For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రముఖ సీనియర్ నటి కమలాకుమారి జయంతిగా ఎలా మారిందో తెలుసా...

ప్రముఖ టాలీవుడ్ మాజీ నటి జయంతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

సీనియర్ నటి జయంతి సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారన్న సంగతి తెలియడంతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

Interesting Facts About Veteran Actress Jayanthi in Telugu

ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని ప్రముఖులు చెబుతున్నారు. తన మరణం గురించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Interesting Facts About Veteran Actress Jayanthi in Telugu

బెంగళూరులో పుట్టిన సీనియర్ నటి జయంతి తెలుగు చిత్ర పరిశ్రమతో దక్షిణాదిలో ఏయే సినిమాల్లో నటించారు.. అసలు తను సినిమా రంగంలోకి ఎలా అడుగుపెట్టారనే విషయాలతో తన లైఫ్ స్టైల్ గురించి ఓసారి తెలుసుకుందాం...

Mirabai Chanu : మట్టిలో మాణిక్యం మీరాబాయి.. ఒకప్పుడు దుంగలు మోసింది.. ఇప్పుడు దేశ మణిపూసగా మారిపోయింది...Mirabai Chanu : మట్టిలో మాణిక్యం మీరాబాయి.. ఒకప్పుడు దుంగలు మోసింది.. ఇప్పుడు దేశ మణిపూసగా మారిపోయింది...

జయంతి జననం..

జయంతి జననం..

1945 సంవత్సరం జనవరి ఆరో తేదీన కర్నాటకలోని బెంగళూరులో జన్మించారు. ఈమె అసలు కమలకుమారి.. ఈయన తండ్రి పేరు బాలసుబ్రహ్మణ్యం. తల్లి పేరు సంతాన లక్ష్మీ. వీరికి ముగ్గురు పిల్లలు. వారిలో జయంతి పెద్ద కుమార్తె. తనకు ఇద్దరు సోదరులు ఉన్నారు.

చిన్నతనంలోనే..

చిన్నతనంలోనే..

జయంతి చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. అప్పుడు జయంతిని తీసుకుని తన తల్లి మద్రాసు పట్టణం వెళ్లి పోయింది. జయంతి తండ్రి సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేసేవారు. సంతానలక్ష్మీకి తన కూతురికి మంచి నాట్యం, కళాకారినిగా చేయాలనే కోరిక ఉండేది. అప్పుడే మద్రాసు పాఠశాలలో కమలకుమారి ప్రముఖ నర్తకి, నాట్య విదుషీమణి చంద్రకళ వద్ద నాట్యం నేర్చుకున్నారు.

సినీ ప్రవేశం..

సినీ ప్రవేశం..

ఒకరోజు తోటి స్నేహితులతో కలిసి కన్నడ సినిమా షూటింగ్ చూడటానికి వెళ్లింది. ప్రముఖ కన్నడ సినిమా డైరెక్టర్ వై.ఆర్.స్వామి కమలకుమారిని చూసి వెంటనే ముగ్గురు హీరోయిన్లలో తనకు కూడా ఒక అవకాశం ఇచ్చారు. అలా 1963వ సంవత్సరంలో కన్నడ చిత్రం ‘జెనుగోడు'సినిమాతో జయంతి సినిమా నటిగా రంగ ప్రవేశం చేశారు. అప్పుడే కమలాకుమారి పేరు చాలా మందికి నచ్చదనే ఉద్దేశంతో ఆమె పేరును జయంతిగా మార్చారట.

సీనియర్ నటులతో..

సీనియర్ నటులతో..

ఆ తర్వాత కన్నడలో చిన్న చిన్న చిత్రాలు చేసుకుంటూ బాగా పాపులర్ అయ్యింది. అదే సమయంలో తెలుగు, తమిళం, మళయాళం, హిందీ సినిమాల్లోనూ నటించింది. అన్ని భాషల్లోనూ ఈమె సొంతంగానే డబ్బింగ్ చెప్పుకునేది. తెలుగులో ‘స్వాతి కిరణం', ‘రాజా విక్రమార్క' ‘జస్టిస్ చౌదరి' ‘అల్లూరి, సీతారామరాజు' ‘పెద రాయుడు'తో పాటు ఎన్నో ప్రముఖ చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించారు. ఎంజీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, క్రిష్ణ, చిరంజీవి, వెంకటేష్, రజనీకాంత్, మోహన్ బాబు వంటి టాప్ స్టార్లతో నటించి మెప్పించారు. అంతేకాదు నెగిటివ్ రోల్స్ లోనూ ఈమె పాత్ర మరువలేనిది.

500కు పైగా సినిమాల్లో..

500కు పైగా సినిమాల్లో..

సీనియర్ నటి జయంతి తెలుగు, తమిళం, మళయాళం, కన్నడతో పాటు హిందీ భాషల్లో దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించారు. అంతేకాదు ఓ ఇంగ్లీష్ సినిమాలోనూ నటించారు. అన్ని భాషల్లోనూ సీనియర్ నటులతో కలిసి నటించి మెప్పించారు. ఆ తర్వాత అమ్మ పాత్రలు, బామ్మ పాత్రలలో కనిపించి అందరినీ అలరించారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా ఆమె సినిమా రంగంలో నటిగా సేవలందించారు. విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకుని.. ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే కన్నడలో ఆమెకు నటిగా మంచి పేరు వచ్చింది.

ఎన్నో అవార్డులు..

ఎన్నో అవార్డులు..

జయంతి నటనకు ఎన్నో అవార్డులు లభించాయి. 1965 సంవత్సరంలో ‘మిస్ లీలావతి' అనే కన్నడ సినిమాలో స్విమ్మింగ్ సూట్ లో నటించారు. ఈ పాత్రకు గాను ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డును సైతం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సీనియర్ నటి సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. 1998 సంవత్సరంలో లోక్ సభ ఎన్నికల్లో లోకశక్తి పార్టీ తరపున చిక్ బళ్లాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999లో జరిగిన కర్నాటక శాసనసభ ఎన్నికలలో కోరటగీరె నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.

English summary

Interesting Facts About Veteran Actress Jayanthi in Telugu

Here we are talking about the interesting facts about veteran actress jayanthi in Telugu. Have a look
Story first published:Monday, July 26, 2021, 12:32 [IST]
Desktop Bottom Promotion