Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Happy Guru Purnima 2022 Wishes:గురు పూర్ణిమ విషెస్ ను మిత్రులకు, బంధువులతో షేర్ చేసుకోండిలా...
మీ గురువులకు గురుపూర్ణిమ విషెస్ ను షేర్ చేయండిలా..
భారతీయుల సంప్రదాయాలలో గురువుకు అత్యున్నత స్థానం ఇవ్వబడింది. హిందూ క్యాలెండర్ ప్రకారం, గురు పూర్ణిమను ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలోని శుక్ల పౌర్ణమి రోజున జరుపుకుంటారు.

ఈరోజు గురువులకు అంకితం చేయబడింది. వ్యాస మహర్షి ఈ పవిత్రమైన రోజునే పుట్టాడని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈరోజున గురువు ఆరాధనకు ప్రత్యేకమైనదిగా భావిస్తారు.

తమ జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యతను మరియు సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేమని.. గురువునే తాము దైవంగా భావిస్తుంటారు. గురువు ఇచ్చిన జ్ణానం వల్లే మానవ జీవితంలో విజయానికి నిచ్చెన అవుతుందని పెద్దలు చెబుతారు.

ప్రతి ఒక్క గురువు తమ శిష్యులకు ముందుకు వెళ్లే మార్గాన్ని చూపుతాడు. అంతేకాదు విద్యార్థులు విజయం సాధిస్తే.. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సంతోషిస్తాడు. అందుకే విద్యను ప్రసాదించే గురువుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండటం అనేది శిష్యుల కర్తవ్యం. శ్రీ మహా విష్ణువు అవతారంగా చెప్పే వ్యాసుడి పేరు క్రిష్ణద్వైపాయనుడు. పూర్ణిమ రోజున వ్యాస భగవానుడిని, గురువు పూజించడం అనేది విధిగా చేయాలని పెద్దలు చెబుతుంటారు. ఈ సందర్భంగా గురు పూర్ణిమ రోజున మీ గురువులకు, మిత్రులకు, కుటుంబసభ్యులకు ఇలా విషెస్ చెప్పండి.

గురువుకే తొలి ప్రాధాన్యత..
గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్తు పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

విష్ణు సహస్ర నామాల్లో
‘వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే..
నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ
నమో నమః' అంటూ విష్ణు సహస్ర నామాల్లో
వ్యాస మహర్షిని స్తుతించారు.

గురువును మించిన తత్వం
‘న గురోరధికం తత్వం న గురోరధికం తపః
తత్త్వజ్ణానత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః'
అంటే గురువును మించిన తత్వం, తపస్సు,
జ్ణానం వేరొకటి లేవు అని అర్థం.

అఖండ మండలా కారం
‘అఖండ మండలా కారం వ్యాప్తం
యేవ చరాచరమ్ తత్పదం దర్శితం
యేన తస్మై శ్రీ గురవే నమః'
అంటే ఈ భూమండలమంతా సంపూర్ణంగా వ్యాపించి ఉన్న భగవంతుడిని ఏ పదం దర్శింప జేస్తుందో అలాంటి తత్వాన్ని
బోధించే గురువులందరికీ శతకోటి వందనాలు

పరబ్రహ్మ స్వరూపులే!
భావి తరాలను తీర్చిదిద్దుతున్న గురువులంటే ఎవరో కాదు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులే!
ఆధ్యాత్మిక గురువుగా, భగవంతునిగా భక్తుల గుండెలలో కొలువైఉన్న షిరిడీ సాయిబాబా గురు పూర్ణిమ మహాత్యాన్ని తెలియజెప్పిన గొప్ప గురువు.



Click it and Unblock the Notifications