For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Maha Shivratri 2024 : శివుని అనుగ్రహం పొందేలా మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి విషెస్ చెప్పేయండి...

|

Happy Maha Shivaratri 2024 Wishes Quotes Greetings in Telugu: హిందువులందరూ జరుపుకునే ప్రధానమైన పండుగల్లో మహా శివరాత్రి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని బహుళ చతుర్దశి నాడు చంద్రుని శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడు అయిన సమయంలో మహా శివరాత్రి పండుగ వస్తుందని పండితులు చెబుతారు.

maha shivratri

శివ పురాణం ప్రకారం, ఆ లోకనాథుడు ఈరోజే లింగ ఆకారంలో ఉద్భవించడాని కూడా చెబుతారు. సర్వేశ్వరుడిగా.. విశ్వేశ్వరుడిగా.. అర్థనాథీశ్వరుడిగా కీర్తించబడే పరమాత్మయే ఈశ్వరుడు.

maha shivratr

కరోనా వంటి కష్టకాలంలో మహా శివరాత్రిని పండుగను పురస్కరించుకుని మీ స్నేహితులు, బంధువులు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించాలని.. వారి జీవితం సుఖ సంతోషాలతో నిండాలని.. ఎల్లప్పుడూ అందరికీ మేలు కలగాలని.. ఇందుకు ఆ ఈశ్వరుడి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఈ మెసెజెస్, కోట్స్, ఇమెజెస్, ఫేస్ బుక్, వాట్సాప్ స్టేటస్ తో విషెస్ చెప్పేయండి...

Mahashivratri :శివరాత్రి వేళ శివునికి నైవేద్యంగా పెట్టకూడని వస్తువులేంటో తెలుసా...Mahashivratri :శివరాత్రి వేళ శివునికి నైవేద్యంగా పెట్టకూడని వస్తువులేంటో తెలుసా...

శంబో శంకర..

శంబో శంకర..

హర హర మహదేవ శంబో శంకర..

ఇహపరముల నేలే జయ జగదీశ్వర..

కోరిన వారి కోరికలన్నీ తీర్చేటి

ఈశ్వరుడి చల్లని దీవెనలు ఎల్లవేళలా మీకు అందాలని కోరుకుంటూ మీకు మీ బంధుమిత్రులందరికీ

మహా శివరాత్రి శుభాకాంక్షలు..

‘‘శివుని గొప్ప రాత్రి''

‘‘శివుని గొప్ప రాత్రి''

శివుని పేరు జపించడం ద్వారా

శివరాత్రి అంతా గడపండి.

ఆ దేవ దేవుని ఆశీర్వాదం పొందండి. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

శివం శివం..

శివం శివం..

‘‘ఓం మహా ప్రాణ దీపం శివం శివం..

మహోంకార రూపం... శివం శివం..

మహా సూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం

మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం..

మహా కాంతి బీజం.. మహా దివ్య తేజం..

భవాని సమేతం భజే మంజునాథం'' స్వామి యొక్క ఆశీస్సులు

మీకు మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు...

Maha Shivratri 2021:శివరాత్రి గురించి పార్వతీదేవికి శివుడు చెప్పిన కథ గురించి తెలుసా...Maha Shivratri 2021:శివరాత్రి గురించి పార్వతీదేవికి శివుడు చెప్పిన కథ గురించి తెలుసా...

మహా తపస్వి..

మహా తపస్వి..

శివుడు మహా తపస్వి.

లోక క్షేమం కోసం చేసే తపస్సు అది.

ఏ మంచి పని అయినా దీక్షతో

ఓ తపస్సులా ఆచరించాలని,

దేనికీ చలించరాదని ఈ శివతత్వం బోధిస్తోంది.

మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.

శివ శబ్దం..

శివ శబ్దం..

‘శివ' శబ్దం మంగళాత్మకం. అందుకే ‘శివుడు' అనే పేరు ఎన్నో శుభాల్ని సూచిస్తుంది. శుభాలన్నీ గుణాలే! అనేకమైన గుణాలకు నిలువెత్తు నిదర్శనం మహా శివుడు. అందుకే ఆయనను లోకమంతా ఆరాధిస్తుంది. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

ఓ జంగమా..

ఓ జంగమా..

‘‘ఓ జంగమా.. ఓ లింగమా.. పక్కనే పార్వతమ్మా.. తలపై గంగమ్మ.. మెడలో సర్పమా.. బూడిద దేహమా.. సిగలో చందమామ.. స్రుష్టినే స్రుష్టించగల దైవమా.. మాఘ మాసంలో మళ్లీ పుట్టిన పరమాత్ముని ఆశీస్సులతో మీరు ప్రతి విషయంలోనూ విజయం సాధించాలని కోరుకుంటూ... మీకు మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

శివుని ఆశీస్సులు..

శివుని ఆశీస్సులు..

శివుని అనంత గుణాలలో త్రినేత్రత్వం ఒకటి.

సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేవి శివుని మూడు కళ్లు.

అలా మూడింటిని కలిగి ఉండటం అనేది శివుని ప్రత్యేకత. అంతటి సర్వశక్తిమంతుడైన శివుని ఆశీస్సులు..

మీకు.. మీ కుటుంబ సభ్యులకు నిత్యం ఉండాలని

కోరుకుంటూ..

హ్యాపీ మహా శివరాత్రి

ఆయనే సర్వేశ్వరం..

ఆయనే సర్వేశ్వరం..

ఏమీ అర్థం కాని వారికి పూర్ణ లింగేశ్వరం..

అంతో ఇంతో తెలిసిన వారికి అర్ధనాదీశ్వరం..

శరణాగతి అన్న వారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం..

మీకు మీ కుటుంబసభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

తనలో సగభాగాన్ని..

తనలో సగభాగాన్ని..

శివుడు తన సగ భాగాన్ని భార్య పార్వతీ దేవికి ఇచ్చి అర్ధనారేశ్వరుడిగా మారిపోయాడు. ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్థాంగాన్ని సమర్పించి ప్రేమ పంచాలన్నదే ఇందులోని భావం.. ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకంక్షలు..

శివపార్వతుల కళ్యాణం..

శివపార్వతుల కళ్యాణం..

ఈ శివరాత్రి పండుగ శివుడు మరియు పార్వతీదేవి పెళ్లి రోజును సూచిస్తుంది.. ఈ మహా శివ రాత్రి మీ బంధుమిత్రులందరికీ ఎంతో సంతోషం తీసుకురావాలని కోరుకుంటూ హ్యాపీ మహా శివరాత్రి

నంది అంటే..

నంది అంటే..

శివుడికి నంది వాహనుడు. ‘నంది' అంటే ఆనందింపజేసేది. వాహనం ఆనందాన్ని కలిగించాలని, జీవన యాత్రను సుఖవంతం చేయాలని సూచిస్తోంది ఆ నంది. మీ జీవితం కూడా అలాగే ఆనందమయంగా గడవాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ మహా శివరాత్రి...

జటాధరాయ..

జటాధరాయ..

చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ

ఫాలేక్షణాయ మణికుండల మండితాయ

మంజీరపాదయుగళాయ జటాధరాయ

దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు

FAQ's
  • 2022 సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఎప్పుడొచ్చింది?

    ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని బహుళ చతుర్దశి నాడు చంద్రుని శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడు అయిన సమయంలో మహా శివరాత్రి పండుగ వస్తుందని పండితులు చెబుతారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 2022 సంవత్సరంలో మార్చి 1వ తేదీన అంటే మంగళవారం రోజున మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శివ భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు. కచ్చితంగా ఉపవాస దీక్షను పాటించి, జాగరణ చేస్తారు.

English summary

Happy Maha Shivratri 2024: Shivratri Wishes, Messages, Images, Quotes, Greetings, Facebook & Whatsapp status in Telugu

Here we are talking about the Happy Maha Shivratri 2023: Wishes, Messages, Images, Quotes, Facebook & Whatsapp status in Telugu. Read on,
Desktop Bottom Promotion