For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులొస్తాయని తెలుసా...

గాడిద పాలు ప్రపంచంలో చాలా ఫేమస్ అని తెలుసా.. అంతేకాదు వాటితో అనేక ప్రయోజనాలున్నాయట.

|

ఇది వినడానికి వింతగా ఉన్నప్పటికీ పచ్చి నిజం. మనం నిత్యం వాడే సౌందర్య ఉత్పత్తులలో కచ్చితంగా గాడిద పాలను ఉపయోగిస్తారట. ఆశ్చర్యంగా ఉంది కదా..

Have You Ever Heard About Donkey Milk Soap

ప్రపంచంలో గాడిద పాలతో తయారయ్యే సబ్బులు, సౌందర్య ఉత్పత్తులకు బాగా డిమాండ్ ఉందట. దీన్ని గమనించిన కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి తన జాబ్ ను సైతం వదిలేసి, గాడిదల ఫామ్(Karntaka Donkey Farm) ను ప్రారంభించాడు. దీంతో దానికి విపరీతంగా డిమాండ్ పెరిగిపోతయింది. మొదట్లోనే తనకు సుమారు 17 లక్షల రూపాయల ఆర్డర్ వచ్చిందట.

Have You Ever Heard About Donkey Milk Soap

ఎందుకంటే ఒక లీటర్ గాడిద పాల ధర సుమారు వేల రూపాయలలో పలుకుతోంది. కొన్ని నివేదికల ప్రకారం, ఢిల్లీకి చెందిన స్టార్టప్ కంపెనీ 'ఆర్గానికో' వారు తయారు చేసిన సబ్బులు సూపర్ హిట్ కావడంతో ఆకస్మికంగా వీటికి మంచి డిమాండ్ పెరిగింది. గతంలో చండీ గఢ్ లోని 'విమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్'లో గాడిద పాలతో తయారు చేసిన సబ్బులను ప్రదర్శనకు సైతం ఉంచారు. ఈ సందర్భంగా గాడిద పాలతో తయారైన సబ్బులతో కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గాడిద పాలతో సబ్బులు..
'ఆర్గానికో' వ్యవస్థాపకురాలు పూజా కౌల్, గాడిద పాల గురించి కొన్ని వివరాలను వెల్లడించారు. వీటిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయని, ఇందులో చర్మ పోషణ భాగాలు మరియు వైద్యం చేసే లక్షణాలు కూడా ఉన్నాయని ఆమె వివరించారు.

Have You Ever Heard About Donkey Milk Soap

సౌందర్య ప్రయోజనాలు..
గాడిద పాలతో సౌందర్యం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటిలో యాంటీ బాక్టీరియల్ భాగాలు ఉన్నాయని నమ్ముతారు. ఇది మొటిమలు, చర్మ ఇన్ఫెక్షన్ మరియు తామరతో పోరాడటానికి సహాయపడుతుంది. అంతేకాదండోయ్ ఇది లైంగిక జీవితాన్ని సైతం మెరుగుపరుస్తుందని కొందరు నమ్ముతారు. ఆస్తమా, ఆర్థరైటిస్, మధుమేహం మరియు అనేక ఇతర వ్యాధుల లక్షణాలను కూడా ఇది తగ్గిస్తుంది.

ఒక లీటరు పాల ధర..
నివేదికల ప్రకారం, ఈ సబ్బులకు డిమాండ్ భారతదేశంలోని తమిళనాడు మరియు కర్నాటక వంటి దక్షిణాది రాష్ట్రాలలో గరిష్టంగా ఉంది. ఈ ప్రదేశాల స్థానికులు గాడిద పాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో వారికి బాగా తెలుసు. భారతదేశంలో ఒక లీటర్ గాడిద పాల ధర సుమారు రూ.1000 వరకు పలుకుతోంది. కానీ ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో అది కాస్త రూ.5 వేల వరకు చేరింది. మహారాష్ట్రలో అయితే ఏకంగా పది వేల రూపాయల వరకు పెరిగినట్లు సమాచారం.

English summary

Have You Ever Heard About Donkey Milk Soap

Did you know that donkey milk soaps are the latest trend in the beauty world? The benefits and the cost of these soaps will leave you baffled. Check out the details
Story first published:Tuesday, June 14, 2022, 9:00 [IST]
Desktop Bottom Promotion