Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Holi 2023: హోలీ రోజు ఆనందంగా గడపాలంటే ఇలా ఆడుకోండి.. అలాగే ఈ పనులు అస్సలే చేయొద్దు
హోలీ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే.. అయితే కొన్ని పనుల వల్ల ఆనందంగా ఉండాల్సిన హోలీ కాస్త బాధగా మారుతుంది.
హోలీ రాబోతుంది చాలా మంది ఇష్టంగా, ఉత్సాహంగా జరుపుకునే రంగుల పండగ హోలీ. మార్చి 8వ తేదీన హాలీ జరుపుకోబోతున్నాం. వివిధ రంగులతో జరుపుకునే ఈ పండగ తమ జీవితాన్ని కూడా రంగులమయం చేస్తుందని, చేయాలని కోరుకుంటారు. ఈ కలర్స్ ఫెస్టివల్ ఆనందోత్సాహాలతో, సంతోషంగా జరుపుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే ఆనందంగా సాగాల్సిన పండగ కాస్త బాధను మిగిల్చి వెళ్తుంది.

హోలీ పండగ ఆనందంగా, సంతోషంగా సాగాలంటే ఏమేం పనులు చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

సహజ రంగులతో హోలీ ఆడండి:
హోలీ సురక్షితంగా ఉండాలంటే సహజ రంగులే వాడాలి. సహజ రంగులు వాడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే జుట్టు కూడా దెబ్బతినకుండా ఉంటుంది. రసాయనాలతో తయారు చేసిన వాటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కంట్లో పడితే లేని పోని సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది.

హోలీ ఆడటానికి ముందు జుట్టుకు నూనె రాసుకోండి:
హోలీ రంగులు జుట్టును దెబ్బతీస్తాయి. అందుకే హోలీ ఆడటానికి ముందు జుట్టుకు నూనె రాసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రంగుల్లోని రసాయనాలు జుట్టుకు పట్టుకోకుండా, శోషించకుండా నూనె ఒక పొరలాగా అడ్డుకుంటుంది.

నీరు తాగాలి:
హోలీ అంటే పరిగెడుతూ, గెంతుతూ ఆడుకునే పండగ. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న సమయంలో హాలీ వస్తుంది. ఆటలో పడిపోయి చాలా మంది తగినంత నీరు తాగరు. హోలీ రోజు తగినంత నీరు తాగి హైడ్రేటెడ్ గా ఉండేందుకు ప్రయత్నించాలి.

రంగులు తొలగించడానికి నూనె వాడాలి:
చర్మంపై రంగులు అంటుకుపోతాయి. వాటిని తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. గాఢత ఎక్కువ సబ్బు వాడతారు. పీచు పెట్టి రాకుతుంటారు. మీ ముఖంపై, చర్మంపై రంగులను తొలగించడానికి కొబ్బరి లేదా బాదం నూనె వాడండి. చల్లని నీటితో రంగులను తొలగించాలి.

రంగు తొలగించడానికి కిరోసిన్ వాడొద్దు:
చాలా మంది చేసే తప్పు ఇది. హోలీ ఆడితే చర్మానికి రంగులు అంటుకుపోతాయి. వాటిని తొలగించడానికి చాలా మంది కిరోసిన్, పెట్రోల్, స్పిరిట్ వంటివి వాడతారు. దీని వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి.

వాటర్ బెలూన్లు విసరొద్దు:
చాలా మంది చిన్న చిన్న బెలూన్లలో కలర్ వాటర్ నింపి వాటితో హోలీ ఆడుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల దెబ్బలు తగిలే అవకాశం ఉంది. వాటర్ బెలూన్ల విసరొద్దు.

మురికి చేతులతో ఏమీ తినొద్దు:
హోలీ రోజు చేతులకు రంగులు అంటుకుంటాయి. చేతులు కడుక్కోకుండా ఏదైనా ఆహార పదార్థాలు తింటే, చేతికి అంటుకున్న రంగులు నోట్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
అలాగే హోలీ రోజు మెటాలిక్ రంగుల వాడకాన్ని పూర్తిగా నివారించాలి. కెమికల్ కలర్స్, పెయింట్స్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదని గుర్తించుకోవాలి. అలాగే హోలీ రోజు ఆల్కహాల్ వినియోగాన్ని పరిమితం చేయాలి. హోలీ రోజు ఉదయం జుట్టుకు, శరీరానికి కొబ్బరి నూనె రాసుకున్న తర్వాత హోలీ ఆడటం మంచిది. దీని వల్ల హోలీ రంగులు చర్మ రంధ్రాల్లోకి వెళ్లకుండా నూనె అడ్డుకుంటుంది.



Click it and Unblock the Notifications