Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Holi 2023: ఇక్కడ హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతాయి, ఉత్తరాదిన వేడుకలు అదిరిపోవాల్సిందే
హోలీని దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిలో చాలా ఘనంగా జరుపుకుంటారు. అక్కడ కూడా ఒక్కో రాష్ట్రంలో హోలీ వేడుకలు ఒక్కోలా ఉంటాయి. దేశంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో హోలీ వేడుకను ఎలా జరుపుకుంటారో చూద్దాం.
భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయం. దేశంలో పండగ సంబరాలను ఒక్కో చోట ఒక్కోలా జరుపుకుంటారు. కలర్స్ ఫెస్టివల్ హోలీని దేశంలో వివిధ ప్రాంతాల్లో చాలా విభిన్నంగా జరుపుకుంటారు. హోలీని దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిలో చాలా ఘనంగా జరుపుకుంటారు. అక్కడ కూడా ఒక్కో రాష్ట్రంలో హోలీ వేడుకలు ఒక్కోలా ఉంటాయి. దేశంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో హోలీ వేడుకను ఎలా జరుపుకుంటారో చూద్దాం.

1. మధుర, ఉత్తరప్రదేశ్
దేశవ్యాప్తంగా హోలీ అత్యంత వైభవంగా జరిగేది ఉత్తరప్రదేశ్ లోని మధురలో. శ్రీకృష్ణ జన్మస్థలం అయిన ఈ ప్రాంతాల్లో హోలీ సంబరాలు అంబరాన్నంటుతాయి. ఇక్కడ హోలీ రోజు విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ద్వారకాధీష్ ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, అంతా కలిసి హోలీ జరుపుకుంటారు. రంగులు చల్లుకుంటూ సంగీతానికి నృత్యం చేస్తూ జరుపుకుంటారు. హోలీని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మధురకు వెళ్లాల్సిందే. ఇక్కడ హోలీ 16 రోజుల పాటు జరుగుతుంది.
బర్సాన:
ఉత్తరప్రదేశ్ లోని బర్సానలోని హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచాయి. ఇక్కడ హోలీని లాల్ మార్ హోలీ అని పిలుస్తారు. ఇక్కడ హోలీ వేడుకలు విభిన్నంగా ఉంటాయి. స్త్రీలు పురుషులను కర్రలతో కొడతారు. రాధాకృష్ణా ఆలయంలో భక్తి పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలు చేస్తారు.
2. గుజరాత్
గుజరాత్ లో హోలీని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. మంటలు వేసి దాని చుట్టూ చేరి నృత్యాలు చేస్తారు. పాటలు పాడుతూ ఉల్లాసంగా జరుపుకుంటారు.
అహ్మదాబాద్:
ఇక్కడ హోలీ రోజు ఉట్టి కొడతారు. కుండలో మజ్జిగ పోసి దానిని ఎత్తులో తాడుతో కట్టి వేలాడదీస్తారు. యువకులు ఆ కుండను కొట్టేందుకు ప్రయత్నిస్తారు. వారిని ఆపేందుకు అమ్మాయిలు వారిపై రంగు నీటిని చల్లుతారు. కుండను పగులగొట్టిన వారిని హోలీ రాజుగా ప్రకటిస్తారు.
3. ఉదయపూర్, రాజస్థాన్
రాజస్థాన్ లోని ఉదయపూర్ లో హోలీ వేడుకలు కాస్త భిన్నంగా ఉంటాయి. హోలీ రోజు ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటారు. వీధిలో లేదా మైదానంలో కర్రలను పోగు చేసి దహనం చేస్తారు.
4. పంజాబ్
పంజాబ్ లోని రూప నగర్ లో సిక్కులు హోలీని ఘనంగా జరుపుకుంటారు. ఆనంద్ పూర్ సాహిబ్ లో అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవానికి విదేశాల్లో స్థిరపడ్డ సిక్కులుసైతం పెద్ద సంఖ్యలో వస్తారు.
5. బెంగాల్
పశ్చిమ బెంగాల్ శాంతినికేతన్ లో హోలీ సంబరాలు అంబరాన్నంటుతాయి. పెద్దలు, యువకలు రంగు నీళ్లు చల్లుకుంటూ ఆనందిస్తారు. వీధుల్లో రాధ, కృష్ణుల విగ్రహాలు ఊరేగిస్తారు. భక్తి పాటలకు నాట్యం చేస్తారు.
6. మణిపూర్
మణిపూర్ లో ఆడపిల్లలకు డబ్బులు ఇస్తేనే వారు మగవారిపై రంగులు చల్లుతారు. రాత్రి వేళ అందరూ ఒక చోట చేరి కర్రలు కాలుస్తారు. మణిపూర్ లో హోలీ వేడుకలు వారం రోజులు జరుగుతాయి. చివరి రోజు కృష్ణుడి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. తబల్ చోంగ్బా గా పిలిచే సాంప్రదాయ నృత్యం చేస్తూ హోలీ జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications