For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Forbes:ఈ 4 భారతీయ మహిళలు విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది స్త్రీలలో చోటు సంపాదించారు...

|

మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు ప్రతి ఒక్క రంగంలోనూ రాణిస్తున్నారు. ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్క దాంట్లో పురుషులతో సమానంగా పని చేస్తూ, మహిళల సత్తా ఏంటో చాటుతున్నారు.

వారి సేవలు, గౌరవార్థం ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇదే కారణం. ఈ ప్రత్యేక సందర్భంగా, ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ ఫోర్బ్స్ జాబితాలో వంద మంది అత్యంత శక్తివంతమైన మహిళల పేర్లను విడుదల చేసింది. అందులో నలుగురు భారతీయ మహిళలకు చోటు దక్కింది. ఆ అరుదైన గౌరవం దక్కించుకున్న మహిళలెవరో ఇప్పుడు తెలుసుకుందాం...

Happy Women's Day 2021: మీ ప్రియమైన వారి మనసును తాకేలా ఉమెన్స్ డే విషెస్ ఇలా చెప్పేయండి...Happy Women's Day 2021: మీ ప్రియమైన వారి మనసును తాకేలా ఉమెన్స్ డే విషెస్ ఇలా చెప్పేయండి...

నిర్మలా సీతారామన్..

నిర్మలా సీతారామన్..

ఫోర్బ్స్ విడుదల చేసిన 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు చోటు దక్కింది. 61 ఏళ్ల వయసు ఉన్న సీతారామన్ కు 41వ స్థానంలో నిలిచారు. మన దేశంలో మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రిగా, పూర్తి కాలంలో అదే శాఖలో కొనసాగడం విశేషం. ఆమె 2019 సంవత్సరంలో మే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో నిర్మలా సీతారామన్ పీఎం కేర్స్ ఫండ్ కు 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. సీతారామన్ కూడా చాలా ధైర్యంతో అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్న నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు.

రోష్నీ నాదర్ మల్హొత్రా..

రోష్నీ నాదర్ మల్హొత్రా..

మన దేశంలో ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీలలో ఒకటైన రోష్ని నాదర్ మల్హొత్రా ఫోర్బ్స్ విడుదల చేసిన 2020 అత్యంత శక్తివంతమైన భారతీయ మహిళల్లో 55వ స్థానంలో నిలిచారు. ఈమె 2019 సంవత్సరంలో 54వ స్థానంలో ఉన్నారు. తండ్రి మరియు హెచ్ సిఎల్ వ్యవస్థాపకుడు శివ నాదర్ 2020 జులైలో తన ఏకైక కుమార్తెకు మొత్తం బాధ్యతలను అప్పగించారు. హెచ్ సిఎల్ కు కార్యనిర్వహణాధికారి(CEO)గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, రోష్ని చెన్నైలోని శ్రీ శివసుబ్రమణ్య నాదర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రయోజనం కోసం నడుస్తున్న శివ నాదర్ ఫౌండేషన్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఇది కాకుండా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రజలకు సహాయపడే విద్యాజ్ణాన్ లీడర్ షిప్ అకాడమీ అధ్యక్షురాలు కూడా. 38 ఏళ్ల రోష్ని కెల్లాగ్ స్కూల్ మేనేజ్ మెంట్ నుండి పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం ఈమె భారత దేశంలో ధనిక వ్యాపార మహిళల్లో ఒకరుగా ఉన్నారు.

కిరణ్ మజుందర్ షా..

కిరణ్ మజుందర్ షా..

కిరణ్ మజుందర్ షా గురించి చాలా మందికి తెలుసు. ఫోర్బ్స్ విడుదల చేసిన 100 మంది అత్యంత శక్తివంతమైన భారతీయ మహిళల్లో 68వ స్థానంలో నిలిచారు. బయోకాన్ వ్యవస్థాపకులు మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన కిరణ్ 1978 సంవత్సరంలో ఐర్లాండ్ లోని కార్క్ లో బయోకాన్ కెమికల్స్ లిమిటెడ్ లో ట్రైనీ మేనేజర్ గా చేరారు. ఈమె బెంగళూరులో ఒక అద్దె ఇంట్లో నివసించారు. అక్కడే బయోకాన్ ను గ్యారేజీలో కేవలం 10 వేల రూపాయలతో ప్రారంభించారు. డిసెంబర్ 16, 2020న ఫోర్బ్స్ అధ్యయనం ప్రకారం, కిరణ్ యొక్క నికర విలువ 74.7మిలియన్లుగా వివరించింది. బెంగళూరుకు చెందిన ఔషధ సంస్థ బయోకాన్ కూడా గత సంవత్సరం కరోనావైరస్ ఔషధ పదాన్ని తయారు చేయడానికి అనుమతించింది.

రేణుకా జగ్తీయాని

రేణుకా జగ్తీయాని

ల్యాండ్ మార్క్ గ్రూపునకు అధిపతి అయిన రేణుకా జగ్దియాని ఫోర్బ్స్ విడుదల చేసిన 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల్లో భారతదేశం తరపున 98వ స్థానంలో నిలిచారు. దుబాయ్ కేంద్రంగా ఉన్న ల్యాండ్ మార్క్ గ్రూప్ మల్టీ నేషనల్ కంపెనీ. ల్యాండ్ మార్క్ దుస్తులు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్, మిఠాయి, సౌందర్య సాధనలు మొదలైన వాటిని రిటైల్ చేస్తుంది. ల్యాండ్ మార్క్ ను ప్రియాంక భర్త మిక్కీ జగ్తీయాని 1973లో స్థాపించారు. రేణుకా తన క్రుషి మరియు అంకితభావంతో ల్యాండ్ మార్క్ ను విజయాల దిశగా తీసుకెళ్లారు. నేడు ల్యాండ్ మార్క్ ప్రపంచంలోని ప్రతి మూలకు చేరిపోయి ప్రసిద్ధ సంస్థగా పిలువబడుతోంది. ఫోర్బ్స్ తో పాటు, ఫార్చ్యూన్ మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇంటర్నేషనల్ జాబితాలో రేణుకా తన పేరు నమోదు చేసుకుంది.

English summary

Indian Women who made it to forbes list of world's most powerful women 2020

Every year International Women’s Day is observed on 8 March. It is observed with an aim of acknowledging the achievements of women across the world. Today we have brought a list of Indian women who featured in Forbes list of World’s 100 Most Powerful Women.
Story first published: Monday, March 8, 2021, 8:43 [IST]