For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Holi 2021: కరోనా గురించి కలవరపడకుండా హ్యాపీగా హోలీ సంబరాలు జరుపుకోండి...

|

హోలీ పండుగ వస్తోందంటే చాలు.. అందరూ వీధుల్లోకి వచ్చి ఆడ, మగ అనే తేడా లేకుండా... చిన్న పిల్లాడి దగ్గర నుండి పెద్ద వారికి రేసు గుర్రంలా రెచ్చిపోయి రంగులు చల్లుకుంటారు. కొన్నిచోట్ల రెండు రోజుల పాటు ఉత్సవాలు జరిపితే.. మరికొన్ని చోట్ల దాదాపు వారం రోజుల పాటు ఈ హోలీ ఉత్సవాలను డోలికోత్సవం, కామునిపున్నమి, దులహన్, లఠ్ మార్ వంటి పేర్లతో ఘనంగా జరుపుకుంటారు.

ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే కోడిగుడ్లను తలపై కొడితే.. రంగులలో ఆవు పేడను, డ్రైనేజీ నీటిని, మట్టిని కలిపి రంగులను చల్లుతారు. అంతేకాదండోయ్ స్నేహితులు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లి అందరినీ ఒకచోటకు తీసుకొచ్చి రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ పండుగను జరుపుకుంటారు.

ఇదిలా ఉండగా.. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా అలాంటి పరిస్థితి కనిపించలేదు. అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకునే లోపే.. కోవిద్-19 సెకండ్ వేవ్ పేరిట ఆ మహమ్మారి మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ కరోనా మహమ్మారి దెబ్బకు ఈ పండుగ జరుపుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు కరోనా బారిన పడకుండా హోలీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...

Holi 2021: హోలీని ఇలా కూడా జరుపుకుంటారా...! రంగులలో పేడ, మట్టిని కలిపి ఇంకా...!

వంటింటి పసుపు..

వంటింటి పసుపు..

మనం నిత్యం చాలా వంటల్లో పసుపును వాడుతూ ఉంటాం. ఈ పసుపు యాంటీ బయోటిక్ గా బాగా పని చేస్తుందని కూడా మనందరికీ తెలుసు. ఇది మన ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పసుపును మీరు హోలీ సమయంలో హ్యాపీగా వాడొచ్చు. ఈ పసుపును శనగపిండితో కలిపి రంగులను చల్లుకోవడం ద్వారా ఎవ్వరికీ ఎలాంటి భయమనేదే అవసరం లేదు.

కుంకుమ కూడా..

కుంకుమ కూడా..

మీరు నుదుటిన పెట్టుకునే కుంకుమతో కూడా హోలీ రంగులను తయారు చేసుకోవచ్చు. మీరు హోలీ సమయంలో కుంకుమలోకి నీళ్లు కలిపి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీకు ఇంకో రంగు కావాలంటే.. ఈ మిశ్రమంలోకే కాస్త పసుపు కలిపితే చాలు మరో కొత్త రంగు వచ్చేస్తుంది. వీటిని చల్లుతూ హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవచ్చు.

ముందే సిద్ధం కండి..

ముందే సిద్ధం కండి..

ఈ సారి హోలీ వేడుకలు జరుపుకునేందుకు ముందుగా అతిథుల జాబితా సిద్ధం చేయండి. మీరు ఎవరినైతే విశ్వసిస్తారో.. ఎవరైతే కంట్రోల్ లో ఉంటారో వారినే అనుమతించండి. ముఖ్యంగా వీలైనంత తక్కువ మంది వచ్చేలా.. అది కూడా భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మాస్కులు మరవొద్దు..

మాస్కులు మరవొద్దు..

ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. అదే సమయంలో శానిటైజర్ ను మీ వద్దే ఉంచుకోండి. రంగులు చల్లుకోవడానికి ముందు మరియు రంగులు చల్లుకున్న తర్వాత శానిటైజర్ తో మీ చేతులను శుభ్రం చేసుకోండి.

Holi 2021 : ఈ ఏడాది హోలీ ఎప్పుడొచ్చింది? ఈ పండుగ వెనుక ఉన్న రహస్యాలేంటో తెలుసా?

కుటుంబ సభ్యులతో..

కుటుంబ సభ్యులతో..

ఈసారి కరోనా మహమ్మారి కలవరం మళ్లీ మొదలవడంతో.. మీరు సాధ్యమైనంత మేరకు మీ కుటుంబ సభ్యులతో కలిసి మాత్రమే ఈ హోలీ వేడుకలను జరుపుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే... వారిని మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉంచండి.

ఈసారి భిన్నంగా..

ఈసారి భిన్నంగా..

ఈ ఏడాది హోలీ వేడుకలను కాస్త భిన్నంగా జరుపుకోండి. సాధారణంగా ఈ పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ ముఖాలకు రంగులు పూసుకుంటారు. అయితే ఈసారి అలా చేయకండి. వాటర్ కలర్లను యూజ్ చేయండి. భౌతిక దూరం పాటిస్తూ.. బాడీపై రంగుల నీళ్లు చల్లుకోండి.

స్వదేశీ రంగులనే..

స్వదేశీ రంగులనే..

హోలీ సమయంలో స్వదేశీ రంగులను వాడటమే ఉత్తమం. అయితే చాలా ఉత్పత్తుల మాదిరిగానే.. కొన్ని రకాల రంగులు చైనాలో తయారవుతాయి. కాబట్టి ఈ వైరస్ మహమ్మారి వాటి నుండి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విదేశీ రంగులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దు. ఓ నివేదిక ప్రకారం, 90 శాతం మంది భారతీయులు హోలీ వేడుకల్లో చైనీస్ రంగులను వాడుతున్నారని తేలిందట.

ఇంటి దగ్గర్లో..

ఇంటి దగ్గర్లో..

మీకు ఈసారి మార్కెట్లో హోలీ రంగులు లభించకపోతే.. మీ ఇంటికి దగ్గర్లోని రకరకాల చెట్ల బెరళ్లు, పూలను, పసుపు, కుంకుమలతో కొత్త రంగులుగా తయారు చేయొచ్చు. వాటిని తీసుకొచ్చి నీటిలో సరికొత్త రంగులు తయారవుతాయి. ఇలాంటి వాటితో మీరు హ్యాపీ హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. దీని వల్ల కరోనా భయం ఎవ్వరికీ ఉండదు. కాబట్టి హ్యాపీగా హోలీ పండుగ చేసుకోండి...

మీ అందరికీ బోల్డ్ స్కై తెలుగు తరపున హోలీ శుభాకాంక్షలు

English summary

How to celebrate Holi in times of coronavirus

Here we are talking about the how to celebrate holi in times of coronavirus. Read on