Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
‘108’ నెంబరుకు ఎందుకంత ప్రాధాన్యత ఉందో తెలుసా...
108 సంఖ్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
'108' నంబరు చెప్పగానే ఇప్పటితరం వారందరికీ టక్కున గుర్తొచ్చేది అంబులెన్స్ వాహనం.. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా... అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఈ నెంబరుకు ఫోన్ చేస్తుంటారు.. ఆ వాహనం కూడా సంజీవని మాదిరిగా కొద్ది క్షణాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుంటుంది.

ఆపదలో ఉన్న వారికి ప్రథమ చికిత్స చేసి.. వారి ప్రాణాలను రక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ వాహనానికి 108 నెంబరును ఎందుకు కేటాయించారు.. అసలు 108కి ఎందుకంత ప్రాధాన్యత ఉందని విషయం అతికొద్ది మందికే తెలుసు.

ఎందుకంటే ఈ 108 నెంబరుకు హైందవ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంఖ్యను ప్రపంచంలోని చాలా మతాల వారు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకని దీన్ని అంత పవిత్రంగా భావిస్తారు.. దీనికి ఎందుకు అంత ప్రాధాన్యత ఏర్పడిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

జపమాలలో 108 పూసలు..
హిందువులు ఏదైనా జపం చేసేటప్పుడు జపమాలను ఉపయోగిస్తుంటారు. ఇందులోనూ 108 పూసలు ఉంటాయి. పురాణాల ప్రకారం తాండవంలో కూడా 108 రకాల కదలికలు ఉంటాయి. పరమేశ్వరుడు ఉగ్రరూపం దాల్చినప్పుడు చేసే నాట్యం చేస్తాడు. దాన్నే తాండవం అంటారు. వైష్ణవ, దివ్య దేశాలు కూడా 108 ఉంటాయి.

గంగానదికి 108 కొలతలు..
మన దేశంలోనే అత్యంత పెద్ద నది... ఎన్నో రాష్ట్రాలకు జీవనదిగా ఉన్న గంగానదికి 108 కొలతలు ఉంటాయి. ఈ గంగానది యొక్క అక్షాంశం 9 కాగా రేఖాంశం 12. ఈ రెండు సంఖ్యలను గుణిస్తే కూడా 108 సంఖ్యే వస్తుంది.

భరత నాట్యంలోని భంగిమలు 108..
మన దేశంలో భరత నాట్యం ఎంత ప్రసిద్ధి గాంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భరత నాట్యంలో కూడా 108 భంగిమలు ఉంటాయి.

108 నక్షత్ర పాదాలు..
పురాణాల ప్రకారం.. ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి 108 నక్షత్ర పాదాలలో భాగమేనట. నక్షత్రాలు 27 ఉంటాయి. ఒక్కోదానికి నాలుగు పాదాలు ఉంటాయి. వీటిని గుణించినా కూడా 108 సంఖ్య వస్తుంది. అలాగే రాశిచక్రాలు 12. గ్రహాలు 9 ఉంటాయి. ఈ రెండింటిని గుణిస్తే వచ్చే సంఖ్య కూడా 108.

నేటి విజ్ణానం ప్రకారం..
వేదాలు, విజ్ణానం ప్రకారం భూమి, సూర్యుడి మధ్య దూరం.. సూర్యుని వ్యాసానికి 108 రెట్లు. భూమి కంటే సూర్యుని వ్యాసం 108 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా భూమికి, చంద్రునికి మధ్యదూరం.. చంద్రుని వ్యాసానికి 108 రెట్లు.

108 దాటితే..
మన శరీరంలోని టెంపరేచర్ జ్వరం వల్ల 108 డిగ్రీలు దాటితే.. శరీరంలోని చాలా భాగాలు చచ్చుబడతాయి. అందుకే డాక్టర్లు మన బాడీ టెంపరేచర్ 100లోపే ఉండాలని చెబుతూ ఉంటారు.

ప్రాణాలు కాపాడే సంజీవని..
ఇవొక్కటే కాదు.. ఇతర మతాల్లో.. ఇతర రంగాల్లో కూడా 108కి చాలా ప్రాధాన్యముంది. అందుకే ఈ 108 సంఖ్యను ప్రాణాలు కాపాడే సంజీవని లాంటి అంబులెన్సులకు కేటాయించారు.

జైన మతంలో..
జైన మతంలో కూడా 108 రకాలుగా కర్మ ప్రవాహం ఉంటుంది. కోపం, గర్వం, మోసం మరియు దురాశ అనే నాలుగు కాశ్వేన్లు ఉంటాయి. మనసు, వాక్కు, కర్మ అనే మూడు కారణాల కూడా ఉంటాయి. ఇలాంటి సంఖ్యలన్నింటినీ గుణిస్తే కర్మ ప్రవాహ సంఖ్య 108 వస్తుంది.

జపాన్ లో బౌద్ధ దేవాలయాల్లో..
జపాన్ దేశంలోని బౌద్ధ దేవాలయాల్లో పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు బౌద్ధ దేవాలయాల్లో 108 సార్లు గంటను మోగిస్తారు. ఇవి భూమిపై మానవుడు 108 ప్రలోభాలను అధిగమించి, కైవల్యాన్ని సాధించాలని సూచిస్తాయి.

సిక్కు మతంలో కూడా..
సిక్కు మతంలో కూడా 108 ముడులు ఉన్న ఉన్నితో చేయబడిన మాలను పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే సంస్క్రుత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వీటికి స్త్రీ, పురుష రూపాలుంటాయి. వీటిని కలిపితే కూడా 108 సంఖ్య వస్తుంది.



Click it and Unblock the Notifications