Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం శత్రువుపై ఇలా విజయం సాధించాలి
చాణక్యుడి ప్రకారం శత్రువులు రెండు రకాలు. ఒకటి బయటి శత్రువులు, రెండో రకం మనలోపలే ఉండి మనల్ని ముందడగు వేయకుండా జీవితంలో అభివృద్ధి చెందకుండా ఆపే శత్రువులు. ఈ రెండు రకాల శత్రువులను ఎలా ఎదుర్కోవాలో చాణక్యుడు తన గ్రంథాల్లో చెప
చాణక్యుడు గొప్ప తత్వవేత్త, జ్ఞాని, మార్గదర్శకుడు. ఆయన తన వ్యూహాలతో చరిత్ర గతినే మార్చాడు. ఆయన ఆనాడు రచించిన అర్థశాస్త్రం, చాణక్య నీతి గ్రంథాల్లోని అంశాలు నేటికీ అనుసరణీయమే. చాణక్యుడు పలు సందర్భాల్లో శత్రువుల గురించి వివరించాడు. శత్రువు అనే వాడు ఎక్కడి నుండి వస్తాడు, ఎలాంటి కీడు చేస్తాడు, వారిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎత్తుకు పైఎత్తు వేయాలని వివరంగా చెప్పాడు.

చాణక్యుడి ప్రకారం శత్రువులు రెండు రకాలు. ఒకటి బయటి శత్రువులు, రెండో రకం మనలోపలే ఉండి మనల్ని ముందడగు వేయకుండా జీవితంలో అభివృద్ధి చెందకుండా ఆపే శత్రువులు. ఈ రెండు రకాల శత్రువులను ఎలా ఎదుర్కోవాలో చాణక్యుడు తన గ్రంథాల్లో చెప్పాడు.
వ్యాధులు, దోషాలూ శత్రువులే:
చాణక్య నీతి ప్రకారం శత్రువులు ఎప్పుడూ మానవ రూపంలోనే ఉండరు. కౌటిల్యుడి ప్రకారం రోగాలు, దోషాలు కూడా శత్రువుల కిందే పరిగణించాలి. ఎందుకంటే ఒక శత్రువు ఎంతటి హాని తలపెట్టగలడో.. వ్యాధి, దోషం కూడా అంతే బాధను కలిగిస్తాయి.
శత్రువులను ఎప్పుడూ విస్మరించొద్దు:
చాలా మంది చేసే తప్పు ఇది. తమ శత్రువులు ఎవరో, ఏమిటో తెలిశాక కూడా వారి గురించి పెద్దగా పట్టించుకోరు. వారేం చేస్తారులే, చేసినప్పుడు చూసుకోవచ్చులే అనే ధోరణితో ఉంటారు. కానీ మన శత్రువు మనపై ఎప్పుడైనా దాడి చేయవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మనల్ని మనం రక్షించుకోవడానికి మన వంతు కృషి చేయాలి.
శత్రువు బలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి:
శత్రువు మీ కంటే బలవంతుడని తెలిస్తే అది బలంలో అయినా కావొచ్చు లేదా తెలివిలోనైనా కావొచ్చు వారు బలవంతులను తెలిస్తే. వారిని నేరుగా ఎదుర్కోవద్దని చాణక్యుడు సూచించాడు. సరైన అవకాశం, సరైన సమయం కోసం ఎదురుచూడాలి. మంచి తరుణం వచ్చినప్పుడు అదను చూసి దాడి చేయాలని చాణక్యుడు చెప్పాడు.
శత్రువును ధైర్యంగా ఎదుర్కోవాలి:
ప్రతి ఒక్కరికీ శత్రువులు ఉంటారు. అయితే కొంత మందికి వాళ్లెవరో తెలిసి ఉంటారు, కొందరికి తెలియదు. కనిపించే శత్రువుతో కంటే కనిపించని శత్రువు చాలా ప్రమాదకరం. అయితే శత్రువును ఎదుర్కొంటున్నప్పుడు ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. ధైర్యంగా శత్రువును ఎదుర్కోవాలని చాణక్యుడు సూచించాడు.
జాగ్రత్తగా అడుగు వేయాలి:
అంతా సాఫీగా సాగుతుంది అనుకున్నప్పుడే ఊహించలేని ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి సమయంలో అన్నింటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటాడు చాణక్యుడు. భవిష్యత్తులే వచ్చే సమస్యలకు సన్నద్ధత ముందే ఉండాలి.
శత్రువు బలహీనతలు తెలుసుకోవాలి:
చాణక్యుడి ప్రకారం మీరు ఎల్లప్పుడూ శత్రువుల కదలికలపై నిఘా పెట్టాలి. అతని బలహీనతలు ఏమిటి, వారు ఎప్పుడు ఏం చేస్తారు, ఎలా ఉంటారన్న విషయాలు తెలుసుకోవాలి. శత్రువు బలహీనతలు తెలుసుకోవడం విజయానికి తొలి మెట్టు. శత్రువు బలహీనతలు మీ బలాలవుతాయి.
ఆందోళన వద్దు:
శత్రువును ఎదుర్కొంటున్నప్పుడు ఎలా విజయం సాధించాలో తెలియకపోవచ్చు.. ఆ పరిస్థితిలో మీరు గెలుస్తారా లేదా అనే అనుమానం రావొచ్చు.. ఓడిపోతామన్న భయం వెంటాడవచ్చు.. అయితే అలాంటి సందర్భంలో ఆందోళన పడొద్దని చెప్పాడు చాణక్యుడు. ఆందోళన చెందడం వల్ల పరిస్థితులు మరింత దిగజారుతాయని సూచించాడు. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవాలని, నిపుణులు, తెలివైన వ్యక్తుల సూచనలు పాటించాలని చాణక్యుడు చెప్పాడు. ఆపదలో ఉన్నప్పుడు సాయం అడగడం తప్పుకాదని, తక్కువైపోవడం కూడా కాదని వివరించాడు.



Click it and Unblock the Notifications