For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ లాక్ డౌన్ తప్పదా? కరోనా కేసులు పెరుగుదలే కారణమా?

|

'కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న' సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. కరోనా, లాక్ డౌన్ పరిస్థితులకు ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. మొదట్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు ఉన్నప్పుడు తెలివిగా వ్యవహరించిన ప్రభుత్వాలు వెంటనే లాక్ డౌన్ విధించాయి.

దీని దెబ్బకు ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. కోట్లాది మంది కూలీలు బహుదూరపు బాటసారులయ్యారు. అయినా పర్వాలేదు.. గంజి తాగైనా ఉంటాం.. బచ్చలకూర తిని అయినా బతుకుతాం.. అని చెప్పుకున్నాం. దాని వల్ల కరోనా మహమ్మారి ఎంత ప్రమాదమో ప్రజలకు సెల్ప్ కంట్రోల్ ఎంత అవసరమో తెలిపేందుకు బాగా ఉపయోగపడింది. అప్పుడు అందరూ అద్భుతంగా సహకరించారు కూడా.

కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు ఏ మాత్రం సహకరించడం లేదు. ముఖ్యంగా టెస్టులు చేయాల్సిన సమయంలో చేయలేదు. ఫలితంగా మళ్లీ దేశవ్యాప్తంగా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుంది.

అందులోనూ హైదరాబాదులో కరోనా పంజా విసిరినట్టు కన్ఫార్మ్ అవుతోంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిందే అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు మీడియాలో సైతం మరో రెండు వారాల పాటు లాక్ డౌన్, కర్ఫ్యూ కొనసాగిస్తారనే సంకేతాలు కనబడుతున్నాయి.

కరోనావైరస్ వాస్తవానికి ఆరోగ్యకరమైన వ్యక్తులలో మధుమేహాన్ని ప్రేరేపిస్తుంది: అధ్యయనంకరోనావైరస్ వాస్తవానికి ఆరోగ్యకరమైన వ్యక్తులలో మధుమేహాన్ని ప్రేరేపిస్తుంది: అధ్యయనం

అక్కడంతా లాక్ డౌనే...

అక్కడంతా లాక్ డౌనే...

కరోనా వైరస్ కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుండటంతో మహారాష్ట్ర, తమిళనాడు, వంటి రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలలో కూడా లాక్ డౌన్ ఇప్పటికే పొడిగించాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు.

క్వారంటైన్ ను పెంచారు..

క్వారంటైన్ ను పెంచారు..

అంతేకాదు ఇప్పటివరకు క్వారంటైన్ పీరియడ్ 14 రోజుల వరకు ఉన్న ఈ కాల వ్యవధిని కాస్త మరో వారం రోజులు, అంటే 21 రోజులకు పెంచుతూ ఆయా ప్రభుత్వాలు ఆదేశాలు సైతం జారీ చేశాయి.

హోం క్వారంటైన్..

హోం క్వారంటైన్..

మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి మాత్రం విచిత్రంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో 80 శాతం వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలా కోవిద్-19 కేసులు పెరగడంతో ఏపీ ప్రభుత్వం హోం క్వారంటైన్ కు కూడా అనుమతి ఇచ్చింది.

కోవిడ్ -19: జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి, రోగనిరోధక శక్తిని పెంచుతుందికోవిడ్ -19: జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది

హైదరాబాద్ లాక్ డౌన్..

హైదరాబాద్ లాక్ డౌన్..

ఇలా హైదరాబాదులో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో.. తెలంగాణ ప్రభుత్వం మరోసారి హైదరాబాదులో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తుందని వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రకటనలు కూడా లాక్ డౌన్ కు సానుకూలంగా వస్తున్నాయి.

సెల్ఫ్ లాక్ డౌన్..

సెల్ఫ్ లాక్ డౌన్..

కరోనా విపరీతంగా వ్యాపిస్తుండటంతో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కొందరు వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. తాము వ్యాపారంలో భారీగా నష్టపోతామని తెలిసినా, వారు దుకాణాలను మూసేందుకే మొగ్గు చూపుతున్నారు.

మరణాల రేటు తక్కువ..

మరణాల రేటు తక్కువ..

కరోనా దేశవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న సమయంలో.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, తెలంగాణలో మరణాల రేటు తక్కువగా ఉంది. ఇది కొంత ఊరటనిచ్చే విషయమే. కానీ పరిస్థితి మాత్రం భయంకరంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

స్వీయ నియంత్రణ..

స్వీయ నియంత్రణ..

అయితే కరోనా నుండి కాపాడుకునేందుకు ప్రస్తుతానికి స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గం. ముఖ్యంగా మాస్కులను కచ్చితంగా ధరించడం.. శానిటైజర్ వాడటం.. భౌతిక దూరాన్ని మెయింటెయిన్ చేయడం వంటి వాటిని కచ్చితంగా పాటించాలి.

English summary

Hyderabad likely go for lockdown again in wake of rising covid-19 Cases

Here we talking abut hyderabad likely go for lockdown again in wake of rising covid-19 cases. Read on.
Story first published: Monday, June 29, 2020, 17:48 [IST]