Just In
- 38 min ago
బురదలో రొమాన్స్ : ఈ ఫొటో షూట్ ను చూసి తట్టుకోవడం కష్టం.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
- 54 min ago
40 ప్లస్‌లో కూడా ఆ విషయంలో హ్యాపిగా ఉండాలంటే ఈ చిట్కాలను అనుసరించండి..
- 3 hrs ago
సెక్సియెస్ట్ ఏషియన్ మెన్ జాబితాలో యంగ్ రెబల్ హీరో ప్ర‘భాస్‘ స్థానం ‘పది‘లం..
- 4 hrs ago
కడుపు ఎడమ వైపు నొప్పికి గల కారణాలు ఏమిటి?ఈ నొప్పి ప్రమాదకరమా?
Don't Miss
- News
పీఎస్ఎల్వీ హాఫ్ సెంచరీ: రిశాట్ ప్రయోగానికి కౌంట్ డౌన్: తిరుమలలో ఇస్రో ఛైర్మన్..!
- Finance
రూ.5 వేల కోట్లు అప్పు తీసుకుంటాం.. అనుమతివ్వండి: సీజీ పవర్ వినతి
- Sports
క్రీడా అకాడమీని ఏర్పాటు చేసిన జ్వాల గుత్తా!!
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Movies
బాలీవుడ్‌లోకి విజయ్.. లాంచ్ చేయనున్న డైనమిక్ డైరెక్టర్.. కరణ్‌తో చర్చలు సఫలం
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు ఓ ఎంబిఎ స్టూడెంట్ ఎంత పని చేసిందో మీరే చూడండి...
ప్రస్తుత భారతదేశంలో ప్రతిరోజూ చాాలా మంది అనేక చోట్ల ట్రాఫిక్ రూల్స్ ను పాటించకపోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా ట్రాఫిక్ వల్ల జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలను కఠినతరం చేసింది. అయినా చాలా మంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది ఇంటి దగ్గర నుండి వాహనం తీసిన దగ్గరి నుండి వారి గమ్యం చేరేంత వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ ను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వాహనాలను నడుపుతున్నారు. ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
అయితే ట్రాఫిక్ రూల్స్ ను కచ్చితంగా ఫాలో అయితే మనం ప్రాణాలతో పాటు ఇంకా ఎందరో ప్రాణాలను కాపాడొచ్చు అనే విషయాన్ని చాలా మంది గ్రహించాలి. సరిగ్గా ఇలాంటి సమయంలో నిత్యం బిజీగా ఉండే ప్రజలకు మామూలుగా చెబితే అర్థం కాదనుకున్న ఓ ఎంబిఏ విద్యార్థిని ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నం చేసింది. దీంతో అందరూ ఆమె ఆసక్తిగా గమనించారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే..
|
రోడ్డుపై బ్రేక్ డ్యాన్స్ చేస్తూ..
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన శుబీ జైన్ అనే ఎంబిఎ విద్యార్థిని ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందకు అందరికంటే భిన్నమైన శైలిని ఎంచుకుంది. అందరిలాగే చెబితే ఎవరూ పట్టించుకోరని నిర్ణయించుకుంది. అందుకే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బ్రేక్ డ్యాన్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. అందరికీ అర్థమయ్యేలా ట్రాఫిక్ సింబల్స్ ను చూపించింది.

రెడ్ సిగ్నల్స్ పడినప్పుడు..
ఆ విద్యార్థిని కొన్ని గంటల పాటు విరామం లేకుండా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బ్రేక్ డ్యాన్స్ చేస్తూ రెడ్ సిగ్నల్ పడిన వెంటనే వాహనాలకు అడ్డంగా వెళ్లి దయచేసి కాసేపు ఆగండి అని వేడుకుంది.

సీటు బెల్టు పెట్టుకోకపోతే..
అలాగే కారులో ప్రయాణించే వాహనదారులు సీటు బెల్టు పెట్టుకోకపోతే ఏమి జరుగుతుందో చెప్పడానికి తను మరో కొత్త స్టెప్ సైతం వేసింది. అలాగే బైక్ నడిపే వారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఆమె డ్యాన్స్ యొక్క సారాంశం అని కూడా తెలిపింది.

ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్..
వాహనదారులు తమ వాహనాలను ఎక్కడబడితే అక్కడ వాహనాలను పార్క్ చేయడం వల్ల ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో వివరించింది. అలాగే అనవసరంగా హారన్ కొట్టడం వల్ల జరిగే అనర్థాల గురించి తన డ్యాన్స్ తోనే అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది.

ఆమె చేసిన వినూత్నప్రయోగానికి..
ఈ విద్యార్థిని అలా రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ అందరికీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్న విషయం కాస్త సోషల్ మీడియాకు చేరడంతో అది కాస్త వైరల్ అయ్యింది. దీంతో ఆ విద్యార్థిని చేసిన వినూత్న ప్రయోగానికి అందరూ మెచ్చుకుంటున్నారు.

అదే నాకు స్ఫూర్తి..
గతంలో కూడా ఇండోర్ కే చెందిన కొందరు విద్యార్థులు ట్రాఫిక్ సేవలను ప్రజలకు తెలియజేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. దాన్ని చూసి స్ఫూర్తి పొందినట్లు శుబీ జైన్ తెలిపింది.

తన స్నేహితుల మరణం..
గతంలో తన స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల తాను చాలా బాధపడ్డానని తెలిపింది. అందుకే ఎలాగైనా ప్రజల్లో ట్రాఫిక్ నియమ నిబంధనల పట్ల అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నానని, మైకెల్ జాక్సన్ స్టెప్పులతో ట్రాఫిక్ నియంత్రించడం మొదలుపెట్టానని తెలిపారు.
గతంలో ఓ ట్రాఫిక్ పోలీస్ డ్యాన్స్..
ఇంతకు ముందు ట్రాఫిక్ పోలీస్ రంజింత్ సింగ్ ఒకరోజు ఇలాగే బ్రేక్ డ్యాన్స్ వేస్తూ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు తనదైన శైలిలో స్టెప్పులు వేస్తూ అవగాహన కల్పించాడు. సో ఇప్పటి నుండైనా ప్రయాణికులు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రూల్స్ పై అవగాహన పొందితే ట్రాఫిక్ పోలీసుల అవసరమే ఉండదన్న మాట.