For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరి కొన్ని గంటల్లో అంతరిక్షంలో అడుగు పెట్టనున్న తెలుగమ్మాయి శిరీష....

భారత అమెరికన్ అమ్మాయి శిరీష బండ్ల అమెరికా నుండి స్పేస్ లో అడుగుపెడుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇంతకుముందు భారతదేశం తరపున అంతరిక్షంలోకి అడుగు పెట్టిన భారత మహిళ ఎవరంటే అందరూ సునీతా విలియమ్స్ పేరు చెప్పేవారు. అయితే ఇక నుండి ఆ పేరుతో పాటు అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి తెలుగమ్మాయి ఎవరంటే అందరూ తన పేరే చెప్పేస్తారు.

Indian American Sirisha Bandla to fly into space aboard Virgin Galactic flight from USA

pc : fb

తను చిన్నప్పటి నుండే చంద్రుడిని, చుక్కలను చూస్తూ.. ఎప్పటికైనా వాటిని అందుకోవాలని కలలు గనేది. అందుకోసం తాను ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంది. అయితే తన లక్ష్యానికి కంటి చూపు సమస్యగా మారింది.

Indian American Sirisha Bandla to fly into space aboard Virgin Galactic flight from USA

pc : fb

కానీ ఏ మాత్రం అధైర్యపడలేదు. మరో దారిలో ప్రయత్నించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా అంతరిక్షంలో అడుగుపెట్టాలనే తన కోరిక నెరవేర్చుకోబోతోంది. ఇంతకీ ఆ తెలుగమ్మాయి ఎవరు? ఆకాశపు అంచులను తాకనున్న మన తెలుగింటి ఆడపడుచు గురించి ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం రండి...

అప్పుడు.. నిమ్మరసం అమ్మిన మహిళ.. ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఎలా అయ్యిందో తెలుసా...అప్పుడు.. నిమ్మరసం అమ్మిన మహిళ.. ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఎలా అయ్యిందో తెలుసా...

గుంటూరు శిరీష..

శిరీష బండ్ల.. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. అచ్చ తెలుగమ్మాయి.. పదహారాణాల శిరీష ఆకాశంలోకి అతి త్వరలో అడుగుపెట్టబోతోంది. చిన్నప్పటి నుండే మనందరికీ అందనంత ఎత్తులో ఉండే చుక్కలను, చంద్రుడిని అందుకోవాలని ఆశపడింది. అందుకే పెద్దయ్యాక అస్ట్రోనాట్ అవ్వాలనుకుంది.

ఎయిర్ ఫోర్స్ కోర్సులు..

ఎయిర్ ఫోర్స్ కోర్సులు..

అందుకే తను ఎయిర్ ఫోర్స్ కోర్సులు చదివింది. ఈ కోర్సులు చదివితే పైలట్ అయిన తర్వాత నాసాలో ఛాన్స్ కొట్టొచ్చని ప్లాన్ వేసుకుంది. కానీ తనకు హైస్కూల్ చదివే సమయంలో కంటి సమస్య వచ్చి.. తన కలలకు అడ్డుకట్ట వేసింది. ఎందుకంటే పైలట్ లేదా అస్ట్రోనాట్ అవ్వడానికి కావాల్సిన కనీస అర్హత మంచి కంటిచూపు. దీంతో తాను చాలా నిరుత్సాహ పడింది.

ఇతర మార్గాలు..

ఇతర మార్గాలు..

అయితే ఇంటర్ చదివే సమయంలో ఆమెకు ఒక ప్రైవేట్ స్పేస్ టూరిజం సంస్థ గురించి తెలిసింది. అంతరిక్షంలోకి అడుగు పెట్టాలంటే.. నాసా మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో అవకాశాలున్నాయని తెలుసుకుంది. అంతే తన కలలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇక ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈసారి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పై ఫోకస్ పెట్టింది.

ఇండియాలో మొట్టమొదటి మహిళా డాక్టర్ ఎవరో తెలుసా...ఇండియాలో మొట్టమొదటి మహిళా డాక్టర్ ఎవరో తెలుసా...

‘జిరో గ్రావిటీ’లో..

‘జిరో గ్రావిటీ’లో..

ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే ‘జిరో గ్రావిటీ'లో ప్రయాణించే ఛాన్స్ కొట్టేసింది. ఇక పర్ డ్యూ యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హత సాధించగానే ఉద్యోగంలో చేరిపోయింది. అప్పుడే తనకు టెక్నికల్ తప్ప వ్యాపార పరంగా ఎలాంటి అవగాహన లేదని తెలుసుకుంది. దీంతో జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుండి స్పేస్ ఇండస్ట్రీలో ఎంబిఏ చేసింది. తన ఆసక్తి తెలిసిన ప్రొఫెసర్ కమర్షియల్ స్పేస్ ఫెడరేషన్(CSF)అనే సంస్థ నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. అక్కడ ఇంటర్వ్యూకు హాజరై సెలెక్ట్ అయ్యింది. అలా 2012 సంవత్సరంలో తన కలల రంగంలోని కాలు పెట్టేసింది.

జులై 11న రోదసిలోకి..

జులై 11న రోదసిలోకి..

2015 సంవత్సరంలో వర్జిన్ గాలక్టిక్ కి మారిపోయింది. ఇది కూడా ఒక స్పేస్ టూరిజం సంస్థే. ఇక్కడ బిజినెస్ డెవలప్ మెంట్ అడర్ గవర్నమెంట్ అఫైర్స్ మేనేజర్ గా చేరి, ఏకంగా వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగింది. ఆ సంస్థ లాంచర్ వన్, స్పేస్ షిప్-2 ప్రోగ్రామ్స్ విజయం సాధించడంలోనూ శిరీష కీ రోల్ ప్లే చేసింది. తాజాగా ఈ సంస్థ ఈ నెల ఒక టెస్ట్ స్పేస్ ఫ్లైట్ ను అంతరిక్షంలోకి పంపనుంది. దీనిలో ఈ సంస్థ వ్యవస్థాపకుడు బ్రాన్ సన్, శిరీష్ తో పాటు మరో నలుగురు వ్యక్తులు ప్రయాణించనున్నారు.

English summary

Indian American Sirisha Bandla to fly into space aboard Virgin Galactic flight from USA

Here we are talking about the Indian American sirisha bandla to fly into space aboard virgin galactic flight from USA. Have a look
Desktop Bottom Promotion