For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత స్వాతంత్య్ర దినోత్సవం గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు..

1857 అంటే చరిత్ర తెలిసిన వారందరికీ టక్కున గుర్తొచ్చేది సిపాయిల తిరుగుబాటు. భారతదేశంలో తొలి సిపాయిల తిరుగుబాటు కూడా ఆ సమయంలోనే జరిగింది. మంగళ్ పాండే సారథ్యంలో తొలిసారిగా బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఝ

|

ఆగస్టు 15వ తేదీ అంటే అందరికీ తెలిసిందే. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడే రోజు. మన భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారు పోరాటాలు, విప్లవ మార్గాన్ని ఎంచుకోగా.. గాంధీజీ అహింస మార్గంలో ప్రయత్నించి సఫలమైనట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది. వీరు మాత్రమే మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఇంకా మరెంతో మంది మహానుభావులు ఎన్నో త్యాగాలు చేశారు. వారి త్యాగఫలం వల్లనే మనం ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. సో ఈరోజు మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి గల కొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రెండు శతాబ్దాల బ్రిటీష్ పాలన నుంచి విముక్తి..

రెండు శతాబ్దాల బ్రిటీష్ పాలన నుంచి విముక్తి..

అప్పటిదాకా బ్రిటీష్ పాలనలో విసిగి వేసారిన భారతీయులకు 200 ఏళ్ల తర్వాత విముక్తి లభించింది. మన భారతదేశంతో పాటు మరికొన్ని దేశాలకు పంద్రాగస్టు రోజున స్వాతంత్య్రం వచ్చింది. ఇదే రోజున భారత్ తో పాటు కాంగో, బెహ్రయిన్, లీచెన్ స్టీన్, కొరియా వంటి దేశాలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాయి.

బ్రిటీష్ ఆఖరి భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్..

బ్రిటీష్ ఆఖరి భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్..

ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునేందుకు బ్రిటీష్ ఆఖరి భారత వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ మన దేశంలోని అగ్ర నేతలైన జవహార్ లాల్ నెహ్రు, గాంధీజీతో ఇతర పెద్దలకు సూత్రప్రాయంగా తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ తేదీని ఆయన సూచించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. సింగపూర్ లో జపాన్ లొంగిపోయినట్లు.. సౌత్ ఆసియా కమాండ్ కు మౌంట్ బాటెన్ సుప్రీం అలైడ్ కమాండర్ గా వ్యవహరించినట్లు చరిత్ర చెబుతోంది.

కింగ్ జార్జ్ కోసం ఓ గేయం..

కింగ్ జార్జ్ కోసం ఓ గేయం..

చాలా మందికి రవీంద్రనాథ్ ఠాగూర్ మన భారతదేశ జాతీయ గీతాన్ని రచించినట్లు తెలిసిందే. కానీ ఈ గీతాన్ని బ్రిటీష్ కింగ్ జార్జ్ వి గౌరవార్థం ఠాగూర్ రచించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. 1911లో కింగ్ భారత్ వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికే సందర్భంలో ఈ గీతాన్ని రచించినట్లు చరిత్ర చెబుతోంది.

వందేమాతరం ఇలా వచ్చింది..

వందేమాతరం ఇలా వచ్చింది..

మన దేశంలో 'జన గణ మన' తర్వాత అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చింది బంకించంద్ర ఛటర్జీ రచించిన 'వందే మాతరం'. వాస్తవానికి ఇదొక పద్యభాగం అని చరిత్ర ద్వారా తెలిసింది. ఛటర్జీ రచించిన 'ఆనంద్ మఠ్' నవలలోని తొలి రెండు చరణాలను తీసుకుని జాతీయ గేయంగా ప్రకటించినట్లు చరిత్రలో పేర్కొనబడింది.

1857లో ఉద్యమం ప్రారంభం..

1857లో ఉద్యమం ప్రారంభం..

1857 అంటే చరిత్ర తెలిసిన వారందరికీ టక్కున గుర్తొచ్చేది సిపాయిల తిరుగుబాటు. భారతదేశంలో తొలి సిపాయిల తిరుగుబాటు కూడా ఆ సమయంలోనే జరిగింది. మంగళ్ పాండే సారథ్యంలో తొలిసారిగా బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్య తోపే, బహదూర్ షా జాఫర్, నానా సాహెబ్ వంటి మహామహులు పోరాటాలు చేసి తమ ప్రాణాలను త్యాగం చేసినట్లు చరిత్రలో లిఖించబడింది. అంతేకాదు ఇటీవల దీనిపై కొన్ని సినిమాలు సైతం వచ్చాయి.

జమ్మూ-కాశ్మీర్ తటస్థంగా..

జమ్మూ-కాశ్మీర్ తటస్థంగా..

బ్రిటీష్ పాలకులు భారత్, పాకిస్థాన్ విడగొట్టినప్పుడు జమ్మూ-కాశ్మీర్ ను మాత్రం తటస్థంగా వదిలేసినట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులు దీనిపై ఆర్టికల్ 370 ఉన్నందు వల్ల అది అలాగే ఉండిపోయింది. కానీ ఇటీవల పార్లమెంటులో ఆ ఆర్టికల్ ను రద్దు చేయడంతో అవి కూడా భారత దేశంలో అంతర్భాగమయ్యాయి. వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు.

విదేశీ ఉత్పత్తుల బహిష్కరణ..

విదేశీ ఉత్పత్తుల బహిష్కరణ..

1900 సంవత్సరంలో బాల గంగాధర్ తిలక్ స్వదేశీ ఉద్యమం ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన విదేశీ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇందుకు మద్దతుగా సర్ రతన్ జంషేడ్ టాటా, బాంబే స్వదేశీ కో ఆపరేటివ్ స్టోర్స్ కో లిమిటెడ్ ను స్థాపించారు. ప్రస్తుతం అది బాంబే స్టోర్ గా ప్రసిద్ధి గాంచింది.

’జన గణ మన’కే జవహార్ లాల్ నెహ్రు ప్రాధాన్యత..

’జన గణ మన’కే జవహార్ లాల్ నెహ్రు ప్రాధాన్యత..

జాతీయ గీతంగా వందేమతరానికి బదులు 'జన గణ మన' తీసుకుందామని భారత దేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రు నిర్ణయం తీసుకున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆర్మీ బ్యాండ్ లో వాయించేందుకు వందేమాతరం కన్నా 'జన గణ మన' అయితే బాగా సులభంగా ఉంటుందని ఆయన భావించినట్లు చరిత్రలో పేర్కొనబడింది.

భారత్, పాక్ సరిహద్దును నిర్ణయించింది ఆయనే..

భారత్, పాక్ సరిహద్దును నిర్ణయించింది ఆయనే..

భారతదేశం, పాకిస్థాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించింది సిరిల్ జాన్ ర్యాడ్ క్లిఫ్. ఈయన బ్రిటీష్ న్యాయ కోవిదుడు. భారత భౌగోళిక అంశాలపై ఈయనకు పూర్తి అవగాహన లేకుండానే ఈ సరిహద్దును నిర్ణయించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. దీంతో ఆయన తన నిర్ణయంపై తాను మరణించేంత వరకు బాధపడుతుండేవారని బ్రిటీష్ వారు చెప్పేవారు.

ఇండస్ నుంచే ఇండియా..

ఇండస్ నుంచే ఇండియా..

సింధూ (ఇండస్) నది నుంచే ఇండియా అనే పేరు వచ్చినట్లు, దానిని బ్రిటీష్ వారు నామకరణం చేసినట్లు చరిత్ర ద్వారా తెలిసింది. అత్యంత ప్రాచీనమైన సింధూ నాగరికతకు నిదర్శనంగా వారు ఇండియా పేరును పెట్టినట్లు చరిత్రలో పేర్కొనబడింది.

Read more about: insync pulse independence day india
English summary

independence day lesser known facts about india

Cyril John Radcliffe has determined the border line between India and Pakistan. He is a British law student. Throughout history, it is known that he set this boundary without fully understanding the geographical features of India. The British would say that he was worried about his decision until he died.History says that India got its name from the Indus River and was named after the British. It is said in history that they named the India as evidence of the most ancient Indus civilization.
Story first published:Wednesday, August 14, 2019, 18:14 [IST]
Desktop Bottom Promotion