For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Independence Day 2020 : స్వాతంత్య్ర కాంక్షని ఉవ్వెత్తున రగిల్చిన తొలి ఉద్యమమేదో తెలుసా...

స్వాతంత్య్ర పోరాటానికి ముందే తొలి ఉద్యమం చేపట్టిన నాయకుడెవరో తెలుసా.

|

మన దేశంలో మరికొన్ని గంటల్లో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా భారతీయుల తొలి పోరాటాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఆ ఉద్యమమే భారతీయుల్లో బానిసత్వం నుండి విముక్తి పొందేలా.. స్వాతంత్య్ర కాంక్షను ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన తొలి ఉద్యమం.

Independence Day : The Indian Rebellion Of 1857 Remembering Mangal Pandey

అదే 1857 సిపాయిల తిరుగుబాటు. అప్పటివరకు ఆంగ్లేయుల పాలకుల అజమాయిషీని భరిస్తూ నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్యమానికి ఈ సిపాయిల తిరుగుబాటు ఊపిరిపోసింది.

Independence Day : The Indian Rebellion Of 1857 Remembering Mangal Pandey

అప్పటిదాకా అనేక అవమానాలను.. అసమానతలను సైతం ఎంతో ఓపికతో వ్యవహరించిన భారతీయ సైనికులు..తమ మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన ఆంగ్లేయులపై ఒక్కసారిగా తిరగబడ్డారు.

Independence Day : The Indian Rebellion Of 1857 Remembering Mangal Pandey

ఈ తిరుగుబాటు ఉద్యమం భారతదేశ స్వాతంత్య్ర పోరాట రూపాన్ని సమూలంగే మార్చేసింది. 1856లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన జనరల్ బ్రిటీష్ ఎన్ లిస్ట్ మెంట్ చట్టం ప్రకారం సైనికులు బ్రిటీష్ పాలనలోని ఏ దేశంలో అయినా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని తీర్మానించారు. దీంతో కొందరు హిందువులు దీనిపై నిరసన తెలిపారు.

Independence Day : The Indian Rebellion Of 1857 Remembering Mangal Pandey

ఎందుకంటే అప్పట్లో సముద్రంపై ప్రయాణించడాన్ని హిందువులు అపచారంగా భావించేవారు. కానీ.. బ్రిటీష్ వారు మాత్రం ఆ సమయంలో భారతీయుల అభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వలేదు సరికదా.. చాలా హీనంగా చూసేవారు.

Independence Day : The Indian Rebellion Of 1857 Remembering Mangal Pandey

ఈ సమయంలో సైనికుల్లో తిరుగుబాటు జ్వాల రగిలింది. ఇది చల్లారక ముందే మరోసారి బ్రిటీషర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. అదే ఏడాది అంటే 1856లో రాయల్ కంపెనీ ఎన్ ఫీల్డ్ తుపాకులను సైన్యంలో ప్రవేశపెట్టారు.

పందికొవ్వు ప్రచారం..!

పందికొవ్వు ప్రచారం..!

కొత్తగా ప్రవేశపెట్టిన తుపాకుల్లో తూటాలను సిపాయిలు నోటితో కొరికి అమర్చాల్సి వచ్చింది. అయితే వారు ఎక్కడైతే దానిని నోటితో కొరకాలో.. ఆ భాగంలో ఆవు, పందికొవ్వు పూశారనే వదంతులు అంతటా వ్యాపించాయి. దీంతో ఆవును పవిత్రంగా భావించే హిందువులతో పాటు పందిని అపవిత్రంగా భావించే ముస్లింలు ఈ తుపాకుల వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

1857లో

1857లో

1857 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన ప్రయోగాత్మకంగా ఆ తుపాకులను పరీక్షించాలని ఆంగ్లేయులు ఆదేశించగా.. బారక్ పూర్ లోని 19వ దళం సిపాయిలు వ్యతిరేకించారు. దీంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.

మంగళ్ పాండే..

మంగళ్ పాండే..

ఆ తర్వాత 1857 సంవత్సరంలోనే మార్చి 29వ తేదీన అదే బారక్ పూర్ లోని 34వ పటాలానికి చెందిన మంగళ్ పాండే కూడా తూటాను వినియోగించేదే లేదని స్పష్టం చేశాడు. దీంతో అతనిపై బూతుపూరాణం మొదలెట్టిన సైనికాధికారి లెఫ్టినెంట్ బాగ్ ని మంగళ్ పాండే కాల్చి చంపేశాడు. దీంతో క్రమశిక్షణ చర్యల కింద పాండేని ఆంగ్లేయులు ఉరి తీశారు. ఆ తర్వాత 19, 34 పటాలాలను ర్దు చేశారు

అగ్నికి వాయువు తోడైనట్టు..

అగ్నికి వాయువు తోడైనట్టు..

అయితే అప్పటికే ఈ తిరుగుబాటు ఉద్యమం జ్వాలముఖిలా రగిలిపోయింది. అగ్నికి వాయువు తోడైన చందంగా దేశంలోని చాలా ప్రాంతాల్లోని సిపాయిలు ఈ తుటాలను వినియోగించేందుకు నిరాకరించారు. దీంతో వారిని తొలగించి, పదేళ్లు జైలు శిక్ష విధించారు. పాండే తిరుగుబాటు స్ఫూర్తితో, ఢిల్లీ చేరిన సిపాయిలు భక్తఖాన్ ఆధ్వర్యంలో ఎర్రకోటలో ప్రవేశించి బహదూర్ షాని భారతదేశ చక్రవర్తిగా ప్రకటించి, ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు.

తిరుగుబాటు ప్రారంభం..

తిరుగుబాటు ప్రారంభం..

కాన్పూర్ లోనూ నానా సాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటు ప్రారంభమైంది. కానీ... సరైన దిశా నిర్దేశం లేకపోవడంతో ఈ తిరుగుబాటు నీరుగారిపోయింది. బహదూర్ షాని ఆంగ్లేయులు అదుపులోకి తీసుకుని, జైలుకు పంపడంతో ఉద్యమం దారి తప్పింది. ఆ సమయంలో ఆంగ్లేయులు పైచేయి సాధించినా.. ఆ సిపాయిల తిరుగుబాటు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది.

English summary

Independence Day : The Indian Rebellion Of 1857 Remembering Mangal Pandey

Here we talking about independence day 2020:the indian rebellion of 1857 remembering mangal panday. Read on.
Story first published:Friday, August 14, 2020, 18:29 [IST]
Desktop Bottom Promotion