For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఇది విన్నారా? ‘ఫస్ట్ నైట్‘లో ఈ టాబ్లెట్ ద్వారా కన్యత్వాన్ని కనిపెట్టొచ్చట.. ఇంతకీ ఇది నిజమేనా?

|

మన దేశంలో చాలా మంది ప్రజలు కన్యత్వం అనే ఆలోచనతో ఎంతగానో మత్తులో ఉన్నారు. ఇప్పటికీ కొంత మంది మహిళలు వివాహానికి ముందు కన్యత్వ పరీక్షలను ఎదుర్కొంటున్నారు. సినిమాలు, టీవీ షోల్లో కూడా ఇలాంటి వాటిని నాటకీయంగా చిత్రీకరిస్తారు. అందుకే కన్యత్వానికి సంబంధించి ఆలోచన క్లిష్టంగా ఉంటుంది. ఇప్పటికీ మన సమాజంలో స్త్రీ యొక్క కన్నెపొర చెక్కుచెదరకుండా ఉంటేనే కన్య అనే భ్రమలో చాలా మంది ఉన్నారు.

I-Virgin

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే ఇటీవల కొంతమంది భారతీయులు ఒక మహిళ యొక్క కన్యత్వాన్ని నకిలీ లేదా కన్యనే తెలుసుకునేందుకు సహాయపడే ఉత్పత్తులను కనుగొన్నారు. అది కూడా ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్ అని తెలుసుకున్న తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. ఇది చదివి మీరు కూడా అవాక్కయ్యారా? అంతేకాదు ఇందుకు సంబంధించి ఓ మహిళ ట్విట్టర్లో అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను, ఫొటోలను తీసి వివరాలను రాసుకొచ్చింది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకోండి.

ఐ-వర్జిన్ ట్యాగ్ లైన్..

ఐ-వర్జిన్ ట్యాగ్ లైన్..

కన్యత్వానికి సంబంధించిన ఉత్పత్తికి అమెజాన్ లో ఐ-వర్జిన్ అని ట్యాగ్ లైన్, ‘ఫస్ట్ నైట్ బ్లడ్‘ అని పేరు కూడా పెట్టారు. అందుకు సంబంధించిన వివరాలు కింద పోస్టులలో మీరే చూడండి.

ఎటుంటి దుష్ప్రభావాలు ఉండవట..!

ఎటుంటి దుష్ప్రభావాలు ఉండవట..!

తొలిసారి నకిలీ రక్తానికి ఎలాంటి సర్జరీ అవసరం లేదట!

సులభంగా మరియు వేగవంతంగా..

హై క్వాలిటీ బ్లడ్ పౌడర్ తో దుష్ప్రభావులు లేవట..

ఎలాంటి ఇంజెక్షన్లు అవసరం లేదట..

అనస్తిషియా అవసరమూ లేదట..

విషపూరితం కూడా కాదట..

కన్యత్వం అనే మత్తులో..

కన్యత్వం అనే మత్తులో..

చాలా మంది ప్రజలు ఇలాంటి ఉత్పత్తులతో తమ జీవిత భాగస్వాములను ‘ఫస్ట్ నైట్‘ లో అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. మీరు దీని ద్వారా వచ్చిన ఫలితాన్ని బట్టి మీరు మీ భాగస్వామిపై కోపం మరియు అసహ్యం పెంచుకునే ముందు ఇలాంటి ఉత్పత్తులు ఎంతవరకు నిజమో ఒకసారి ఆలోచించండి. స్త్రీ కన్యత్వం పట్ల ఇలాంటి ఉత్పత్తులు అమ్ముడవుతుండటం ఆశ్చర్యకరమే కదా?

ఈ ఆధునిక యుగంలో..

ఈ ఆధునిక యుగంలో..

ఈ ఆదునిక యుగంలోనూ పెళ్లికి ముందు మహిళలు ‘స్వచ్ఛమైన మరియు కన్య‘గా ఉండాలని కోరుకునేవారు ఇప్పటికీ అనేకమంది ఉన్నారు. ఇది ఒక్క మన దేశంలోనే కాదు. చాలా దేశాలలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మహిళలు వివాహ రాత్రి అంటే ఫస్ట్ నైట్ వరకు కన్యగా ఉండకపోవడం చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే ఒక స్త్రీ కన్నెపొర వివాహం అయ్యే వరకు చెక్కు చెదరకుండా ఉండాలని, వారి భర్తతో తొలి కలయికను ఆనందించాలని సమాజం కోరుకుంటుంది.

పెళ్లికి ముందే..

పెళ్లికి ముందే..

అమ్మాయిలు తొలిసారి రక్తస్రావం చేస్తే, అప్పుడు ఆమె స్వచ్ఛమైన మరియు నమ్రతగా భావించింది. ఇది విఫలమైతే చాలా పాపంగా పరిగణించబడుతుంది. స్త్రీని ‘వదులుగా ఉండే పాత్ర‘తో నే చాలా మంది చూస్తారు. ఇది ఇంతటితో ఆగదు. పెళ్లికి ముందే మహిళలు వాస్తవానికి కన్యత్వ పరీక్షలు చేయించుకోవాల్సిన సందర్భాలు ఇంకా కొన్ని చోట్ల ఉండటం విచారకరం. అప్పటివరకు ఆమె కన్నెపొర చెక్కు చెదరకుండా ఉంటేనే, ఆమె కన్య అని సమాజం పరిగణిస్తుంది.

సైన్స్ ప్రకారం..

సైన్స్ ప్రకారం..

కానీ సైన్స్ ప్రకారం కన్నెపొర అనేది స్త్రీ యోని ప్రారంభంలో ఉన్న ఒక సన్నని పొర. ఈత కొట్టినప్పుడు, సైక్లింగ్, సాగతీత మరియు అనేక ఇతర క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు అది చినిగిపోతుంది. ఈ విషయాన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలి.

ఐ-వర్జిన్ నిజమేనా?..

‘ఫస్ట్ నైట్‘లో కలయికకు కొన్ని గంటల ముందు తమ యోనిలో ఈ మాత్రను చొప్పించాలట. ఇది యోనిలో కరిగిపోతుందట. తర్వాత మానవ రక్తాన్ని పోలి ఉండే ద్రవాన్ని విడుదల చేస్తుందట. ఇలాంటి ఉత్పత్తులు చాలా కాలంగా మార్కెట్లో ఉన్నాయని ప్రజలు తెలుసుకోవాలి. ఇదొక్కటే కాదు నకిలీ కన్యత్వం కోసం ఉత్పత్తులు చాలా కాలం నుండే ఉన్నాయి. ఇలాంటి ఉత్పత్తులు ఇంకా అమ్ముడవుతున్నాయంటే ప్రజలు తమ ఆలోచనను అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇలాంటి ఉత్పత్తులను నమ్మాల్సిన పని లేదు.

స్త్రీ స్వేచ్ఛకు వదిలేయాలి..

స్త్రీ స్వేచ్ఛకు వదిలేయాలి..

ఒక మహిళ కన్యగా ఉండాలనుకుంటుందా లేదా అనేది ఆమెనే ఎంపిక చేసుకోవాలి. ఇందుకు సంబంధించి ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆమె ఎవరితోనైనా శారీరక సంబంధం కలిగి ఉండటానికి సౌకర్యవంతంగా మరియు ఏకాభిప్రాయంతో ఉంటే అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు.

కన్నెపొర ఆధారంగా తీర్పు మానేయాలి..

ఒక స్త్రీ పాత్రను కన్నెపొర ఆధారంగా తీర్పు ఇవ్వడం అనే దానిని మానేయాలి. మన దేశంలో ఇప్పటికీ చాలా మంది ప్రజలు కన్యత్వం అనే ఆలోచనతో ఎన్నో భ్రమల్లో ఉన్నారు. వీటిని వదిలేయాలి. ఇలాంటి విషయాల్లో మహిళలు కూడా ధైర్యంగా ఉండాలి. కన్యత్వం చుట్టూ ఉన్న నిషేధాన్ని వదిలించుకోవాలి.

English summary

I-Virgin: Know About The Pill To Fake Virginity On 'The First Night'

Here we talking about the pill to fake virginity on 'the first night'. Read on
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more