Latest Updates
-
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి?
హోలీ 2020 : మీ రాశి చక్రాన్ని బట్టి హోలీకి కావాల్సిన రంగులను ఎంచుకోండి...
ఈ పండుగ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ రాశి చక్రాన్ని బట్టి మీరు రంగును ఉపయోగిస్తే మీకు కచ్చితంగా ఉత్సాహం మరియుశక్తి వంటివి లభిస్తాయి.
హోలీ అంటేనే రంగులు.. హోలీ పండుగ సమయంలో వినియోగించే ప్రతి రంగూ వెనుక ఓ పరమార్థం ఉంటుంది. ఒకప్పుడు హోలీ పండుగ వేళ గులాల్ ను ఎక్కువగా వినియోగించేవారు.గులాల్ అంటే ఎరుపు(రెడ్). ఇది శక్తి, ఉత్సాహం, కోరిక, ముఖ్యంగా పవిత్రతకు నిదర్శనంగా ఉండేది. హిందూ సంప్రదాయాలలో కూడా ఎరుపు రంగుకు ఓ ప్రత్యేకత ఉంది. నీలి రంగునేమో శ్రీక్రిష్ణ పరమాత్ముడి ప్రతిరూపంగా భావిస్తారు.

అంతేకాదు మన తెలుగు పండుగలను పరిశీలిస్తే ప్రజల మధ్య సమైక్యతను.. సఖ్యతను పెంపొందిచే ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఉగాది.. దసరా.. దీపావళి, సంక్రాంతి వంటి పండుగల విషయానికి వస్తే, ఇవి ఎవరి కుటుంబం పరిధిలో వారు జరుపుకుంటూ ఉంటారు. అయితే ఒక్క 'హోలీ' పండుగ మాత్రం వాటికి పూర్తి భిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పండుగను ఇళ్లలో కాకుండా వీధిలో రంగులతో సందడి చేయడం, అన్ని వయసుల వారిని కలుపుకుంటూ ఆటపాటలతో అలరించడం ఈ హోలీ ప్రత్యేకత.

ఈ పండుగ పట్టణాలు, నగరాల్లో విహరిస్తున్నప్పటికీ, ఇది పల్లెటూళ్లలో పరుగులు తీస్తున్నప్పుడు కలిగే అనుభూతి వేరుగా ఉంటుంది. 'వసంత పంచమి' నుండి 'పున్నమి' వరకూ వసంతోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆ పండుగ రోజున అమ్మాయిలు.. అబ్బాయిలు కోలాటాలతోను...

పిల్లలు కప్పల పెళ్లిళ్లు చేస్తూ జానపద పాటలు పాడుతూ సందడి చేస్తారు. చతుర్దశి రోజున రాత్రి వేళలో ఆయా సర్కిళ్లలో 'కామ దహనం' చేస్తారు. ఆ తర్వాతి రోజు ఉదయం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఘనంగా సంబరాలు జరుపుకుంటారు.

అలాంటి హోలీ పండుగ ఈ నెల మార్చి 10వ తేదీన జరుపుకోనున్నారు. హోలీ పండుగ సందర్భంగా, మీ రాశి చక్ర ప్రకారం మీరు ఎలాంటి రంగును ఉపయోగిస్తే, మీ జీవితంలో కచ్చితంగా ఉత్సాహం మరియు శక్తి ఉంటుంది...

మేషరాశి..
ఈ రాశి వారు ఈ ఏడాది ఎరుపు మరియు పసుపు రంగుతో హోలీని ఆడాలి.

వృషభ రాశి..
ఈ రాశి వారు ఈ ఏడాది ఆరెంజ్ మరియు పర్పుల్ కలర్లతో హోలీని జరుపుకోవాలి.

మిధున రాశి..
ఈ రాశి వారు ఈ ఏడాది గ్రీన్ మరియు పర్పుల్ రంగులను వాడితే మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు బ్లూ మరియు గ్రీన్ కలర్లతో హోలీ ఆడాలి. ఈ రెండు రంగుల వారు మీకు లక్కీగా ఉంటుంది.

సింహ రాశి..
ఈ రాశి వారు హోలీ రోజున గోల్డెన్ పసుపు మరియు ఆరెంజ్ కలర్లను వాడితే మీకు లక్కీగా ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారు హోలీ రోజున ఆరెంజ్ మరియు పర్పుల్ వాడాలి.

తుల రాశి..
ఈ రాశి వారు పింక్, కుంకుమ మరియు ఆరెంజ్ రంగులతో హోలీని ఆడాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు హోలీలో ఎరుపు, పసుపు మరియు గ్రీన్ కలర్ రంగులో హోలీని ఆడాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు పసుపు మరియు ఎరుపు రంగులు గ్రీన్ కలర్లతో హోలీని ఆడాలి.

మకర రాశి..
ఈ రాశి వారు హోలీలో రెడ్ అండ్ పింక్ రంగులను ఉపయోగించాలి. ఇది మీకు లక్కీగా ఉంటుంది.

కుంభ రాశి..
ఈ రాశి వారికి ఈ సంవత్సరం పింక్ మరియు రెడ్ కలర్లు లక్కీగా కలిసి వస్తాయి.

మీన రాశి..
ఈ రాశి చక్రం వారు గ్రీన్ మరియు ఆరెంజ్ కలర్లతో హోలీని ఆడాలి.



Click it and Unblock the Notifications
