Latest Updates
-
యమ్మీ స్పైసీతో స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్.. ఈ ట్రిక్ పాటిస్తే అస్సలు విరిగిపోదు.! -
150 డిగ్రీల కోణంలో శని, బుధులు..సెప్టెంబర్ 1న షడాష్టక యోగంతో ఈ 4 రాశులకు అఖండ ఐశ్వర్యం! -
Sorakaya Payasam Recipe: పైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ సొరకాయ పాయసం..రుచిలో లేదు దీనికి సాటి.. -
పోషకాల గని.. వర్షాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిన చెట్టినాడ్ ఫ్రూట్ పాయసం.! -
Chicken Benefits: చికెన్ తింటే కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే! -
ప్రోటీన్స్ నిండిన రాజస్థానీ పంచరత్న దాల్..అమృతాన్ని తలపించే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
వ్యాధి ఒకటే అయినా స్త్రీ, పురుషుల్లో వేర్వేరు లక్షణాలు.. పోల్చుకుంటే ప్రాణ ముప్పు తప్పదు.! -
బ్యూటీ సీక్రెట్.. చుక్క నీరు, మినప్పప్పు లేకుండా నిమిషాల్లో చేసుకునే కీరదోస ఇడ్లీ.! -
సెప్టెంబర్ 2026 రాశి ఫలాలు: వీరి అదృష్టం మారబోతుంది.. 12 రాశుల ఫలితాలివే.! -
మైసూర్ స్టైల్ రసం రెసిపీ.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే గ్లాసులోనే లాగించేస్తారు.!
Independence Day 2022 : పంద్రాగస్టు విషెస్ చెప్పేయండిలా...
మీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండిలా...
'నా ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా..' 'మేరా భారత్ మహాన్..' 'నా జన్మభూమి గొప్పది' అనే మాటలు వింటూటే మన దేశంలో నివసించే ప్రతి ఒక్కరి నరనరాల్లో దేశభక్తి ఇట్టే ఉప్పొంగుతుంది. మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ సగర్వంగా మనకు ఉన్న స్వేచ్ఛ స్వాతంత్య్రాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

ఎన్నో ఏళ్ల పాటు ఆంగ్లేయుల బానిస సంకెళ్లలో నలిగిపోయిన భారతావనిని వారి కబంధ హస్తాల నుండి విడిపించి స్వాతంత్య్రం దిశగా నడిపించేందుకు ఎందరో గొప్ప నాయకులు శ్రమ, త్యాగఫలితాలే కారణమని మనందరికీ తెలుసు.

అందుకే స్వాతంత్య్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఆరోజున మనలో చాలా మంది పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటాం. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో పంద్రాగస్టు (స్వాతంత్య్ర దినోత్సవం) పండగ వచ్చేస్తోంది. ఈ సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులకు షేర్ చేసే శుభాకాంక్షలతో పాటు మన దేశ నాయకులు చెప్పిన కొన్ని స్ఫూర్తివంతమైన సూక్తులను మరియు సందేశాలను ఓసారి గుర్తు చేసుకుంటూ మన దేశ గొప్పదనాన్ని అందరితోనూ షేర్ చేసుకుందామా. అయితే ఆల్యమెందుకు కింద ఉన్న జాబితాలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి... మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులతో షేర్ చేసుకోండి...

మన స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మర్తించుకుంటూ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..

''ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని''
అందరికీ హ్యాపీ ఇండి పెండెన్స్ డే...

''తల్లీ భారతి వందనం.. నీ ఇల్లే నందనం.. మేమంతా మీ పిల్లలం.. నీ చల్లని ఒడిలో మల్లెలం''
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..

- బానిస బతుకులకు విముక్తి పలుకుతూ.. అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏటా జరుపుకునే పండుగ స్వాతంత్య్ర దినోత్సవం.

నేను భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. సదా నేను భరతమాతకు రుణపడి ఉంటాను.. వందేమాతరం.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

''మా స్వాతంత్య్ర సమరయోధుల జీవితం.. శాశ్వతం మా మువ్వన్నెల పతాకం.. చరితార్థం.. మా భారతవని భవితవ్యం..
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

మహాత్మగాంధీ కలలు గన్న స్వరాజ్యం కోసం పాటుపడదాం... నెహ్రుజీ నేర్పిన మానవతా విలువలను పాటిద్దాం నిరంతరం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..

భరతభూమి కోసం ధన, మాన, ప్రాణ త్యాగాలు చేసిన వారెందరో గొప్ప మహానుభావులు.. వారందరికీ వందనాలు

''దేశభక్తి అంటే జేబుకి జెండా అతికించుకోవడం కాదు.. మన దేశభక్తిని చూసి జేబు వెనకాల ఉన్న గుండె కూడా లబ్ డబ్ అని కాకుండా.. భారత్ మాతాకి జై అని కొట్టుకోవాలి''

''దేశభక్తి గుండెల్లో ఉండాలి.. చేతినిండా జెండాలతో కాదు.. నేలపై పడ్డ జెండా కింద పడి నలగకుండా గుండెలకు హత్తుకోవడంలో ఉంటుందని నిజమైన దేశభక్తి''



Click it and Unblock the Notifications