Latest Updates
-
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే..
Holi 2021: హోలీ వేళ ఈ రాశులకు చాలా పవిత్రంగా ఉంటుందట...! మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
హోలీ సందర్భంగా ఈ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందట. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి.
మన దేశంలో దీపావళి తర్వాత అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ ఒకటి. ఈ పండుగను రెండు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 28, 29వ తేదీలలో కాముని దహనం, హోలీ పండుగలను జరుపుకోనున్నారు.

ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, హోలీ పండుగ రోజున గ్రహాలు శుభ సంయోగంలో ఉండనున్నాయి. గురుడు శనితో కలిసి ఉన్నప్పటికీ రాజయోగం రానుంది. అదే విధంగా చంద్రుడు గురుడితో కలిసి ఉండటం.. నవ పంచమి యోగం వల్ల చాలా మందికి శుభప్రదంగా ఉంటుంది.

అంతేకాదు ఆర్థిక పరమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఇక హోలీ వేళ శని తన సొంత రాశి అయిన మకర రాశిలో సంచారం చేయనున్నాడు.

ఈ సందర్భంగా అన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. కానీ కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంతకీ ఆ రాశులేవి.. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

కర్కాటక రాశి..
ఈసారి హోలీ పండుగ సమయంలో ఈ రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో మంచి పనితీరు కనబరుస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీకు సహోద్యోగుల మద్దతు కూడా లభిస్తుంది. దీని వల్ల మీకు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు రానున్నాయి. ఇదే సమయంలో కుంభరాశిలోకి గురుడు సంచారం చేయనున్నాడు. ఈ సందర్భంగా ఆర్థిక పరమైన విషయాల్లో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ఊహించిన ఫలితాలు వస్తాయి.

కన్య రాశి..
ఈ రాశి వారికి హోలీ వేళ ప్రత్యేకంగా ఉంటుంది. మీ లైఫ్ మరింత కలర్ ఫుల్ గా మారే అవకాశం వస్తుంది. వ్యాపారులు ఊహించిన విధంగా ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమికులకు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈ కాలంలో కొన్ని శుభవార్తలను కూడా వింటారు. దీంతో మీరు చాలా హ్యాపీగా ఫీలవుతారు. భవిష్యత్తులో కూడా ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి ఈసారి వచ్చే హోలీ పండుగ అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. మీరు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం మార్పు కోరుకునే వారికి కూడా మంచి అవకాశాలే దక్కనున్నాయి. మరోవైపు వ్యాపారులు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతును పొందుతారు.

కుంభ రాశి..
ఈసారి వచ్చే హోలీ పండుగ ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు తీసుకురానుంది. మీ జీవితం కలర్ ఫుల్ మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో గ్రహాల సంచారం వల్ల మీ లైఫ్ లో అనేక మార్పులు వస్తాయి. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి చాలా మంచి అవకాశాలు రావొచ్చు. వ్యాపారులకు పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మరోవైపు మీకు ఎన్ని సమస్యలు ఎదురైనా.. వాటిని చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు.

మీన రాశి..
ఈ హోలీ పండుగ సందర్భంగా ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో కొత్త ఇంట్లో ప్రవేశించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మరోవైపు వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈ సమయంలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు ఊహించిన విధంగా ఫలితాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా రాబోయే మూడు నెలల్లో మీరు అద్భుతమైన ప్రయణాలు చేస్తారు. వీటి వల్ల మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు.



Click it and Unblock the Notifications