For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశిని బట్టి విద్యలో ఎంత మేరకు రాణిస్తారో తెలుసా...!

|

మనలో పరీక్షలంటే చాలా మందికి ఏదో తెలియని భయం ఉంటుంది. అందుకే అలాంటి సమయంలో మనకు తెలియకుండానే పుస్తకాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అయితే 'పరీక్షలు మీ విజయాన్ని నిర్ణయించలేవు'అని పెద్దలు చెప్పే మాటల్లో వాస్తవం ఉంది.

ఎందుకంటే అన్ని రంగాల్లో పరిజ్ణానం కలిగి ఉండటం మంచిది. అందుకే పుస్తకాలు మరియు సబ్జెక్ట్ పై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. మనలో చాలా మంది విద్యార్థులు ఫస్ట్ ర్యాంకు కోసం ట్రై చేసి చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు.

అయితే ఒక ప్రణాళిక ప్రకారం చదివితే ఎవరైనా పరీక్షల్లో సక్సెస్ అవుతారు. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల ఆధారంగా మీ రాశిని బట్టి మీ అధ్యయన శైలి ఎలా ఉంటుంది.. మీరు విద్యలో ఎంత అద్భుతంగా రాణిస్తారనే విషయాలను తెలుసుకోవచ్చట. ఈ సందర్భంగా విద్య విషయంలో ఏ రాశి వారు ఎలా రాణిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏ రాశుల వారు అత్యంత ఆచరణాత్మకమైన ఆధ్యాత్మిక ఆలోచన చేస్తారో చూడండి...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు లక్ష్యాలు మరియు ఆశయాల పట్ల చాలా శ్రద్ధ చూపుతారు. వీరు ప్రత్యేకంగా ఒక కోర్సును ఇష్టపడకపోయినా.. వీరి అభిరుచుల వల్ల ఆసక్తిని పొందేందుకు ప్రయత్నిస్తారు. అందుకే వీరు అధ్యయనాల విషయంలో చాలా శక్తిని కూడబెట్టుకుంటారు. ఏదైనా కోర్సులోని అంశాలను చాలా లోతుగా పరిశీలించి వాటిని గుర్తుంచుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు సహజంగానే ఎక్కువ కష్టపడతారు. వీరు ఎల్లప్పుడూ సకాలంలో తమ లక్ష్యాలను పూర్తి చేయడానికి ఇష్టపడతారు. దీని వల్ల వీరు విద్య విషయంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోరు. ముఖ్యంగా వీరు అసైన్ మెంట్లపై బాగా పని చేయడం వల్ల వీరికి అది పరీక్షల సమయంలో బాగా ఉపయోగపడుతుంది.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను ఎలా సాధించాలనే దాని గురించి తమ ఆలోచనలను అందరితో షేర్ చేసుకోవాలనుకుంటారు. వీరు మంచి స్వభావం గల వ్యక్తులు. వీరు విద్యావేత్తలు, అనుభవం ఉన్న వారి సలహాలను సద్వినియోగం చేసుకుంటారు. వీరు విద్యపై ఎక్కువ ఫోకస్ పెడతారు.

కార్తీక మాసంలోనే వనభోజనాలెందుకు చేస్తారు.. ఆ చెట్టు కిందే తినాలని ఎందుకంటారో తెలుసా...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు విద్య విషయంలో అనేక సార్లు ఒత్తిడిని ఎదుర్కొంటారు. వీరు పరీక్షల సమయంలో నియంత్రణ కోల్పోతారు. ఇలాంటి సమయంలో వీరు ఓదార్పు మరియు భరోసాను కోరుకుంటారు. కాబట్టి మీరు ఒకే సమయంలో ఏకాగ్రతతో అధ్యయనం చేసే ప్రదేశం కోసం అన్వేషించాలి. దీని వల్ల మీరు విద్యలో మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుంది.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి ఏదైనా అధ్యయనం చేయడానికి ఆసక్తి లేకపోతే.. దాని గురించి అస్సలు పట్టించుకోరు. అయితే వీరు ఏదైనా ప్రత్యేకమైన కోర్సును నేర్చుకునేటప్పుడు మాత్రం కచ్చితంగా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో వీరి ఆసక్తి ఆటోమేటిక్ గా పెరుగుతుంది.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు విద్య విషయంలో కాస్త విభిన్నంగా ఆలోచిస్తారు. అందరి కంటే భిన్నంగా అధ్యయనం చేయడానికి ఇష్టపడతారు. స్వయంగా అన్నీ నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. దీని వల్ల వీరు నేర్చుకున్నది ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారు. వీరు గొప్ప విశ్లేషణాత్మక ఆలోచనా శక్తి కలిగి ఉంటారు. దీని వల్ల వీరు మంచి విద్యార్థులుగా మారతారు.

ఈ వారం మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి...

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు విద్యను ఒక ప్రణాళిక బద్ధంగా చదువుతారు. వీరు ఏదైనా అధ్యయనంపై ఫోకస్ పెడితే.. అది పూర్తి చేసేంత వరకు వదలిపెట్టరు. వీరు స్నేహితులతో కలిసి చదువుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే వారి సహాయం కూడా వీరికి అవసరం అవుతుంది కాబట్టి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు కష్టపడి చదువుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు వీరికంటూ ప్రత్యేక ప్రదేశాన్ని ఎంచుకుంటారు. అక్కడ ఆహారం మరియు నీటిని అందుబాటులో ఉంచుకుంటారు. అలాగే సెల్ ఫోన్ ను స్విచాఫ్ చేస్తారు. దీని వల్ల తమ చదువుకు ఎలాంటి ఆటంకాలు కలగవని అనుకుంటారు. వీరు చాలా ఏకాగ్రతతతో చదువుకుంటారు. దీని వల్ల వీరు కోరుకున్న ఫలితాన్ని సాధించడంలో విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు విద్య విషయంలో విజయం సాధించకపోయినా.. పెద్ద కలలు కంటూ ఉంటారు. ఇందుకోసం వీరు చాలా సమయాన్ని వెచ్చిస్తారు. వీరు తక్కువ సమయంలో సక్సెస్ సాధించకపోయినా.. దీర్ఘకాలంలో వీరు అనుకున్నది సాధిస్తారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి విద్య విషయంలో ఎవరితో అయినా పోటీ ఉంటే.. చాలా ఎక్కువగా కష్టపడతారు. గొప్ప వ్యక్తుల నుండి ప్రేరణ పొందుతారు. ఎందుకంటే ఇది అందరి కంటే ముందుండాలనే కోరికను ఇస్తుంది. దీని వల్ల వీరు కెరీర్, ఆశయాలను చాలా సీరియస్ గా తీసుకుంటారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు చాలా ప్రశాంతమైన, విశ్లేషణాత్మకమైన మనసు కలిగి ఉంటారు. దీని వల్ల వీరికి విద్య విషయంలో ఎలాంటి సమస్యలెదురైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు. వీరు గ్రూప్ ప్రాజెక్టులలో కూడా చాలా సపోర్టింగ్ ఉంటారు. అందుకే వీరు అద్భుతమైన టీమ్ లీడ్ గా మారతారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు విద్య విషయంలో కాస్త ఆలస్యం చేస్తారు. ముఖ్యంగా వీరు ఎక్కువగా వాయిదా వేసే స్వభావం కలిగి ఉంటారు. కానీ పరీక్షకు ముందు చాలా కష్టపడతారు. వీరు కోల్పోయిన సమయాన్ని సులభంగా భర్తీ చేస్తారు. మీరు మీ యొక్క ఉత్తమ వెర్షన్ గా ఉండేందుకు అంకిత భావంతో ఉంటారు. అందుకే వీరు అధ్యయనాలను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు.

English summary

How Good You Are at Studies, According to Your Zodiac Sign in Telugu

Here we are talking about the how good you are at studies, according to your zodiac sign in Telugu. Have a look
Story first published: Tuesday, November 9, 2021, 12:39 [IST]
Desktop Bottom Promotion