Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
సంక్రాంతి రోజు పెద్దలను ఎలా పూజించాలి? ఎలా బట్టలు సమర్పించాలి?
సంక్రాంతి రోజు పెద్దలను ఎలా పూజించాలి, వారికి ఎలా బట్టలు సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి ఆంధ్రలో అతిపెద్ద పండగ. ఎక్కడ ఉన్న వారైనా సొంతూరుకు వచ్చి ఘనంగా చేసుకునే పర్వదినం. సంక్రాంతి అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఇంటిల్లిపాది ఒక దగ్గరకు చేరుతారు, దూరమైన ఫ్రెండ్స్ దగ్గరవుతారు, సొంతూరిలో మన వాళ్ల మధ్యలో మన సాంప్రదాయంలో వైభవంగా చేసుకునే పండగ సంక్రాంతి. అందుకే సంక్రాంతిని పెద్జ పండగ అంటారు. అలాగే సంక్రాంతిని రైతుల పండగ అని, పెద్దల పండగ అని కూడా అంటారు.

దక్షిణాయనంలో వచ్చిన పితృ దేవతలు ఉత్తరాయనంలోకి ప్రవేశించిన సమయంలో తిరిగి స్వర్గలోకానికి వెళ్లిపోతారు. ఆ సమయంలో పితృ దేవతలు తమకు చల్లగా చూడాలని, తిరిగి వచ్చి తమను ఆశీర్వదించాలని సాగనంపుతూ వారిని సంక్రాంతి రోజు, కనుమ రోజు పూజిస్తుంటారు. సంక్రాంతి వేల పెద్దల(పూర్వీకుల) పేరుతో బ్రహ్మణులకు దానాలు చేస్తుంటారు. అందుకే సంక్రాంతికి నువ్వుల వాడకం ఎక్కువగా ఉంటుంది.
సంక్రాంతి రోజు పెద్దలను ఎలా పూజించాలి, వారికి ఎలా బట్టలు సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పుష్కరాల పుణ్యం ఇప్పుడు వస్తుంది:
ప్రతి ఒక్కరూ తమ పూర్వీకులను పూజిస్తుంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో రోజు వారిని స్మరించుకుని పూజిస్తుంటారు. తెలంగాణలో పెత్తరమాస(పెత్ర అమావాస్య) రోజు పెద్దలను అంటే పూర్వీకులను పూజిస్తుంటారు. ఆంధ్రలో కొంత మంది సంక్రాంతి రోజున పెద్దలను పూజిస్తుంటారు.
సంక్రాంతి రోజు తద్దినం పెడుతుంటారు. పుష్కరాల వేళ పితృ దేవతలకు పిండ ప్రదానం చేసినప్పుడు ఎంత పుణ్యం వస్తుందో సంక్రాంతి రోజున వారిని పూజిస్తే అంత పుణ్యం వస్తుందని చెబుతారు.
తర్పణాలు, కుష్మాండ దానం, పితృ దేవతల పేర్లు చెప్పి పేదలకు, బ్రహ్మణులకు దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది.

పెద్దలకు దానం ఎలా చేయాలి:
పూర్వీకులు, పితృదేవలకు ఇంటి సభ్యులంతా ఒకచోటుకు చేరి చేసుకోవడం ఉత్తమం. పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఒకే చోట ఉన్నప్పుడు పెద్ద కుమారుడు దానం చేయాలి. చిన్న కుమారుడు అతనికి సాయం చేయాలి. ఇద్దరూ వేర్వేరు చోట్ల ఉన్నప్పుడు ఇద్దరూ దానం చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. తర్పణాలు ఎవరైనా వదలొచ్చు. పిండ ప్రదానం మాత్రం పెద్ద కొడుకు చేయాలి. వారు లేకపోయినా లేదా దూరంగా ఉన్నా వారి పేరు చెప్పి పిండప్రదానం చేయాలి.

పెద్దలకు బట్టలు దానం ఎలా చేయాలి:
పెద్దల పండగ అయిన సంక్రాంతి రోజు పెద్దలకు వస్త్ర దానం చేస్తుంటారు. వారికి సమర్పించిన దుస్తులను వారి పేరు చెప్పి బ్రాహ్మణులకు దానం చేస్తుంటారు. కొందరు పెద్దల పేరు చెప్పి ఆ కొత్త బట్టలను మరుసటి రోజు కుటుంబసభ్యుల్లో ఒకరు వేసుకుంటారు.
పెద్దల పేరు చెప్పి కొత్త బట్టలను నిరుపేదలకు దానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. సాయం అందుకునే వారు పేదవారై ఉండి, వారు మన దానాన్ని వాడుకోగలిగితేనే ప్రయోజనం చేకూరుతుంది.



Click it and Unblock the Notifications