For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుష్మన్ దోస్తులను గుర్తు పట్టడమెలా? వారినెలా పక్కనబెట్టాలో తెలుసా...!

చెడు స్నేహాన్ని ఎలా గుర్తించాలి.. దాని నివారణ చర్యలు ఎలా చేపట్టాలి.

|

కష్టాల్లో ఉన్నప్పుడు కామెడీ చేసేవాడు... కావ్ కావ్ మంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పేవాడు.. బిజినెస్ లేకున్నా బిల్డప్ ఇచ్చేవాడు.. ఆపదలో అండగా నిలవకుండా హ్యాండ్ ఇచ్చేవాడు.. పరీక్షల్లో ఫెయిల్ అయినా పార్టీ అడిగేవాడు... బైక్ ఎక్కించుకుని పెట్రోల్ పైసలు అడిగేవాడు.. అలాంటి విషయాల్లో కన్నింగ్ 'నైస్'గా తప్పించుకునేవాడు.. కన్యల విషయంలో 'కామ'ప్రమైజ్ కానివాడు.. ఖర్చులకు లేనప్పుడు కాసులు అడిగేవాడు..

How to Identify and Inoculate a Toxic Friendship

ఇలాంటి వాటితో పాటు మరెన్నో లక్షణాలుండే వారు మనలో చాలా మందే ఉంటారు. ఇదిలా ఉండగా.. మనల్ని అర్థం చేసుకునేవాళ్లు మంచి స్నేహితులు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. అందుకే మనకు ఏదైనా కష్టం వస్తే.. బంధువుల కన్నా.. స్నేహితుని దగ్గరికి వెళితే ఏదైనా సాయం దొరుకుతుందని చెబుతారు. అందుకే స్నేహానికన్నా మిన్న ఈ లోకాన ఏది లేదని అన్నాడో సినీ కవి.

How to Identify and Inoculate a Toxic Friendship

ఎందుకంటే కష్టమైనా.. నష్టమైనా.. ఆనందమైనా.. సంతోషమైనా.. అనునిత్యం మన వెంట ఉండేవాడే మన స్నేహితుడు. అయితే మీ డ్రీమ్స్ కు మద్దతుగా నిలిచేవాళ్లెవరు.. మిమ్మల్ని ప్రోత్సహించేదెవరు.. అనే విషయాలను మీరు గుర్తించాలి. ఎందుకంటే మీ స్నేహితుల జాబితాలో కొందరు దుష్మన్ దోస్తులు (Toxic Friends) ఉంటారు.

How to Identify and Inoculate a Toxic Friendship

ఇలాంటి వారు మన జీవిత లక్ష్యాలకు అండగా నిలవకపోగా.. మనల్ని ఎప్పుడూ నిరుత్సాహపడుతూ మాట్లాడుతూ... నీ వల్ల కాదు.. నీకేమీ చేతకాదు అని హేళన చేస్తూ ఉంటారు. మనకు తెలియని విషయమేమిటంటే.. ఇలాంటి మన వెంటే ఉండి.. మనకే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. మరి అలాంటి దుష్మన్ దోస్తులను ఎలా గుర్తు పట్టాలి... దుర్మార్గపు మనస్తత్వం ఉన్న దోస్తులతో దూరంగా ఉండేందుకు ఏమి చేయాలి. అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మీ పుట్టిన తేదీని మాకు చెప్పండి ... మీ జీవితంలో జరిగిన మరియు జరగబోయే రహస్యాన్ని తెలుసుకోండి ...మీ పుట్టిన తేదీని మాకు చెప్పండి ... మీ జీవితంలో జరిగిన మరియు జరగబోయే రహస్యాన్ని తెలుసుకోండి ...

ఆశలన్నీ ఆవిరి..

ఆశలన్నీ ఆవిరి..

మనపై నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్న స్నేహితులు ఉంటే.. ఎప్పటికైనా ప్రమాదకరమే. ఎందుకంటే వాళ్ల వల్ల మన ఆశలన్నీ ఆవిరైపోతాయి. రొమాంటిక్ రిలేషన్ షిప్ వచ్చేసరికి కొన్ని హద్దులు.. అంచనాలు ఉంటాయి. అక్కడ భాగస్వామి ప్రమాదమా.. కాదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు.

వాళ్లనే హైలైట్ చేసుకుంటారు..

వాళ్లనే హైలైట్ చేసుకుంటారు..

చెడు ఆలోచనలు ఉన్న స్నేహితులు ఎల్లప్పుడూ వాళ్ల సమస్యలు.. పోరాటాల గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఏ సందర్భంలో అయినా నేరుగా దూరేసి.. వాళ్లని వాళ్లు హైలెట్ చేసుకుంటారు. మన గురించి తెలుసుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయరు.

మనల్ని మాట్లాడనివ్వరు..

మనల్ని మాట్లాడనివ్వరు..

మనల్ని కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వరు. ఒకవేళ మనం ఏదైనా చెబుతున్నా వినేందుకు అస్సలు ఆసక్తి అనేదే చూపించరు. మనం నిజమైన స్నేహితులతో ఉంటే.. గంటలు కూడా నిమిషాల్లా గడుస్తాయ్.. రోజులు గంటల్లా మారిపోతుంటాయి. కానీ, ఫ్రెండ్ అనే ముసుగులో మనతోనే కలిసి మెలసి తిరిగే వారితో సంతోషం మాట దేవుడెరుగు...కనీసం మనకు మనశ్శాంతి కూడా ఉండదు.

విలన్ లాగా..

విలన్ లాగా..

మనకు ఎప్పుడైనా ఏదైనా సమస్యొచ్చినా, బాధగా అనిపించినా.. ఇంట్లో వాళ్లకన్నా ముందు ఫ్రెండ్ కే ఫోన్ చేస్తాం లేదా వాట్సాప్ చేస్తాం. కానీ మన ఫ్రెండ్ విలన్ లాంటివాడైతే అసలు ఆలోచన అనేదే రాదు. అలాంటి వారితో నార్మల్ గా మాట్లాడేందుకు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటాం.

చైనీస్ ఫేస్ రీడింగ్ ప్రకారం, ఈ సంకేతాలు ఉన్నవారిని వివాహం చేసుకోవడం కష్టం ...చైనీస్ ఫేస్ రీడింగ్ ప్రకారం, ఈ సంకేతాలు ఉన్నవారిని వివాహం చేసుకోవడం కష్టం ...

ఏదీ చెప్పాలన్నా..

ఏదీ చెప్పాలన్నా..

మన స్నేహితులలో ఎవరితో అయినా కొన్నిసార్లు గొడవ పడుతూ ఉంటాం. అందులో మన నిజమైన ఫ్రెండ్ అయితే... మనం కోపంలో ఏమన్నా అర్థం చేసుకుంటాడు. అలాంటి వారితో మాట్లాడేటప్పుడు రెండోసారి ఆలోచించాల్సిన పనే లేదు. అదే కన్నింగ్ ఫ్రెండ్ అయితే .. అలాంటి ఏమైనా చెప్పాలన్నా కూడా వీరితో చెప్పి అనవసరమైన గొడవలెందుకులే అనకుని వదిలేస్తాం.

అన్నింటికీ ఓకే.. కానీ..

అన్నింటికీ ఓకే.. కానీ..

మన స్నేహితులలో కొందరు మన టైమ్ గురించి అస్సలు ఆలోచించరు. ఏ విషయంలోనైనా సరే ప్లాన్ వేసుకునేటప్పుడు మనతోనే ఉంటారు. అన్నింటికీ ఓకే అంటారు. తీరా టైమ్ దగ్గరికొచ్చాక సారీ అని సింపుల్ గా చెప్పి హ్యాండ్ ఇచ్చేస్తారు. ఇంకా కొంతమంది అయితే మనల్ని గంటల కొద్దీ వెయిట్ చేయిస్తారు.

ఫ్రీగా ఉండలేం..

ఫ్రీగా ఉండలేం..

దుష్మన్ లాంటి దోస్తులుంటే... మనం ఫ్రీగా ఉండలేం. వాళ్లు మనకు దూరంగా ఉంటే ఎంత బాగుంటుంది అని ఎప్పుడూ అనిపిస్తుంటుంది. వీరు మనకు ఏ మాత్రం గౌరవం అనేదే ఇవ్వరు. పైగా మనల్ని భయపెడుతూ.. మనమే బాధపడేలా చేస్తుంటారు.

మనల్నే ఫూల్స్..

మనల్నే ఫూల్స్..

టాక్సిక్ ఫ్రెండ్స్ ఎప్పుడూ మనల్ని వారి మాయ మాటలతో తికమకపెడుతూ ఉంటారు. చాలా చోట్ల మనల్ని ఫూల్స్ చేయాలని చూస్తారు. కొన్నిసార్లు మన గురించి ఇతరులతో నెగిటివ్ గా మాట్లాడి మనల్ని బకరాలు చేస్తుంటారు. ఇలాంటి సంకేతాలన్నీ మీ దోస్త్ దుష్మన్ అని తెలియజేస్తాయి.

‘వాళ్లు నమ్మకస్తులేనా?' కాదా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ‘బహుశా.. నమ్మలేం' అని కచ్చితంగా అనిపిస్తే మాత్రం కచ్చితంగా వారు దుష్మన్ దోస్తులే అయితరు.

English summary

How to Identify and Inoculate a Toxic Friendship

Here we talking about how to identify and inoculate a toxic friendship. Read on
Desktop Bottom Promotion