Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Allu Arjun Birthday Special: ‘ఆడా ఉంటా.... ఈడా ఉంటా’.... తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్, ఫ్యామిలీకి సేమ్ టైమ
స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య మనుమడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు. అంతకు మించి మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన అల్లు అర్జున్ ఇప్పుడు తనకంటూ ఓ ఇమేజ్ సంపాధించుకున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి 2003లో గంగోత్రి సినిమాతో హీరో అయిన అల్లు అర్జున్ అతని టాలెంట్ తో దూసుకుపోతున్నాడు.
అగ్ర నిర్మాత అశ్వినిదత్ బ్యానర్ లో అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాలో నటించిన అల్లు అర్జున్ పర్వాలేదు అని పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే అల్లు అర్జున్ కంటే ఆ సినిమాకు పని చేసిన నటీనటులు, టెక్నీషియన్లు అందరూ అప్పటికే ఓ రేంజ్ లో ఉన్న వాళ్లే. తరువాత అల్లు అర్జున అతని ప్రతాపం చూపించాడు.

ఏ సినిమాకు ఆ సినిమానే !
గంగోత్రిలో నిక్కర్ తో కనిపించిన అల్లు అర్జున్ తరువాత ఆర్య, బన్నీ, వేదం, దేశముదురు, జులాయి, బద్రీనాథ్, ఆర్య-2, హ్యాపీ, రుద్రమదేవి, రేసుగుర్రం, డీజే, సన్ ఆఫ్ సత్యమూర్తి, నాపేరు సూర్య, సరైనోడు, అలా వైకుంఠపురం ఇలా చెప్పకుంటూ పోతే 20 ఏళ్లలో అల్లు అర్జున్ ఒక సినిమాకు ఒక సినిమాకు సంబంధం లేకుండా అనేక ప్రయోగాలు చేసి ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

మద్దుగా మల్లు అర్జున్
మలయాలం, హిందీలోకి అల్లు అర్జున్ సినిమాలు చాలా డబ్ అయ్యాయి. మలయాళం స్టార్ హీరోలతో సమానంగా అల్లు అర్జున్ సినిమాలు కేరళలో విడుదల అవుతున్నాయి. మలయళంలో అల్లు అర్జున్ కు ఉండే క్రేజ్ తెలుగులో మరే హీరోకు లేదు. అందుకే మలయాళీలు ముద్దుగా అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. కేరళలో అల్లు అర్జున్ సినిమాలు కోట్ల రూపాయల వసూలు చేస్తుంటాయి.

బ్యాక్ గ్రౌండ్ పక్కన పెట్టిన అల్లు అర్జున్
ఇక ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ గుర్తింపు తెచ్చుకోవడానికి అతను అతని బ్యాక్ గ్రౌండ్ ఏమాత్రం ఉపయోగించుకోలేదని చెప్పాలి. ఎందుకంటే. తాత. తండ్రి, మామ మెగాస్టర్ ఇమేజ్ కు భిన్నంగా తనకంటు ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున ఐకాన్ స్టార్ గు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చిత్తూరు జిల్లా యాసతో వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.

తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్
పుష్పా సినిమా ఓ సంచలనం అయ్యింది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ బాషల్లో వందల కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు బ్రేక్ చేసింది. ఇప్పుడు పుష్ప ది రూల్ సినిమాలో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. మొత్తం మీద అల్లు అర్జున్ అతని బ్యాక్ గ్రౌండ్ పక్కన పెట్టి స్టార్ ఇమేజ్ తెచ్చుకుని ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుని తగ్గేదే లే అంటున్నాడు.

ఫ్యామిలీ కోసం
హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ అంటూ ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమాలకు, అభిమానులకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చే అల్లు అర్జున్ సినిమా షూటింగ్ లు లేని సమయంలో ఫ్రెండ్స్, పబ్ లు, పార్టీలు అని కాకుండా భార్య, పిల్లల కోసం ఎక్కువ సమయం కేటాయించి వారితో గడుపుతుంటాడు. మంచి హీరోగానే కాకుండా మంచి కొడుకుగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా అల్లు అర్జున్ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు.

డైట్ అండ్ ఫిట్ నెస్
జాగింగ్ అల్లు అర్జున్ నడక మరియు జాగింగ్ వంటి వ్యాయామాలతో తన రోజును ప్రారంభిస్తాడు. ఒక ఇంటర్వ్యూలో, అల్లు అర్జున్ ప్రతిరోజూ ఉదయం కనీసం ఒక గంట పాటు జాగ్ చేస్తానని వెల్లడించాడు. అతని రోజు నడక మరియు జాగింగ్‌తో ప్రారంభమవుతుంది.
వర్కౌట్ మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం మనస్సు మరియు శరీరం రెండింటినీ ఫిట్‌గా ఉంచుతుంది. అటువంటి పరిస్థితిలో, నటుడు తన షెడ్యూల్‌లో వ్యాయామ సెషన్‌లను చేర్చడం కూడా మర్చిపోడు. అల్లు అర్జున్ తన ఫిట్‌నెస్ సెషన్‌లో 7 నుండి 8 వర్కవుట్‌లను కలిగి ఉన్నాడు. తనకు సమయం తక్కువగా ఉన్న రోజుల్లో ఫిట్‌నెస్‌ను కూడా తగ్గించుకుంటాడు.
కాలిస్థెనిక్స్ వర్కౌట్ కాలిస్థెనిక్స్ వర్కౌట్ అనేది మీ స్వంత శరీర బరువును నిర్వహించే పద్ధతి, దీనిలో ఇతర పరికరాలు ఉపయోగించబడవు. ఇటువంటి వ్యాయామాలలో పుష్ అప్స్, పుల్ అప్స్, చిన్ అప్స్, డిప్స్, జంప్స్, స్క్వాట్స్, క్రంచెస్ మరియు జంపింగ్ రోప్ ఉంటాయి. అల్లు అర్జున్ ఎక్కువగా ఈ తరహా వర్కవుట్ చేయడానికి ఇష్టపడతాడు.
హెల్తీ డైట్
హెల్తీ డైట్ యాక్టర్ అల్లు అర్జున్ తన శరీరాన్ని ఫిట్ గా మరియు స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి హెల్తీ డైట్ ఫాలో అవుతున్నాడు. అల్లు తన డైట్‌లో తాజా పండ్లు, కూరగాయలను చేర్చుకుంటాడు. అతను నాన్-వెజ్ ఆహారాలకు దూరంగా ఉంటాడు మరియు మోసపూరిత భోజనంగా రోజూ ఒక చాక్లెట్ తింటాడు.



Click it and Unblock the Notifications