ఒక హెచ్చరిక కచ్చితంగా ఉంటుందది. అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని దాటేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మన జీవితంలో ఎందరో స్ఫూర్తిదాతలు ఉండొచ్చు. కానీ ఆ జాబితాలో తొలి పేరు మాత్రం ‘నాన్న'దే.

హ్యాపీ ఫాదర్స్ డే.

Father's Day 2021: నాన్నను అందరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా...

భవిష్యత్తును చూపేది..

భవిష్యత్తును చూపేది..

‘మనకు జన్మను ఇవ్వడమే కాదు.. మనకు భవిష్యత్తును చూపేది కూడా నాన్నే. అందుకే పిల్లలకు మొదటి గురువు, స్నేహితుడు, మార్గదర్శి అన్నీ నాన్నే.. ఆ తర్వాతే ఎవరైనా.

హ్యాపీ ఫాదర్స్ డే.

కష్టాల సమయంలో..

కష్టాల సమయంలో..

మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో.. తండ్రి ఇచ్చే తోడ్పాటుకు వెలకట్టలేం. భవిష్యత్తులో వెలకట్టేందుకు ఎలాంటి సాధనం ఉండదు. మనం ఏదైనా ప్రయత్నంలో విఫలమైనా.. దాన్ని ఆపొద్దు.. కంటిన్యూ చేయమని.. మరోసారి ప్రయత్నించమని చెప్పే తొలి గురువు నాన్నే.

ఫాదర్స్ డే శుభాకాంక్షలు

ఎప్పటికీ మరువకూడని..

ఎప్పటికీ మరువకూడని..

మనం జీవితంలో ఎప్పటికీ వ్యక్తుల్లో ‘నాన్న'తొలి వరసలో ఉంటారు. తల్లి తన మాటలతో పిల్లల్లో ధైర్యం నింపితే.. అదే ధైర్యాన్ని తన చేతలతో మనకు ఇవ్వగలిగేవాడు నాన్నే.

హ్యాపీ ఫాదర్స్ డే.

తన ఇష్టాలను..

తన ఇష్టాలను..

‘నా ఇష్టాలను తీర్చడానికి తన ఇష్టాలని కూడా వదులుకున్నాడు మా నాన్న. మా ఇంట్లో నాన్న అంటే అందరికీ భయం. కానీ నాకు మాత్రం ఆయనంటే చచ్చేంత ఇష్టం. ఎందుకంటే మనలో ఆనందాన్ని నింపి అల్లారుముద్దుగా పెంచి.. మనలోని లోపాలను సరిచేస్తూ మన భవితకు పునాదులు వేస్తూ మన గమ్యానికి దారి చూపేది నాన్నే.

ఫాదర్స్ డే శుభాకాంక్షలు

English summary

Happy Fathers Day Quotes From Daughter in Telugu

Here are the happy fathers day quotes from daughter in Telugu. Have a look
Desktop Bottom Promotion