For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Holi 2021: హోలీని ఇలా కూడా జరుపుకుంటారా...! రంగులలో పేడ, మట్టిని కలిపి ఇంకా...!

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో వచ్చే చివరి పండుగ హోలీ. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు.

హిందూ పురాణాల ప్రకారం, హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ పండుగను హోలీకా పూర్ణిమ అని కూడా పిలుస్తారు.

ఇదే పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. అందుకే మన దేశంలో వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఏయే రాష్ట్రంలో ఏయే రకంగా హోలీ పండుగను జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం...

Holi 2021 : ఈ ఏడాది హోలీ ఎప్పుడొచ్చింది? ఈ పండుగ వెనుక ఉన్న రహస్యాలేంటో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. హోలీకా పౌర్ణమికి ముందు రోజు కాముని దహనం చేస్తారు. ఆ తర్వాతి రోజున రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ పండుగను జరుపుకుంటారు. ఇక నగరాల్లో ఉండే వారైతే.. ఓ చౌరస్తాలో మంచి మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేసి.. డ్రమ్ములలో రంగులు కలిపి ఆ ప్రాంతంలో వచ్చే వారందరిపై రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. మరికొన్ని చోట్ల కోడిగుడ్లను, టమోటలను కూడా విసురుకుంటారు. ఇంకొన్ని చోట్ల అటూ ఇటూ తాడు వేలాడదీసి మధ్యలో ఉట్టి పెడతారు. అందులో డబ్బులను, రంగులను ఉంచి దాన్ని పగులగొట్టాలని పోటీ పెడతారు. అలా ఉట్టి పగులగొట్టే సమయంలో వారిపై రంగులను చల్లుతారు.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో..

మన దేశ ఆర్థిక రాజధాని అయినా ముంబై నగరంతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా హోలీ వేడుకలను జరుపుకునేందుకు ఒక వారం ముందు నుండే సిద్ధమవుతారు. ముందుగా యువకులందరూ ఇంటింటికి తిరిగి పాత చెక్క సామాగ్రిని సేకరిస్తారు. అలా వారు ఉదయం వేసిన మంటలు సాయంత్రం వరకూ మండుతూనే ఉంటాయి. అంత ఎక్కువగా మంటలను వేస్తారు. ఈ మంటల్లో ప్రత్యేకంగా తయారు చేసిన మిఠాయిలను నైవేద్యంగా సమర్పిస్తారు.

గుజరాత్ లో..

గుజరాత్ లో..

గుజరాత్ రాష్ట్రంలో ఈ హోలీ పండుగను అందరూ అత్యంత ఆనందంగా జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలు వేసి, దాని చుట్టూ చేరి డ్యాన్సులు వేస్తూ.. పాటలు పాడుతూ ఈ పండుగ వేడుకలను జరుపుకుంటారు. అయితే ఈ మంటన్నీ ఒక పెద్ద మైదానం లాంటి ప్రదేశంలో సామూహికంగా చేరి వేస్తారు.

Holi colours meaning : హోలీ రంగుల యొక్క రహస్యాలేంటో తెలుసా...

యుపిలో..

యుపిలో..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురకు సమీపంలో ఉన్న బర్సన అనే ప్రాంతంలో హోలీ పండుగను వినూత్నంగా జరుపుకుంటారు. హోలీ సందర్భంగా అమ్మాయిలు అబ్బాయిలతో లాఠీలతో కొడతారంట. దీన్నే వారు లఠ్ మార్ హోలీ అని పిలుస్తారు. లఠ్ అంటే లాఠీ అని అర్థం. ఇలా ఎందుకు చేస్తారంటే.. పూర్వ కాలంలో చిన్ని క్రిష్ణుడు తనకెంతో ఇష్టమైన రాధ గ్రామానికి వచ్చి అక్కడ, ఆమెను, తన స్నేహితురాళ్లను ఆట పట్టించాడట. దీనిని తప్పుగా భావించిన వారు కర్రలతో క్రిష్ణయ్యను తరిమేశారంట. అప్పటి నుండి ఈ పండుగను ఇలా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏటా పక్కనే ఉన్న నంద్ గావ్ నుండి మగవారు హోలీ ఆడేందుకు ఈ గ్రామం రావడం, హుషారుగా హోలీ పాటలు పాడటం ఆడవారిని రెచ్చగొట్టి, వారి చేతిలో లాఠీ దెబ్బలు ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ దెబ్బలను మగవారు ఢాలు వంటి వాటిని ఉపయోగించి తప్పించుకోవచ్చు. అమ్మాయిలు వాటి మీదే ఎక్కువగా కొడతారు.

ఒడిశాలో..

ఒడిశాలో..

ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథుడి ఆలయంలో క్రిష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపించి ఆ తరువాత వేడుకలు ప్రారంభిస్తారు. గుజరాత్ లో ఈ పండుగను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయంగా భావించి, అందరూ మంటలు వేసి వాటి చుట్టూ చేరి డ్యాన్సులు చేస్తూ పాటలు పాడతారు.

కాశ్మీర్ లో..

కాశ్మీర్ లో..

జమ్మూ కాశ్మీర్ లో సైనికుల పహారా మధ్య, తుపాకుల చప్పళ్ళతో ఉద్రిక్తంగా ఉండే అందాల కాశ్మీరంలో సైనికులతో సహా అక్కడ నివసించే వారంతా హోలీ ఉత్సవాలలో ఆనందంగా పాల్గొంటారు. ఆటపాటలతో రంగు రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ వేడుకగా జరుపుకుంటారు.

మణిపూర్ లో..

మణిపూర్ లో..

మణిపూర్ రాష్ట్రంలో హోలీ సందర్భంగా ఓ ఆచారాన్ని పాటిస్తారు. ఈ ప్రాంతంలో హోలీ సమయంలో అమ్మాయిలకు అబ్బాయిలు డబ్బులు ఇస్తేనే వారిపై రంగులు చల్లుతారు. అక్కడ అందరూ కలిసి ఒక చోట చేరి మంటల చుట్టూ తిరిగి డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ దాదాపు వారం రోజుల పాటు హోలీ ఉత్సవాలను నిర్వహిస్తారు. చివరిరోజు క్రిష్ణుడి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు.

బెంగాల్ లో

బెంగాల్ లో

పశ్చిమ బెంగాల్ లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ముందుగా రాధా, క్రిష్ణ పూజలను జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్లు, టమోటలను వాడితే.. అక్కడ మాత్రం వారు చల్లుకునే రంగులలో ఆవు పేడను, మట్టిని కలిపి ఒకరిపై ఒకరు విసురుకుంటారు.

English summary

Holi 2021 : Holi celebrations different places in India

Here we are talking about the Holi 2021 : Holi celebrations different places in India. Have a look
Story first published: Saturday, March 20, 2021, 16:26 [IST]