For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Rama Navami 2023 Wishes : అందరికంటే ముందుగా బంధుమిత్రులకు శ్రీరామ నవమి విషెస్ చెప్పండిలా...

|

2023 సంవత్సరంలో అప్పుడే ఉగాది పండుగ వెళ్లిపోయింది. ఛైత్ర మాసం ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో శ్రీరామ నవమి పండుగ కూడా రాబోతోంది. అది కూడా మార్చి నెల 30వ తేదీన దేశవ్యాప్తంగా చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీసీతారాముల వారి కళ్యాణం జరగబోతోంది.

Happy Ram Navami 2023 Wishes, Images, Quotes, Messages, Wallpapers, Greetings, Whatsapp Status in Telugu

ఈ పవిత్రమైన రోజున రామ నామంతో దేశమంతా మార్మోగిపోతుంది. ఈ పదాన్ని ఉచ్చరించేటప్పుడు 'రా' అనగానే మన నోరు తెరచుకుని లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయి.

Happy Ram Navami 2021: Wishes, Messages, Quotes, Images, Facebook & Whatsapp status in Telugu

అదే సమయంలో 'మ' అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుని పోతాయి. దీనర్థం బయట మనకు కనిపించే లోపాలు లోపలికి ప్రవేశించలేవు. అందువల్లే మానవులకు 'రామ నామ స్మరణ' మిక్కిలి జ్ణానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది, ఇంతటి విశిష్టత కలిగిన నవమి రోజున మీ బంధువులకు, స్నేహితులకు ఇలా విషెస్ చెప్పండి.

<strong>Ram Navami 2021: శ్రీరాముని పట్టాభిషేకం ఎలా జరిగిందో తెలుసా...</strong>Ram Navami 2021: శ్రీరాముని పట్టాభిషేకం ఎలా జరిగిందో తెలుసా...

మీ జంట లోకానికి ఆదర్శం..

మీ జంట లోకానికి ఆదర్శం..

‘రామ ఓ రామ..

నీలి మేఘ శ్యామా..

నీ సుగుణాలు వివరించ రామ..

నీ కళ్యాణం చూస్తే మా కన్నులకు పరవశమే..

మీ జంట లోకానికి ఆదర్శం..

శ్రీ సీతారాములోరి కరుణ, కటాక్షలు అనునిత్యం ఉండాలని కోరుకుంటూ'

మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

రామ బాణం..

రామ బాణం..

‘ఒకే బాణం.. ఒకే మాట..

ఒకే భార్య.. ఒకటే రాజ్యం..

వంటి గొప్ప లక్షణాలున్నదే రామాయణం..'

మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

రామాయ రామ..

రామాయ రామ..

‘రామాయ రామ భద్రాయ రామ..

చంద్రాయ వేధసే..

రఘునాథాయ.. నాథాయ సీతాయ..

పత్తాయే నమః

భద్రశైల రాజమందిరా.. శ్రీరామ చంద్రా..'

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Rama Navami 2021 : రాముడిని మెప్పించే మంత్రాలను జపిస్తే కలిగే శుభాలెన్నో తెలుసా...!Rama Navami 2021 : రాముడిని మెప్పించే మంత్రాలను జపిస్తే కలిగే శుభాలెన్నో తెలుసా...!

తల్లివి నీవే.. తండ్రివి నీవే..

తల్లివి నీవే.. తండ్రివి నీవే..

‘‘కోదండ రామా.. కోదండ రామా..

కోదండ రాంపాహి.. కోదండ రామా..

నీదండ నాకు నీవెందుబోకు..

వాదేల నీకు వద్దుపరాకు..

తల్లివి నీవే.. తండ్రివి నీవే..

దాతవు నీవే.. దైవము నీవే..''

మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

జయరామ

జయరామ

‘శ్రీరామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!'

‘శ్రీ రామ జయరామ జయ జయ రామ!

ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీ రామం భుయో భుయో నమామ్యహం!'

మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

అంతా రామయమం..

అంతా రామయమం..

‘అంతా రామయమం..

ఈ జగమంతా రామమయం..

అంతరంగమున ఆత్మారాముడు..

అనంతరూపముల వింతలు సలుపగ..

సోమ సూర్యులును సురలు తారలును..

ఆ మహాంబుధులు అవనీజంబులు

అంతా రామమయం'

మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

అందరికీ ఆదర్శం..

అందరికీ ఆదర్శం..

అందరికీ ఆదర్శం..

సీతారాముల జీవితం..

నిత్యం వారి స్మరణం..

వారి దారిలో నడిచేందుకు కావాలందరూ సిద్ధం..

మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

సుఖ సంతోషాలతో..

సుఖ సంతోషాలతో..

శ్రీరామ నవమి రోజుతో పాటు

ప్రతిరోజూ మీ ఇంట్లో అందరూ

సుఖ సంతోషాలతో.. ఆయురారోగ్యాలతో

జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

రామునికి వందనం..

రామునికి వందనం..

‘అయోధ్య రామునికి వందనం..

ఏకపత్నీవ్రతునికి అభివందనం..

అందాల దేవునికి మదే మందిరం..

పాప విదూరునికి జయ వందనం..'

అంతటి గొప్ప రాముని ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ లభించాలని కోరుకుంటూ

అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి

నీ నామమెంతో రుచిరా..

నీ నామమెంతో రుచిరా..

‘శ్రీరామ నీనామమెంతో రుచిరా..

సదాశివుడు నిను సదా భజించెడి..

సదానంద నీనామమేమి రుచిరా..

అరయ భద్రాచల శ్రీరామదాసుని..

ఏలిన నీనామమేమి రుచిరా..

శ్రీరామ ఓ రామ.. నీనామమెంతో రుచిరా..'

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు..

FAQ's
  • 2022లో శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది?

    హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవవత్సరం ఛైత్ర మాసంలో ఉగాది పండుగ తర్వాత సరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత శ్రీరామ నవమిని జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదీన ఆదివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో సీతారాములోరి కళ్యాణం జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం, కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీసీతారాముల కళ్యాాణ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

English summary

Happy Ram Navami 2023 Wishes, Images, Quotes, Messages, Wallpapers, Greetings, Whatsapp Status in Telugu

Here are the Happy Ram Navami 2023: Wishes, messages, quotes, images, facebook and whatsapp status in Telugu. Share it
Desktop Bottom Promotion