For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Holi 2023: హోలీ జోష్ రెట్టింపు కావాలంటే.. ఇంట్లోనే రంగులను ఈజీగా తయారు చేయండి...

హోలీ రంగులను సహజంగా ఎలా తయారు చేయాలో చూసెయ్యండి.

|

అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్న హోలీ రంగుల పండుగ వచ్చేసింది.. ఆకాశమే హద్దుగా.. ఆనందాల తొలి పొద్దుగా.. అంబరాన్నంటేలా సంబురాలు జరుపుకోవడం.. చిన్నా పెద్దా, ఆడ, మగ తేడాల్లేకుండా రంగుల వానలో తడిసి ముద్దయ్యేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధమయ్యారు.

Holi-2023: How to make natural Holi colours at home in telugu

అయితే రంగుల వేడుకల్లో కెమికల్స్ కలిపిన కలర్స్ ను వాడటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీని గురించి ప్రతి ఏటా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. మార్కెట్లో రసాయనిక రంగులే ఎక్కువగా లభిస్తున్నాయి.

How to make natural Holi colours at home

సాధారణ ప్రజలకు సహజ రంగులేవీ.. కెమికల్స్ కలిపిన రంగులేవో తెలుసుకోవడం కొంత కష్టంగా ఉంటుంది. అయితే రసాయన రంగులతో ఇబ్బంది పడకుండా ఇంట్లోనే ఈజీగా రంగులను తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడే చూసెయ్యండి.. రంగుల కేళిని ఆనందంగా జరుపుకోండి...

Holi Safety Tips:హోలీ వేళ కళ్లను కాపాడుకోవాలంటే... ఇలా చేయండి...Holi Safety Tips:హోలీ వేళ కళ్లను కాపాడుకోవాలంటే... ఇలా చేయండి...

రెడ్ కలర్ కోసం..

రెడ్ కలర్ కోసం..

హోలీ పండుగ రోజున చాలా మంది రెడ్ కలర్స్ ను ఎక్కువగా వాడుతుంటారు. ఈ రంగును తయారు చేసేందుకు మందార పువ్వులను శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాలి. అవి ఎండిన తర్వాత వాటిని పొడిని మెత్తని పేస్టులా మార్చుకోవాలి. అంతే మీకు కావాల్సిన రెడ్ కలర్ రెడీ అయినట్టే. ఒకవేళ మీకు ఎక్కువ మోతాదులో కలర్ కావాలంటే, దీనికి కొద్దిగా బియ్యంపిండి, ఎర్రచందనం, 3 స్పూన్ల కుంకుమను కూడా కలపొచ్చు. ఈ రెడ్ కలర్ వల్ల మన బాడీకి ఎలాంటి హాని కలగదు. ఈ కలర్ ను పొడిగా మరియు తడిగా కూడా వాడొచ్చు. ఉదాహరణకు ఒక లీటర్ నీట్లో రెండు చెంచాల కుంకుమ పౌడర్ ని బాగా కలిపి వాటిని వేడి చేయాలి. అవి చల్లగా మారాక కొన్ని నీళ్లను కలిపితే చాలు.

ఎల్లో కలర్ ఎలా చేయాలంటే..

ఎల్లో కలర్ ఎలా చేయాలంటే..

హోలీ పండుగ రోజున రెడ్ కలర్ తో పాటు ఎల్లో కలర్ ను కూడా ఎక్కువగానే వాడతారు. అయితే ఈ రంగును ప్రిపేర్ చేయడానికి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. దీనికోసం ఓపిక ఉండాలి. ఇక విషయానికొస్తే.. ముందుగా 50 గ్రాముల సన్ ఫ్లవర్ పువ్వులు, 20 గ్రాముల నారింజ తొక్కల పొడి, చేమ గడ్డి పొడిని ఒక 200 గ్రాములు, 100 గ్రాముల పసుపు, 20 చుక్కల నిమ్మరసం.. వీటన్నింటి కలిపి ఒక పెద్ద పాత్రలో వేయాలి. వీటిని ఎంత బాగా కలిపితే.. అంత మెత్తగా పసుపు రంగు వచ్చేస్తుంది.

గ్రీన్ కలర్ కోసం..

గ్రీన్ కలర్ కోసం..

ఎల్లో, రెడ్ కలర్ తర్వాత గ్రీన్ కలర్ రంగును కచ్చితంగా వాడతారు. దీన్ని తయారు చేసేందుకు ముందుగా గోరింటాకు పొడికి సమాన పరిమాణంలో బియ్యపు పిండిని కలపాలి. అలాగే వేప ఆకులను నీటిలో వేసి బాగా వేడి చేయాలి. అందులోని పైన ఉన్న నీటిని వడబోసి మిగిలిన నీటిని తడి గ్రీన్ కలర్ గా వాడుకోవచ్చు.

Science Behind Holi:హోలీ పండుగ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసా...Science Behind Holi:హోలీ పండుగ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసా...

ఆరెంజ్ కలర్..

ఆరెంజ్ కలర్..

ఈ కలర్ కోసం ముందుగా మోదుగ పువ్వులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి లేదా నీటిలో వేడి చేసినా సరిపోతుంది. ఎన్నో ఆయుర్వేద గుణాలుండే మోదుగ పూలను ఎండబెట్టి దంచితే పొడి రంగు తయారవుతంది. కుంకుమ పువ్వును రాత్రంతా నీటిలో నానబెడితే ఉదయానికంతా ఆరెంజ్ కలర్లోకి మారిపోతుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని.

పింక్ కలర్..

పింక్ కలర్..

ఈ కలర్ ను కూడా హోలీ పండుగ రోజున కచ్చితంగా వాడతారు. పింక్ కలర్ తయారు చేసేందుకు బీట్ రూట్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ముందుగా బీట్ రూట్ ను ఆరబెట్టాలి. అది పొడిగా మారినప్పుడు దానికి 2 స్పూన్ల గోధుమ పిండిని లేదా శనగ పిండిని కలిపితే చాలు. మీకు డార్క్ పింక్ కలర్ కావాలంటే, మీరు ఫుడ్ గ్రేడ్ పింక్ కలర్ ను జోడించొచ్చు. తడి రంగు కావాలంటే బీట్ రూట్ ను నీటిలో వేడి చేసి చల్లార్చాలి.

బ్రౌన్ కలర్..

బ్రౌన్ కలర్..

గోరింటాకు పౌడర్ ను ఒక భాగం తీసుకుని, దానికి నాలుగు భాగాలు ఉసిరి పౌడర్ ను కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలిపితే తడి బ్రౌన్ కలర్ రెడీ అవుతుంది. పొడి రంగులో కావాలంటే ఈ మిశ్రమానికి బియ్యం పిండిని కలపండి.

FAQ's
  • 2022 సంవత్సరంలో హోలీ పండుగను ఎప్పుడు జరుపుకోనున్నారు?

    ఈ ఏడాది 2022 సంవత్సరంలో మార్చి 17, 18వ తేదీల్లో అంటే గురు, శుక్రవారం నాడు రానుంది. స్నేహాన్ని, బంధుత్వాన్ని మరింత దగ్గర చేసేందుకు హోలీ వంటి పండుగలు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. ఇదిలా ఉండగా.. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి రోజున హోలికా దహనం చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, రంగ్ ఉత్సవ్ హోలీని హోలికా దహన్ అంటారు. ఈ పండుగ సత్య యుగం నుండి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాల ద్వారా తెలుస్తోంది.

English summary

Holi-2023: How to make natural Holi colours at home in telugu

Here we are talking about the how to make natural holi colours at Home. Have a look
Desktop Bottom Promotion