For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోలీ 2023 : రంగుల పండుగ వచ్చేస్తోంది... ప్రతి ఒక్కరినీ రంగుల్లో ముంచేందుకు సిద్ధం కండి...

హోలీ పండుగ సమయంలో చాలా మంది అమ్మాయిలు ప్రతి ఒక్కరినీ రంగుల్లో ముంచేందుందుకు ఎంతో ఉత్సాహం చూపుతుంటారు.

|

హోలీ అంటే అందరూ కలిసి ఆనందంగా రంగులు చల్లుకోవడం... హోలీ రోజు చాలా మంది వీధుల్లోకి వచ్చి ఆడ, మగ అనే తేడా లేకుండా... చిన్న పిల్లాడి దగ్గర నుండి పెద్ద వారికి రేసు గుర్రంలా రెచ్చిపోయి రంగులు చల్లుకుంటారు. ఇంకా కొంత మంది కోడిగుడ్లను తలలపై పగులగొట్టడం వంటివి చేస్తుంటారు.

Holi 2020: Creative Holi Celebration Ideas

స్నేహితులు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లి వారిని తీసుకురావడం లేదా అంతా ఒక చోట హోలీ ఆడుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఇందులోనూ అంతా పరిపూర్ణంగా ఉండాలనుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. హోలీ పండుగకు ముందే ప్లాన్ చేయడం.. అందరూ కలవడంతో పాటు సహజ రంగులేవో.. నీరు బాగున్నాయా లేదా అన్నీ చేసుకుని మరీ రంగంలోకి దిగుతారు.

Holi 2020: Creative Holi Celebration Ideas

ఆ తర్వాత ఎలా పడితే అలా రంగులు పూసుకోవడం అనేది వారికి ఇష్టముండదు. ముఖ్యంగా జుట్టుపై, ముఖంపై రంగు పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలా హోలీ వేడుకల్లో ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో.. హోలీ వేడుకలను అందరి కంటే భిన్నంగా ఎలా జరుపుకుంటారో తెలుసుకునేందుకు ఈ స్టోరీని పూర్తిగా చూడండి...

వీధుల్లోకి రావడం మానేసి...

వీధుల్లోకి రావడం మానేసి...

అయితే ఇలాంటివి కొంతమందికి సరదాగా అనిపిస్తాయి. మరికొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తాయి. హోలీ వంటి పండుగలో సైతం మనకు వివిధ రకాలైన వ్యక్తులు కనిపిస్తారు. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోవడంతో చాలా మంది వీధుల్లోకి రావడం మానేసి కేవలం స్మార్ట్ ఫోన్ల నుండి స్టేటస్ లు పెట్టడం.. పోస్టులు చేసుకోవడంతో సరిపెట్టుకుంటున్నారు.

Image Curtosy

పోస్టులు చేసుకోవడంతో...

పోస్టులు చేసుకోవడంతో...

అందుకు రకరకాల హ్యాష్ ట్యాగులు జోడించి తాము ఎంతో ఆనందంగా వేడుక జరుపుకుంటున్నామని ఫోజులు కొడుతున్నారు. ఇలాంటి వారు హోలీ ఆడేది తక్కువ.. రంగుల ఫోటోలతో ఫోజులు కొట్టడం చాలా ఎక్కువ. ఇదంతా కేవలం లైకుల కోసమే.

Image Curtosy

తామిద్దరమే అనుభవించాలని...

తామిద్దరమే అనుభవించాలని...

ప్రేమికులు లేదా భార్యభర్తల మధ్య హోలీ సమయంలో వారి చుట్టూ ఎంతమంది ఉన్నా వారికి రంగు పూసేందుకు అస్సలు ఆసక్తి చూపరు. కేవలం తామిద్దరమే ఉన్నామనుకుని.. సినిమాలలో హీరో, హీరోయిన్లుగా ఊహించుకుంటూ ఉంటారు. అంతేకాదు ఆ ఆనందాన్ని తామిద్దరమే అనుభవించాలని భావిస్తుంటారు. వారి చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులను అస్సలు పట్టించుకోరు.

Image Curtosy

రంగుల రాణి..

రంగుల రాణి..

హోలీ పండుగ సమయంలో చాలా మంది అమ్మాయిలు ప్రతి ఒక్కరినీ రంగుల్లో ముంచేందుందుకు ఎంతో ఉత్సాహం చూపుతుంటారు. ఇలాంటి అమ్మాయిలంతా తమ వెంట ఒకటి రెండు రంగులను కాకుండా చాలా రంగులను అందుబాటులో ఉంచుకుని అందరినీ రంగుల్లో ముంచేందుకు ప్రయత్నిస్తారు.

వాటర్ హోలీ...

వాటర్ హోలీ...

మనలో చాలా మందికి హోలీ సమయంలో ఉపయోగించే రకరకాల రంగులు అంటే అస్సలు పడవు. కొంతమందికి రంగులంటే అలర్జీ ఉంటుంది. అందుకే అలాంటి వారు రంగులతో కాకుండా నీళ్లతో కలిసి రంగుల హోలీ ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఇలా కూడా రంగుల హోలీని ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. అలాగే రెయిన్ డ్యాన్స్, వాటర్ హోలీ వంటి వాటిలో పాల్గొనేందుకు తెగ ఉత్సాహం చూపుతారు.

ఎవ్వరికీ తెలియకుండా..

ఎవ్వరికీ తెలియకుండా..

హోలీ అంటే కొంతమంది ఇంటి నుండి అస్సలు బయటకు అడుగుపెట్టరు. అయితే స్నేహితులు లేదా బంధువులు మాత్రం అలాంటి వారిని అస్సలు వదిలిపెట్టరు. అలాంటి ఎలాగోలా బయటకు రప్పించి మరీ రంగులను చల్లుతారు.

గుడ్లు, టమోటాలు..

గుడ్లు, టమోటాలు..

హోలీ అంటే అతి కొద్ది మంది రంగులు మాత్రమే చల్లుకుంటారు. చాలా మంది కోడిగుడ్లు, టమోటాలు వంటివి కొట్టుకుంటారు. ఇలాంటివి కొట్టుకొని చాలా ఆనందపడుతుంటారు. ఇలాంటివి కొంతమందికి చిరాకుగా అనిపిస్తుంది. అయితే ఆనందంగా అనిపిస్తుంది.

రంగులు చల్లే ముందు..

రంగులు చల్లే ముందు..

రంగుల పండులో కేవలం టమోటోలైతే పర్వాలేదు కానీ, గుడ్డును తలపై కొట్టడం వల్ల ఆ సమయం అంతా దుర్వాసనతో చాలా ఇబ్బందులు పడాల్సిందే. వాసనతో పాటు గుడ్లను తల నుండి తొలగించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవే కాదు.. ఇంక్, పెయింట్, గ్రీస్ వంటి మరకలను తొలగించుకోవాలంటే అతి కష్టంగా ఉంటుంది. అందుకే ఈ రంగులు చల్లే ముందు ఎదుటి వారి పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి.

బట్టలు చించుకోవడం..

బట్టలు చించుకోవడం..

హోలీ అంటే రంగుల పండుగ. కాబట్టి, చాలా మంది ఈరోజు చాలా మంది ఎలాగో పాత బట్టలనే వేసుకుంటారు. అందుకే అలాంటి దుస్తులను చింపి చిందులు వేస్తుంటారు. అలా దుస్తులు చిందవందరగా చించుకుని రెయిన్ డ్యాన్స్ వంటివి చేస్తూ ఉంటారు.

ఉట్టి కొట్టడం..

ఉట్టి కొట్టడం..

హోలీ పండుగ రోజున అందరూ రంగులు చల్లుకున్న తర్వాత ఉట్టిని కొట్టడం వంటి పోటీలను ఏర్పాటు చేస్తారు. ఓ కుండలో రంగులను వేసి, అందులో కొంత డబ్బును ఉంచి, దానికి తాడు కడతారు. ఆ కుండను రెండు వైపులా నుండి వేలాడదీస్తూ ఎవరైతే ఆ ఉట్టిని పగులగొట్టేందుకు ప్రయత్నిస్తారో వారిపై రంగులు వేస్తుంటారు. అలా ఆనందంగా ఈ వేడుకను జరుపుకుంటారు.

మధుర క్షణాలు..

మధుర క్షణాలు..

మీరు ఈ స్టోరీ చదవగానే మీకు ఇలాంటి పరిస్థితులు ఇప్పటి ఎదురైనట్లు గుర్తుకొచ్చాయా? మీకు బాగా కావాల్సిన ఎవరైనా గుర్తొచ్చారా? అయితే వెంటనే వారితో ఈ స్టోరీని షేర్ చేసి మీ అద్భుతమైన అనుభూతులను పంచుకోండి...

English summary

Holi 2023: Creative Holi Celebration Ideas

Here we talking about creative holi celebration ideas. Take a look
Desktop Bottom Promotion