For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Importance of Bangles for Women:మహిళలు మట్టిగాజులు వేసుకోవడం వెనుక ఉన్న రీజన్స్ ఏంటో తెలుసా...

భారతీయ సంప్రదాయం ప్రకారం మహిళలు గాజుల ధరించడం వెనుక ఉన్న ప్రాముఖ్యత మరియు ఆయా ప్రాంతాల్లో ఎలాంటి గాజులను ధరిస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రతి ఒక్క భారతీయ మహిళకు చీర కట్టు.. నుదుటిన బొట్టు.. చెవులకు కమ్మలు, కళ్ల కాటుక ఎంత అందాన్ని తెచ్చిపెడుతుందో.. వారి చేతికి ధరించే గాజుల సవ్వడితో చేతులు గలగలా అంటూ శబ్దం చేస్తే తన అందం మరింత పెరిగిపోతుంది.

Importance of Bangles for Women in Indian Culture in Telugu

మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి. అయితే కాలం మారుతున్న కొద్దీ దుస్తులు, ఆభరణాలు ధరించే పద్ధతిలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందులో భాగంగా గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఏ పది మందిని గమనించినా అందులో దాదాపు సగం మంది గాజులు వేసుకున్న వారు కనిపించినా ఆశ్చర్యంగానే అనిపిస్తోంది.

Importance of Bangles for Women in Indian Culture in Telugu

అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా.. వేసుకోకపోయినా పండుగల సమయంలో.. పెళ్లిళ్ల సమయంతో.. ఇతర శుభకార్యాల సమయంలో సంప్రదాయద్ధంగా సిద్ధమైనప్పుడు మాత్రం గాజులు వేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే అమ్మాయిలు గాజులు వేసుకోవడం వల్ల అందమే కాదు.. ఎలాంటి హాని జరగకుండా ఉంటుందని, గాజులు చాలా విషయాల్లో రక్షణగా నిలుస్తాయని పండితులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం, అప్పుడే పుట్టిన పిల్లలకు నల్ల గాజులు వేయడం వల్ల దోషాలు, దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయని, పిల్లలకు, గాజుల శబ్దం ఆనందాన్ని ఇస్తాయి. అంతేకాదు ముత్తైదువుల ఐదో తనానికి గుర్తు గాజులను భావిస్తారు. ఈ సందర్భంగా మహిళలకు గాజులు రక్షగా ఎలా ఉంటాయి.. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో గాజుల వేసుకోవడం వెనుక ఉన్న సంప్రదాయం ఏంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మీ భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చిన్న మార్పులు చేయండి ...!మీ భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చిన్న మార్పులు చేయండి ...!

ఆకుపచ్చ గాజులు

ఆకుపచ్చ గాజులు

పెళ్లైన మహిళలు ఎక్కువగా ఆకుపచ్చని గాజులు ధరించడాన్ని ఇష్టపడతారు. ఆకుపచ్చ రంగుకు హిందూ వివాహ క్రతువుకు విడదీయరాని సంబంధం ఉంది. మహిళలు వారి ఆనందకరమైన వైవాహిక జీవితం కోసం, భర్త సుదీర్ఘ ఆయుష్షు కోసం ఆ పరమశివుని ఆశీర్వాదం పొందడానికి ఆకుపచ్చ రంగు గాజులు మరియు ఆకుపచ్చ దుస్తులను ధరిస్తారు.

లక్ష్మీదేవి స్వరూపులు..

లక్ష్మీదేవి స్వరూపులు..

ఆడపిల్లలు పుట్టిన వెంటనే లక్ష్మీదేవి స్వరూపులుగా భావిస్తారు. అందుకే వారికి పుట్టినప్పటి నుండే గాజులు వేయడాన్ని, వేసుకోవడాన్ని అలవాటు చేస్తారు. గాజులను పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతో పాటు గాజులతోనూ పూజిస్తారు. ముఖ్యంగా మట్టిగాజులను వేసుకోవడం. ముత్తైదుతనాన్ని సూచిస్తుంది.

మట్టి గాజులు..

మట్టి గాజులు..

ఇప్పటి తరం అమ్మాయిలు మట్టి గాజులు వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడటం లేదు. లేటెస్ట్ ఫ్యాషన్ అంటూ ప్లాస్టిక్ గాజులు ఇతర రకాల గాజులను వేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే మట్టి గాజులు వేసుకుంటే శరీరంలో వేడిని అది లాగేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ మీ శరీరం వేడి గుణాన్ని కలిగి ఉంటే మట్టి గాజులు వేసుకోవడం వల్ల అది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీరు బంగారు గాజులు వేసుకునే వారైనా సరే కనీసం ఒక్కటైనా మట్టిగాజు చేతికి ఉండాలని పెద్దలు చెబుతారు.

వాస్తుశాస్త్రం ప్రకారం, హనుమంతుని ఏ భంగిమ ఫోటో ఇంటికి సంపద, శ్రేయస్సును తెస్తుందో మీకు తెలుసా?వాస్తుశాస్త్రం ప్రకారం, హనుమంతుని ఏ భంగిమ ఫోటో ఇంటికి సంపద, శ్రేయస్సును తెస్తుందో మీకు తెలుసా?

హార్మోన్ల బ్యాలెన్స్..

హార్మోన్ల బ్యాలెన్స్..

ప్రస్తుత జనరేషన్ మహిళలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల వారి బాడీలో హీట్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అందుకే గాజులు వేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందే వీలుంటుంది. ప్రస్తుతం చాలా మంది మహిళలకు హార్మోన్ల బ్యాలెన్స్ సమస్య ఎదురవుతోంది. దీని వల్ల రుతుక్రమం కూడా క్రమం తప్పుతోంది. ప్రతి స్థాయిలో ఈ సమస్యతో అనేకమంది బాధపడుతుంటారు. అయితే గాజులు వేసుకోవడం వల్ల ఈ హార్మోన్ల సమస్య చాలా వరకు తగ్గుతుందట.

మానసిక ఆరోగ్యం..

మానసిక ఆరోగ్యం..

మహిళలు మట్టిగాజులు వేసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చట. ఎందుకంటే వారి శరీరంలో హార్మోన్లు బ్యాలెన్స్ గా ఉండటం వల్ల శరీరంలోని అన్ని జీవక్రియలు ఆరోగ్యంగా సాగడం వల్ల మానసికంగానూ ఆరోగ్యంగా ఉండే వీలుంటుంది. అంతేకాదు.. గాజులు సరైన మానసిక సమతుల్యత సాధించడం కోసం తోడ్పడతాయట.

ఏ రంగు గాజులంటే..

ఏ రంగు గాజులంటే..

మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాల్లో శుభకార్యాలకు పచ్చని గాజులను ధరించడం వల్ల శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఉత్తరప్రదేశ్ లో పెళ్లికూతురుకు ఎర్రని గాజులు శుభప్రదంగా భావిస్తారు. పంజాబ్ లో వినూత్నంగా పెళ్లికి 21 రోజుల ముందు నుండి లేదా పెళ్లి తర్వాత సంవత్సరం వరకు ఏనుగు దంతంతో చేసిన గాజులను ధరించడం అనేది సంప్రదాయంగా ఉంటుంది. సిక్కులు తమ ఆచారం ప్రకారం లోహంతో చేసిన గాజును ధరిస్తారు. అక్కడ గాజులను ‘కడ' అని పిలుస్తారు. ఇప్పటికీ ఆదివాసీ, గిరిజన మహిళలు చేతులకు నిండుగా గాజులు ధరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పెళ్లయిన వారికి చిన్న గవ్వలు లేదా ఎర్ర పగడాలతో చేసిన గాజులను చేతులకు వేసుకోవడం ఆచారంగా ఉంది. రాజస్థాన్లో అయితే పెళ్లి చేసుకున్న మహిళలు తమ భర్త బతికి ఉన్నంత కాలం చేతి మణికట్టు నుండి ముంచేతి వరకు ఏనుగు దంతంతో చేసిన గాజులను ధరించేవారు. ఇలా చేయడం వల్ల తమ కుటుంబానికి, భర్తకు, సంతానానికి శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు.

English summary

Importance of Bangles for Women in Indian Culture in Telugu

Here we are talking about the importance of bangles for women in Indian culture Telugu. Have a look
Story first published:Monday, August 16, 2021, 11:44 [IST]
Desktop Bottom Promotion