Just In
Don't Miss
- News
హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో భారీ వర్షాలు: చల్లబడ్డ వాతావరణం, పిడుగుపాటుకు ముగ్గురు మృతి
- Sports
RR vs PBKS: సంజూ శాంసన్ సెంచరీ పోరాటం వృథా.. పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ.!
- Finance
Gold prices today: తగ్గిన బంగారం, వెండి ధరలు: ఐనా ఆ మార్కుకు పైనే
- Movies
ఉప్పెన తరువాత మొదటిసారి సరికొత్తగా దర్శనమిచ్చిన వైష్ణవ్ తేజ్.. న్యూ స్టైలిష్ లుక్!
- Automobiles
నైట్ కర్ఫ్యూ; ఒక్కరోజులో 68 వాహనాల స్వాధీనం.. ఎక్కడో తెలుసా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీ స్నేహితులను టచ్ చేసే బెస్ట్ విషెస్, కోట్స్, వాట్సాప్ మెసెజెస్ షేర్ చేసుకోండి...
కష్టాల్లో ఉన్నప్పుడు కామిడి చేసేవాడు.. కావ్.. కావ్.. మంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పేవాడు.. కంటెంట్ లేకున్నా ఏదైనా కథనాన్ని కళ్లకు కట్టినట్లు చూపేవాడు.. కీలక సమయంలో కామ్ గా ఉండేవాడు.. ఆ విషయాల్లో మాత్రం 'కన్నింగ్' నైసుగా ఉండేవాడు.. కన్యల విషయంలో 'కామ'ప్రమైజ్ కానివాడు.. మనకు ఖర్చులకు లేని సమయంలో కాసులిచ్చేవాడు.. కలలో కరిష్మా, కత్రినా లాంటి అందగత్తెలనే ఊహించుకునేవాడు.. కుమ్ములాటల్లో కత్లిలా దూసుకొచ్చేవాడు.. కడలిని సైతం కాళ్ల దగ్గరికి రప్పించుకునేవాడు.. పైన ఉన్న వారిలో ఈ పాటికే మీ జీవితంలో ఎవడో ఒకడు మీకు తగిలే ఉంటాడు. సో అలాంటి వారందరికీ ఈ ఆదివారం స్నేహితుల దినోత్సవం చెప్పేయండి...
మరి కొద్ది క్షణాల్లో స్నేహితుల దినోత్సవం రాబోతోంది. ఈరోజున చిన్ననాటి స్నేహితులు, స్కూల్ ఫ్రెండ్స్, చెడ్డి దోస్తులు, కాలేజ్ ఫ్రెండ్స్, ఆఫీసుల్లోని స్నేహితులు ఇలా అందరూ పలుచోట్ల కలిసి పార్టీలను చేసుకుంటారు.
కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఇది సాధమయ్యే పరిస్థితులు దాదాపు కనబడటం కావడం లేదు. కాబట్టి మీ జాన్ జిగిరి దోస్తులందరికీ వాట్సాప్ స్టేటస్, ఫేస్ బుక్ లో మెసెజెస్ ను పంపేయండి... అయితే ఏది పంపాలో అని అయోమయంలో ఉన్నారా? అయితే కింద ఉన్న కోట్స్ లో మీకు నచ్చిన వాటికి సెలెక్ట్ చేసుకోండి... మీ ప్రియమైన స్నేహితుడికి మీరెంత ముఖ్యమో గుర్తు చేయండి...

నిజమైన స్నేహం..
‘‘నిజమైన స్నేహం ఆత్మను రిఫ్రెష్ చేస్తుంది''

చెరగని ముద్రను వేసుకునేవాడే..
‘‘మన జీవితంలోకి చాలా మంది వస్తుంటారు.. వెళ్తుంటారు.. కానీ నిజమైన స్నేహితులు మాత్రం మన జీవితంలో ఉండిపోతారు.. అంతేకాదు వారు ఒక చెరగని ముద్రను సైతం వేసుకుంటారు''

స్నేహితులు లేని జీవితం..
‘‘స్నేహితులు లేని జీవితం ఎడారి లాంటిది''

స్నేహం కంటే విలువైనది..
‘‘నిజమైన స్నేహం కంటే ఈ భూమిపై విలువైనది ఏదీ లేదు''

అవి అవసరం లేదు..
‘‘బలమైన స్నేహానికి రోజువారీ ముచ్చట్లు అవసరం లేదు. వారి మధ్య రిలేషన్ ఎల్లప్పుడూ కలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు''

మిమ్మల్ని అర్థం చేసుకునేవాడే..
‘‘స్నేహితుడు అంటే మీ గతాన్ని అర్థం చేసుకుని, మీ భవిష్యత్తును విశ్వసించే మరియు మిమ్మల్ని మీరు అంగీకరించే వ్యక్తి''

మీ బలం గురించి మాట్లాడేవాడే..
‘‘నిజమైన స్నేహితుడు మీ బలహీనత తెలిసిన వ్యక్తి. కానీ తను అది చెప్పకుండా మీ బలం గురించే మాట్లాడతాడు''

నేస్తమే మిన్న..
‘‘మనిషి కన్నా మనసు మిన్న, ఆవేశం కన్నా ఆలోచన మిన్న..
ప్రాణం కన్నా త్యాగం మిన్న.. కానీ అన్నింటికన్నా ఎల్లప్పుడూ ఉండే నేస్తం మిన్న''

దేవుడిచ్చిన వరం..
‘‘చిరునవ్వు లాంటి నీ చెలిమి నాకు దేవుడిచ్చిన వరం..
స్వార్థం లేనిది నీ స్నేహం..
నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తూ..
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు''

మనసులో నిలిచిపోతారు..
‘‘పరిచయం అందరూ అవుతారు.. కానీ కొందరే కలకాలం మనసులో నిలిచిపోతారు.. వారే నిజమైన స్నేహితులు''

స్నేహం నీడలాంటిది..
‘‘ప్రేమ అనేది ఒక కల..
పెళ్లి అనేది ఒక వల..
స్నేహం అనేది మాత్రం ఒక నీడ..
కల చెదిరిపోవచ్చు.. వల తెగిపోవచ్చు..
కానీ నీడ మాత్రం నిన్ను వీడిపోదు..
ఇదే స్నేహం యొక్క గొప్పతనం..

నీవు ఎదగాలని కోరుకునేవాడు..
‘‘నిన్ను నిజంగా ఇష్టపడేవాడు ఎలాంటి స్థితిలోనైనా
నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కూడా
నీతో ఉండేవాడు.. నీవు నిజంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడు నిజమైన స్నేహితుడు''

మనసును తాకే పరిచయం..
‘‘ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా మొదలైనా మొదటి పరిచయం మనసుని తాకితే అదే ‘‘స్నేహం''