For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Holi 2023 :ఈ ఏడాది ‘హోలీ’ ఎప్పుడొచ్చింది? రంగులతోనే ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

హోలీ 2023 తేదీ, చరిత్, ప్రాముఖ్యత మరియు హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

హోలీ.. రంగుల కేళి.. ఈ పండుగ వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా చిన్న పిల్లల నుండి పండు ముసలి వాళ్ల వరకు ఎంతో సంతోషంగా రంగులను చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకుంటారు.

Holi 2023 Date, History, Significance and why holi is celebrated in Telugu

స్త్రీ, పురుషుల భేదం ఏ మాత్రం లేకుండా, అన్ని వయసుల వారు సరదాగా పాల్గొని గడిపే ఈ పండుగ మరికొద్ది రోజుల్లో రానుంది. ఈ ఏడాది 2023 సంవత్సరంలో మార్చి 8,9వ తేదీల్లో అంటే బుధవారం, గురువారం నాడు రానుంది.

Holi 2023 Date, History, Significance and why holi is celebrated in Telugu

స్నేహాన్ని, బంధుత్వాన్ని మరింత దగ్గర చేసేందుకు హోలీ వంటి పండుగలు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. ఇదిలా ఉండగా.. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి రోజున హోలికా దహనం చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, రంగ్ ఉత్సవ్ హోలీని హోలికా దహన్ అంటారు. ఈ పండుగ సత్య యుగం నుండి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా హోలీ, కాముని పున్నమిని డోలికోత్సవం అని ఎందుకంటారు? ఈ పండుగను ఎందుకని రంగులు చల్లి జరుపుకుంటారనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Holi 2022:హోలీ కలర్స్ నుండి మీ స్కిన్ ను కాపాడుకోవాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...Holi 2022:హోలీ కలర్స్ నుండి మీ స్కిన్ ను కాపాడుకోవాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...

హోలీ శుభ ముహుర్తం..

హోలీ శుభ ముహుర్తం..

ఈ సంవత్సరం హోలికా దహనం మార్చి 8వ తేదీన బుధవారం నాడు జరుగుతుంది.

శుభ ముహుర్తం : మార్చి 8వ తేదీ ఉదయం 9:20 నుండి రాత్రి 10:31 గంటల వరకు

హోలికా దహన వ్యవధి సుమారు ఒక గంట 10 నిమిషాలు

హోలీ పండుగ 8వ తేదీన ప్రారంభమవుతుంది.

త్రిగ్రహ యోగం..

త్రిగ్రహ యోగం..

ఈ కాలంలో మకర రాశిలో త్రిగ్రహ సంయోగం ఏర్పడనుంది. శని, కుజుడు, శుక్రుడు మకరరాశిలో ఉంటారు. మరోవైపు కుంభరాశిలో గురుడు మరియు బుధుడి కలయిక జరగనుంది.

హోలీక దహనం..

హోలీక దహనం..

పురాణాల ప్రకారం, రాక్షస రాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు. తను నిత్యం శ్రీవిష్ణు స్మరణలో ఉంటాడు. అది హిరణ్యుడికి నచ్చదు. దీంతో తనను చంపేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం తన సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో కాల్చేయాలని కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చొబెట్టుకుని మంటల్లో దూకుతుంది. అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా, హోలికా రాక్షసి మాత్రం ఆ మంటల్లోనే చనిపోతుంది. అప్పటి నుండి హోలికా దహనమైన రోజునే ‘హోలీ' అని పిలుస్తారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట ‘హోలిక' దహనం నిర్వహిస్తారు.

Holi 2022: హోలీ పండుగ వేళ పొరపాటున కూడా వీటిని దానం చేయకూడదట...!Holi 2022: హోలీ పండుగ వేళ పొరపాటున కూడా వీటిని దానం చేయకూడదట...!

హోలికా దహన పద్ధతి..

హోలికా దహన పద్ధతి..

హోలీ పండుగ అంటేనే అందరిలోనూ అత్యుత్సాహం వచ్చేస్తోంది. హోలీ దహనం కోసం చాలా రోజులు ముందుగానే సన్నాహాలు ప్రారంభింస్తారు. హోలికా దహనం చేయాల్సిన ప్రదేశంలో ఎండిన కట్టెలు, ఆవు పేడ, ఇతర మండే వస్తువులను సేకరిస్తారు. ఆ తర్వాత హోలికా దహన్ రోజున శుభ సమయంలో, హోలికను పూర్తి ఆచారాలతో పూజించి నిప్పును వెలిగిస్తారు. ఆ మంటల చుట్టూ తిరుగుతూ పూజా సామాగ్రతిని హోలికలో వేస్తారు.

డోలికోత్సవం..

డోలికోత్సవం..

మరో కథనం ప్రకారం.. డోలోత్సవం లేదా డోలికోత్సవం రోజున శ్రీక్రిష్ణుడు గోపికలతో కలిసి బ్రుందావనంలో పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్టు భావిస్తారు. ఇలా రంగులు, పువ్వులు ఒకరిపై ఒకరు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు.

హోలీ ఎప్పటినుంచంటే..

హోలీ ఎప్పటినుంచంటే..

క్రుత యుగంలో సూర్య వంశానికి చెందిన రఘునాథుడు ఉండేవారు. తన దగ్గరికి ప్రజలందరూ ఒకసారి వెళ్లి.. ‘హోలిక' అనే రాక్షసి వల్ల తమకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పగా.. అప్పుడు అక్కడే ఉన్న నారదుడు.. ప్రతి ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజున హోలిక పూజలు చేస్తే మీ బాధల నుండి విముక్తి పొందుతారని చెబుతాడు. అయితే ఈ పూజలు పగటి పూట చేస్తే కష్టాలొస్తాయని.. రాత్రి పూట మాత్రమే చేయాలని చెప్పాడు. అప్పటి నుండి ప్రతి ఏటా రాత్రి వేళలో ‘హోలీ' పూజలు చేస్తున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

గమనిక : ఈ సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనికి BoldSky Teluguకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా సమాచారం మరియు ఊహలను పరిగణనలోకి తీసుకునే ముందు దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించండి.

FAQ's
  • 2022 సంవత్సరంలో హోలీ పండుగను ఎప్పుడు జరుపుకోనున్నారు?

    ఈ ఏడాది 2022 సంవత్సరంలో మార్చి 17, 18వ తేదీల్లో అంటే గురు, శుక్రవారం నాడు రానుంది. స్నేహాన్ని, బంధుత్వాన్ని మరింత దగ్గర చేసేందుకు హోలీ వంటి పండుగలు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. ఇదిలా ఉండగా.. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి రోజున హోలికా దహనం చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, రంగ్ ఉత్సవ్ హోలీని హోలికా దహన్ అంటారు. ఈ పండుగ సత్య యుగం నుండి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాల ద్వారా తెలుస్తోంది.

English summary

Holi 2023 Date, History, Significance and why holi is celebrated in Telugu

Here we are talking about the holi 2023 date, history, significance and why holi is celebrated in Telugu. Have a look
Desktop Bottom Promotion