Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం సరైన ఫ్రెండ్‌ను కనిపెట్టడం ఎలాగంటే..
చాణక్యుడు చెప్పిన ఎన్నో విషయాలు నిజజీవితంలో పాటించదగినవి. ఆయన ఆలోచనలు కచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేవి. చాణక్యుడు రాసిన నీతి పుస్తకం ప్రకారం సరైన స్నేహితుడిని కనిపెట్టడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
చాణక్యుడు ఆర్థికవేత్త మాత్రమే కాదు జీవితంలోని ప్రతి అంశాన్ని చాలా చక్కగా వివరించిన గొప్ప మేధావి. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు నిజజీవితంలో పాటించదగినవి. ఆయన ఆలోచనలు కచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేవి. చాణక్యుడు రాసిన నీతి పుస్తకం ప్రకారం సరైన స్నేహితుడిని కనిపెట్టడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ప్రతి వ్యక్తికి స్నేహితులు ఉండాలి. అది కూడా నమ్మదగిన, నిజాయితీ గల వారై ఉండాలి. వారిని మనం విశ్వసించగలగాలి, వారితో రహస్యాలు షేర్ చేసుకోగలగాలి. కష్టాల్లో ఉన్నప్పుడు వారు సాయం చేస్తారని అనిపించాలి. అండగా ఉంటారని నమ్మకం ఉండాలి. జ్ఞానం, తెలివి ఉండాలి. వారు మనకు సలహాలు ఇస్తుండాలి, మార్గదర్శకత్వం చేస్తుండాలి. మన చర్యలపై విమర్శనాత్మకంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు.

నిజాయితీగా, సూటిగా..
నిజమైన స్నేహితుడు నిజాయితీగా, సూటిగా ఉండాలి. వినడానికి కష్టంగా ఉన్నా నిజం చెప్పడానికి భయపడని వ్యక్తి అయి ఉండాలి. వారు నిర్మాణాత్మక విమర్శలను అందించగల వ్యక్తిగా ఉండాలి. సొంత లోపాలు, బలహీనతలను చూసేందుకు వారు సహాయం చేయాలని చాణక్యుడు చెప్పాడు.
నమ్మకంగా..
నిజమైన స్నేహితుడు నమ్మకంగా, విశ్వాసపాత్రంగా ఉండాలి. కష్టనష్టాల్లో, సుఖదుఃఖాల్లో తోడుగా ఉండాలి. మద్దతునివ్వాలి. అవసరమైన సమయంలో వారు పక్కనే ఉండాలి. మీకు సహాయం చేయాలి, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు.
నిస్వార్థంగా..
నిజమైన స్నేహితుడు నిస్వార్థంగా ఉండాలి. దయతో ప్రవర్తించాలి. వారు మన అవసరాలను వారి సొంత అవసరాలకు ముందు ఉంచగలిగే వ్యక్తిగా ఉండాలి. కష్ట సమయాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపాలి. వారు ప్రోత్సాహం, మద్దతును అందించే వ్యక్తిగా ఉండాలి. నిరాశకు గురైనప్పుడు ఉత్సాహం వచ్చేలా ప్రయత్నించే వ్యక్తి అయి ఉండాలని చాణక్యుడు చెప్పాడు.
ఫ్యామిలీ ఫ్రెండ్‌లా..
ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంటారు. అయితే ఫ్యామిలీ ఫ్రెండ్ ను ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్కూల్లో, కాలేజీలో, వర్క్‌ప్లేస్‌లో స్నేహితులు కనిపిస్తారు. కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా ఉండేవారు చాలా తకువ. ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ను ఎంపికి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు.
ముఖ్యంగా చెడు కార్యకలాపాలకు పాల్పడే వారిని, చెడు అభిరుచులు ఉన్న వారికి దూరంగా ఉండాలి. వారు నాశనం చేయబడడమే కాకుండా వారి సహవాసం ద్వారా మనం కూడా నాశనం అవుతాం. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి.
ఎదురుగా ఒకలా, వెనక మరోలా..
నిజమైన స్నేహితుడు ఎప్పుడైనా ఒకేలా ఉంటాడు. మీ గురించి వేరే వారి వద్ద తక్కువ చేసి మాట్లాడడు. మీరు ముందు ఉన్నప్పుడు ఒకలా, వెనక ఉన్నప్పుడు మరోలా ఉండరు. వారు ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకేలా ఉంటారు. అలాంటి వారిని స్నేహితులుగా చేసుకోవాలని చాణక్యుడు చెప్పాడు.
చాణక్య నీతి ప్రకారం నిజమైన స్నేహితుడు నమ్మదగినవాడు, తెలివైనవాడు, నిజాయితీపరుడు, విశ్వాసపాత్రుడిగా నిస్వార్థంగా ఉండాలి. వారు విలువైన సలహాలు మరియు మార్గదర్శకత్వం అందించగల వ్యక్తిగా ఉండాలి. కష్ట సమయాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపాలి. ఈ లక్షణాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా జీవిత ప్రయాణంలో మీకు మద్దతునిచ్చే, మార్గనిర్దేశం చేసే సరైన స్నేహితుడిని గుర్తించవచ్చని చాణక్యుడు చెప్పాడు.



Click it and Unblock the Notifications